Top

ఫుల్ గానే అమ్ముడుపోయే సుబ్రహ్మణ్యం ఫర్ సేల్

ఫుల్ గానే అమ్ముడుపోయే సుబ్రహ్మణ్యం ఫర్ సేల్

Source: General

By:

Critic's Rating: 3/5

Saturday 26 September 2015

Movie Title

ఫుల్ గానే అమ్ముడుపోయే సుబ్రహ్మణ్యం ఫర్ సేల్

Director

Harish Shankar

Star Cast

Sai Dharam Tej, Regina, Adah Sharma

స్టొరీ మెయిన్ ఐడియా : ప్రతీ నిముషాన్ని డబ్బు సంపాదన కోసం ఆలోచించే కుర్రాడి కధేఈ సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ ...

స్టొరీ : సుబ్రహ్మణ్యం( సాయి ధరం తేజ్) అమెరికా లో పార్ట్ టైం జాబ్స్ చేస్తూ ఉంటాడు .అయితే అమెరికా వచ్చింది మాత్రం పూర్తి సంపాదనకే  అని ,ఆ రూల్ ని ప్రతీ విషయం లో  ఎప్పుడూ నిజం చేస్తూ ఉంటాడు ఈ సుబ్రహ్మణ్యం .అయితే సీత (రెజినా) ఒక అమెరికా అబ్బాయిని ప్రేమిస్తుంది.అతని కోసం పెళ్లి నికాదనుకుని అమెరికా వచ్చేస్తుంది . అయితే ప్రేమించిన వాడు బ్యాడ్ అని తెలుసుకునిబాధపడుతుంది . ఆ టైం లో ఎవరూ లేని అమెరికా లో సుబ్రహ్మణ్యం సీత ని ఆదుకుంటాడు. సుబ్రహ్మణ్యం చేసే హోటల్ లో కుక్ గా చేరి , అమెరికా లోస్టడీ కంటిన్యు చేయాలనీ సీత భావిస్తుంది . ఇలా ఇద్దరి ప్రయాణం మొదలవుతుంది .

 అనుకోకుండా డబ్బు కోసం అబద్ధపు జంటగావీళ్ళు ఒక ఫంక్షన్ లో ఉండాల్సి వస్తుంది . ఆ తర్వాత ఈ అబద్ధాన్ని కొనసాగించాల్సివస్తుంది . సుబ్రహ్మణ్యం చెల్లి పెళ్లి , సీత చెల్లి పెళ్లి ఫిక్స్ అవ్వడం తో ఇద్దరూఇండియా వస్తారు .

ఇక్కడ సుబ్రహ్మణ్యం ను వెంటాడే ఒక విలన్ అజయ్ ఉంటాడు . సీత కుటుంబాన్ని పగపట్టిన విలన్ రావు రమేష్ ఉంటాడు . ఈ రెండు విలన్స్ మధ్య లో సుబ్రహ్మణ్యం ,సీత లఅబద్ధపు జంట ఎలా ఇబ్బంది పడ్డారు ? చెల్లి పెళ్ళిళ్ళ కోసం సుబ్రహ్మణ్యం ,సీత ఏమిచేసారు ? చివరికి అబద్ధపు ప్రేమ జంట ఎలా కలిసింది ? అనేది మిగిలిన కధ ...

స్క్రీన్ ప్లే : సినిమా అంతా డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ లోనే సాగుతుంది .మధ్యలో చిన్న చిన్న ఫ్లాష్ బ్యాక్ లు ఆయా క్యారక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ లతో ఓపెన్చేసారు .

స్టార్టింగ్ : రెజినా ప్రాబ్లం తో స్టార్ట్ అవుతుంది సినిమా  . రెజిన పెల్లికుతురుగా వుండి ,అక్కడ నుండిపారిపోతుంటే  రావురమేష్ వచ్చి ,హెల్ప్చేస్తూనే వార్నింగ్ ఇస్తాడు . రావు రమేష్ కి రెజినా ఫ్యామిలీ కి మధ్య విరోధం ని ఒకసీన్ లో ఇక్కడ చెప్పేస్తారు. రెజినా అమెరికా వస్తుంది.

హీరో ఇంట్రడక్షన్ : రెజినా వాయిస్ ఓవర్ తో నేను ప్రేమించిన వాడు –అమెరికా లోఅనగానే హీరో ని చూపిస్తారు ..ఒక ఇన్సిడెంట్ తో ఫైట్ కి లీడ్ ఇచ్చి , హీరోక్యారక్టర్ ని ఎస్టాబ్లిష్ చేసి ఫస్ట్ సాంగ్ వేసారు ..

హీరో –హీరోయిన్ అనుకోకుండా ఎయిర్ పోర్ట్ లో మీట్  అవుతారు . ఇక్కడ బ్రహ్మానందం ఎంట్రీ. ఇక్కడనుండికధ లో మలుపులు మొదలు అవుతాయి .

టర్నింగ్ పాయింట్ 1 : హీరోయిన్ కి తను ప్రేమించిన వాడితో ఎంగేజిమేంట్ ,అదిబ్రేక్ అవ్వడం. హీరోయిన్ ని హీరో కాపాడి ,షెల్టర్ ఇవ్వడం . వీరిద్దరి జర్నీస్టార్ట్ అవుతుంది.

