Top

ఫ్యామిలీ ఎంటర్ టైనర్ - పండగ చేస్కో

ఫ్యామిలీ ఎంటర్ టైనర్ - పండగ చేస్కో

Source: General

By: Durga Ramesh

Critic's Rating: 3/5

Saturday 30 May 2015

Movie Title

ఫ్యామిలీ ఎంటర్ టైనర్ - పండగ చేస్కో

Director

Gopichand Malineni

Star Cast

Ram, Rakul Preet Singh, Sonal Chauhan, Brahmanandam

1. స్టోరీ మెయిన్ ఐడియా ( ప్రిమైస్ )  :- నలుగురు అన్నదమ్ములు, నలుగురు అక్కా చెల్లెల్లు పెళ్ళి చేసుకున్న తర్వాత , వీరి చెల్లిలి  కారణంగా భార్యలను దూరం పెడ్తారు. ప్రొబ్లెమ్ ని తీర్చడానికి చెల్లెలి కొడుకు రావడమే సినిమా మెయిన్ ఐడియా.

2. స్టోరీ :- కార్తీక్ (హీరో రామ్) ఒక మల్టిమిలియనీర్. ఒక గేమింగ్ కంపెనీని ఫారిన్ లో నడుపుతూ ఉంటాడు. కార్తీక్ లాంటి ఆలోచనలు గలిగి,ఫాస్ట్ గా  ఉండే మరొక మల్టిమిలియనీర్ స్వీటి (సోనాల్ ). వీళ్ళిద్దరూ వాళ్ళ కంపెనీ డవలెప్మెంట్స్ కోసం నిత్యం ఆలోచిస్తుంటారు. స్వీటి  – ఒక ఇండియన్ ని పెళ్ళి చేసుకోవాలని, లేక పొతే ఆస్తి అంతా ట్రస్ట్ కు వెళ్ళి పోతుంది అని  అతని తండ్రి కండిషన్ పెడ్తాడు పరిస్ధితిలో తన పి. వీకెండ్ వెంకట్రావ్ ( బ్రహ్మానందం ) కి ఒక పెళ్ళికొడుకును వెదకమంటుంది. వీకెండ్ వెంకట్రావ్ ని కార్తీక్ కలిసి, స్వీటి తో కంపెనీ టై అప్ చేసుకోవాలనే ప్లాన్ లో ఉంటాడు. స్వీటి  నికార్తీక్ ని కలిపేస్తాడు వీకెండ్ వెంకట్రావ్. వీళ్ళిద్దరూ పెళ్ళికి ఫిక్స్ అయి, ఎంగేజ్ మెంట్ చేసుకుంటారు. ఇక్కడే కధ మలుపు తీసుకుంటుంది

ఇండియాలో కార్తీక్ (హీరో రామ్కంపెనీ మీద పొల్యూషన్ బేస్ మీద కేస్ పెడుతుంది దివ్య ( రకుల్ ). దాని తో కార్తీక్ హైదరాబాద్ వస్తాడు. కార్తీక్దివ్య  ని చూసి లవ్ లో పడ్తాడు. ఆమె ప్రేమ పొందటానికి చాలా కష్టపడ్తాడు. కానీ దివ్య  - కార్తీక్ ప్రేమలో పడదు. అయితే దివ్య కంటూ ఒక ప్రాబ్లెమ్ ఉంటుంది. దివ్య కి ఉన్న ప్రాబ్లెమ్ ని సాల్వ్ చేయడానికి కార్తీక్దివ్య  కుటుంబం లోకి వెళ్తాడు. అలా వెళ్ళిన కార్తీక్ కి నలుగురు అన్నదమ్ములు, వాళ్ళ చెల్లెలు కారణంగా వాళ్ళ భార్యలను విడిచిపెట్టి ఉంటారు. వీళ్ళందరినీ కలపడం కోసం కార్తీక్ ఏం చేస్తాడు? దివ్య ను చేసుకునే కార్తీక్ కి స్వీటి ఎలా ట్విస్ట్ ఇచ్చింది? వీకెండ్ వెంకట్రావ్కార్తీక్ ఆడిన గేమ్ లో ఎలా ఇబ్బంది పడ్డాడన్నాదే కధ.

3. స్క్రీన్ ప్లే

సెటప్ :-  సినిమా డైరెక్టర్ పాయింటాఫ్ వ్యూ తో స్టార్ట్ అవుతుంది. సినిమా కధకు కావాల్సిన విలన్ ని, హీరోయిన్ ని కధ లో మెయిన్ ప్రాబ్లెమ్ ని ఎస్టాబ్లిష్ చేస్తారు. నాన్నసంపత్  కి ,మాయయ్య సాయికుమార్ కి లెటర్ రాసి ,హీరోయిన్ రకుల్  హైదరాబాద్ కి వచ్చేస్తుంది . తర్వాత హీరో ఇంట్రడక్షన్, హీరో ఫ్యామిలీ అంతా పరిచయం చేస్తారుహీరో రామ్సెకండ్ హీరోయిన్ సోనాల్ కలయిక కోసం వీకెండ్ వెంకట్రావ్ గా బ్రహ్మానందం  క్యారెక్టర్ వస్తుంది. క్యారెక్టర్ వలన హీరో రామ్సెకండ్ హీరోయిన్ సోనాల్ ఎంగేజ్ మెంట్ దాకా వెళ్తారు. ఇక్కడ వరకు క్యారెక్టర్స్ పరిచయం అయిపోతుంది.