ప్లే 1 : హీరో –హీరోయిన్ లు మనీ కోసం ఒక అబద్దపు నాటకం ఆడటం .అందులో గెలుపొందటం . హీరో–హీరోయిన్ దగ్గర అవ్వడం . ఇది సినిమా కధ ను ముందుకు నడుపుతూ వెళ్తుంది .

మిడ్ పాయింట్ : హీరో –హీరోయిన్ ల చెల్లిల్ల  పెళ్ళిళ్ళ కోసం ఇద్దరూ ఇండియా వస్తారు . అయితేహీరోయిన్ –హీరో ను తన తో పాటు రమ్మని చెప్పడం తో హీరో –హీరోయిన్ ఇంటికి వస్తుంటాడు. ఇక్కడే ట్విస్ట్ ...హీరో ని వెదికే ఒక బ్యాచ్ వుంటారు . విలన్ -2 అజయ్ ,ఆదా శర్మపరిచయం అవుతారు . ఇక్కడ ఒక యాక్షన్ ఫైట్ తో బ్రేక్ ఇచ్చారు ....

---------------------------మిడ్ పాయింట్--------------------------------------

ప్లే 1 కంటిన్యూ : హీరో- హీరోయిన్ లు నిజం చెప్పాలని వచ్చి ,నిజం చెప్పలేకఅబద్ధాన్ని కొనసాగించేలా పరిస్థితులు వుంటాయి ..

ఫ్లాష్ బ్యాక్ : హీరో ని అజయ్ ఎందుకు తరుముతున్నాడో  -అనే ప్రశ్నకి సమాధానం గా ఒక ఎపిసోడ్ .. అజయ్చెల్లి ఆదాశర్మ పెళ్లి ఎపిసోడ్ రన్ చేస్తారు . పెళ్లి లో నుండి  హీరో వెళ్ళిపోవడం తో ఆ ఎపిసోడ్ కంప్లీట్అవుతుంది .

సినిమా లో రావు రమేష్ హీరోయిన్ ని గుడి లో  చూసి తీసుకెళ్లాలని చూస్తె ,అక్కడ రావు రమేష్ కిఅడ్డం వెళతాడు హీరో . ఫైట్ చేసి హీరోయిన్ ని కాపాడుకుంటాడు .

ఫ్లాష్ బ్యాక్ 2: ఇక్కడ హీరో పెళ్లి లోంచి ఎందుకు పారిపోయిన విషయం ఓపెన్చేస్తారు .

క్యారక్టర్ ఎంట్రీ : ఫస్ట్ హాఫ్ లో వున్న బ్రహ్మానందం , విలన్ గ్రూప్ అందరూ పెళ్లిలో చేరతారు . వీళ్ళందరినీ హీరో బంధువులుగా మారుస్తారు .కామెడి జరుగుతూ , రోమాన్స్సీన్స్ జరుగుతూ సినిమా ముందుకు వెళ్తుంది .

ఫ్లాష్ బ్యాక్ 3 : అదా శర్మ తన అన్న అజయ్ కి తన లవ్ స్టొరీ చెబుతుంది . ఒకకామెడి లవ్ స్టొరీ . అది ఫెయిల్ అయ్యింది అని చెబుతుంది . దానితో అజయ్ హీరో వద్దకుబయల్దేరుతాడు .

ప్రీ క్లైమాక్ష్ : హీరోయిన్ చెల్లి పెళ్లి జరుగుతుండగా ,కధలో జరుగుతున్నఅబద్ధాన్ని రావు రమేష్ ఓపెన్ చేస్తాడు . దానితో హీరోయిన్ అసలు విషయం చెబుతుంది . హీరోని అజయ్ తీసుకెళతాడు .

క్లైమాక్ష్ : ఒక ఊహించని మలుపు తో హీరో హీరోయిన్ లు కలసిపోతారు .

   

సినిమా కి కలిసొచ్చే అంశాలు :

1.     సాయి ధరం తేజ్ యాక్టింగ్,రెజిన తో కెమిస్ట్రీ

2.     సరదాగా సాగిపోయే కధనం

3.     చిరంజీవిని ,పవన్ కళ్యాన్ని గుర్తుకు తెచ్చే సీన్ లు

4.     ఫ్యామిలీ లకు పట్టేసెంటిమెంట్స్

5.     సినిమా లో కలిసిపోయినరోమాన్స్

సినిమా ఈక్వేషన్ :

బావగారు బాగున్నారా  (లేదా) అల్లుడుగారు వచ్చారు పాయింట్  + లేటెస్ట్ కామెడీ =సుబ్రహ్మణ్యం ఫర్ సేల్

సినిమా ఎవరికీ నచ్చుతుంది :

1.     యూత్ ఈ సినిమా ని ఎంజాయ్చేస్తారు .

2.     ఫ్యామిలీ లకు సినిమాపడుతుంది . వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారు .

ఫైనల్ వర్డ్ : సినిమా ఫుల్ సేల్ 

recent reviews

Keshu Ee Veedinte Naadhan

Time pass comedy entertainer

Plan Panni Pannanum

Average comedy entertainer

Velan

Decent rural family entertainer

Meow

Soubin Shahir and Mamta Mohandas shine in this conventional film

Read more

galleries