టర్నింగ్ పాయింట్ :- హీరోయిన్ రకుల్హైదరాబాద్ లో ఉన్న రామ్ బయోలాజికల్ ఫ్యాక్టరీ మీద పొల్యూషన్ కేస్ పెడ్తుంది. దాని తో రామ్ హైదరాబాద్ కి వస్తాడు. రామ్ రకుల్ ని ప్రేమిస్తాడు. రకుల్ -రాం ని లవ్ చేయదు .అయితే రాకుల్  ని లవ్ లో దింపడానికి, హీరో రామ్ రకుల్ ఫ్రెండ్ ని లైన్ లో పెడుతూ వెళ్తాడు. ఇప్పుడు రకుల్ ని చంపడానికి తిరిగే విలన్స్ వస్తారు . రకుల్ ని చంపడానికి వచ్చిన విలన్స్ ని కొట్టిపడేసి రామ్ కధ కి ట్విస్ట్ ఇస్తాడు

మిడ్ పాయింట్ :- రకుల్ ని ఫ్యాక్టరీ మీద కేస్ పెట్టేలా చేసిందే నేను అంటాడు( హీరో రామ్ ). ఇంటర్వెల్ తర్వాత హీరో రామ్ అసలైన ఫ్లాష్ బ్యాక్ ఓపెన్ చేస్తాడు.

ఫ్లాష్ బ్యాక్ :- సాయి కుమార్ కి నలుగురు చెల్లెల్లు. సాయి కుమార్ కి ఫ్రెండ్ సంపత్. సంపత్ కి ఒక చెల్లెలు + 3 తమ్ముళ్ళు. రెండు కుటుంబాలలో అన్నదమ్ములు, అక్కా చెల్లెల్లు పెళ్ళిళ్ళు అవుతాయి. కానీ సంపత్ చెల్లెలు రావు రమేష్ ని ప్రేమిస్తే దానికి సాయి కుమారే హెల్ప్ చేస్తాడు. దాని మూలంగా సంపత్ సాయి కుమార్ పై కోపం, పగ పెంచుకుంటాడు. సంపత్ తను, తన తమ్ముళ్ళ భార్యల్ని ఇంటి నుండి సాయికుమార్ దగ్గరికి  పంపించేస్తాడు. కధ లో ఇదే పెయిన్దీన్ని తీర్చాలి ఇదంతా సంపత్ చెల్లి వలన జరిగింది. చెల్లి కొడుకే హీరో రామ్.  

హీరో గేమ్ :- ఇక హీరో గేమ్ మొదలు పెడ్తాడు. గేమ్ లో భాగంగా టెంట్ హౌస్ ఫార్ములా వాడి అందరినీ దగ్గర చేరుస్తుంటాడు. ఇంకో పక్క హీరోయిన్ రకుల్ కూడా హీరో రామ్ ప్రేమ లో పడుతుంది. అయితే ఎంగేజ్ మెంట్ అయిన సోనాల్  రాక తో మళ్ళి కధ మలుపు తిరుగుతుంది.

టర్నింగ్ పాయింట్ - 3 :- సోనాల్ రాక తో కన్ఫూజన్ డ్రామా మొదలేతుంది. ఇది చిరికి చిరికి గాలి వాన అయ్యే సమయానికి బెజవాడ బ్రదర్స్ వచ్చి సోనాల్ ను కిడ్నాప్ చేస్తారు.

ప్రీ క్లైమాక్స్ :- హీరోయిన్ రకుల్ ని కూడా కిడ్నాప్ చేస్తారు మెయిన్ విలన్. హీరో వచ్చి రకుల్ ని కాపాడి, సంపత్ కి అసలు విషయం అంతా చెబుతాడు. అన్న-చెల్లెల్ని , సాయి కుమార్ కలిసిపోతారు.

ఎండింగ్ :- హీరో హీరోయిన్ కలయిక. సోనాల్ రకుల్ ని ప్రేమించిన రౌడీ ని ఆస్తి రావాలని పెళ్ళి చేసుకుంటుంది.

4. కలిసోచ్చే అంశాలు :

  • పూర్తి కామెడీ గా వచ్చే సీన్ లు, పంచ్ లు.
  • సెకండాఫ్ కన్ఫూజన్ కామెడీ.
  • బ్రహ్మానందం రోల్, హీరో రామ్ రకుల్ ఎనర్జీ.

5.ఫిల్మ్ ఈక్వేషన్  :

  • మిస్టర్ ఫర్ ఫెక్ట్ లో ప్రభాస్ కంపెనీ, ఫ్యామిలీ +తాప్సి ఎపిసోడ్  (ఫస్ట్ హాఫ్ )
  • గజినీ హీరోయిన్ షేడ్ లో ఒక కధ ( హీరోయిన్ రకుల్ స్టోరీ )
  • పెద్దరికం/ హిట్లర్ సినిమా టైప్ (ఫ్లాష్ బ్యాక్ )
  • రెడీ లో హీరో గేమ్ (సెకండ్ హాఫ్ )

సినిమా ఎవరికీ నచ్చుతుంది :- యూత్ కి నచ్చుతుంది. ఫ్యామిలీ ఎంటర్ టైనర్ సరదాగా చూసి నవ్వు కోవచ్చు.  

రేటింగ్ : 3/5

recent reviews

Keshu Ee Veedinte Naadhan

Time pass comedy entertainer

Plan Panni Pannanum

Average comedy entertainer

Velan

Decent rural family entertainer

Meow

Soubin Shahir and Mamta Mohandas shine in this conventional film

Read more

galleries