Top

భలే భలే నవ్వించే మగాడు : భలే భలే మగాడివోయ్ రివ్యూ

“భలే భలే నవ్వించే మగాడు : “భలే భలే మగాడివోయ్” రివ్యూ

Source: General

By: Durga Ramesh

Critic's Rating: 3/5

Wednesday 09 September 2015

Movie Title

భలే భలే నవ్వించే మగాడు : భలే భలే మగాడివోయ్ రివ్యూ

Director

Maruthi

Star Cast

Nani , Lavanya Tripathi

స్టొరీ మెయిన్ పాయింట్ : ఒక మతి మరుపు క్యారక్టర్ ప్రేమ లో పడితే ఏమి చేస్తాడు ?ఎలా మ్యానేజ్ చేస్తాడు ? అన్నదే సినిమా మెయిన్ పాయింట్ .

స్టొరీ : లక్కీ (హీరో నాని) కి చిన్నతనం లోనుండే మతిమరుపు వుంది . ఆ మతిమరుపు వలన లక్కీ నానా ఇబ్బందులు పడుతుంటాడు . అయితే లక్కీకి వున్న మతి మరుపు వలన ,తనకు వచ్చిన పెళ్లి సంబంధం పోతుంది . ముఖ్యం గా  నందన (హీరోయిన్ లావణ్య త్రిపాటి ) ఫాదర్ మురళిశర్మ తో కొంచెం మిస్ అండర్ స్టాండింగ్ అవుతుంది .

అప్పుడు లక్కీ లైఫ్ లోకి మతిమరుపు వలన నందన (హీరోయిన్ లావణ్య త్రిపాటి)వస్తుంది . నందన –లక్కీ ప్రేమించు కుంటారు . నందన మీద ప్రేమ పెంచుకున్న లక్కీ ,తనమతిమరుపు తో చేసే తప్పులను కవర్ చేస్తుంటాడు .

నందన ని ఆశ పడ్డ అజయ్ ఒక పోలిస్ ఆఫీసర్ . నందన ని ఎలాగైనా దక్కించు కోవాలనిప్లాన్స్ వేస్తుంటాడు .

అలా వెళ్తున్న లక్కీ కి తెలిసే నిజం ఏమిటంటే నందన ఫాదర్ ఎవరో కాదు ,ఒకప్పుడుతన మతి మరుపు విషయం తెల్సిన మురళి శర్మే అని . దానితో లక్కీ షాక్ .ఇప్పుడు లక్కీ కొత్తదారి వెతుక్కుంటూ ,మతి మరుపు కవర్ చేసుకుంటూ ఎలా బ్రతికాడు ? ఈ విషయం ఎప్పుడు బయటపడుతుంది? అజయ్ నందన ని దక్కించుకోవాలని ఎలాంటి ప్రయత్నాలు చేసాడు ? చివరికి లక్కీ–నందన కలిసారా ? అన్నది తెర మీద చూడాలి .

 స్క్రీన్ ప్లే :

సినిమా మొత్తం డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ లో నడుస్తుంది . మొదట్లో క్యారక్టర్ఎస్టాబ్లిష్ చేయడానికే వాయిస్ ఓవర్ వాడారు .

క్యారెక్టర్ ఎస్టాబ్లిష్మెంట్ :

నాని ఇంట్రడక్షన్ తో సినిమా స్టార్ట్ అయ్యింది . నాని ప్రాబ్లం ని సినిమాస్టార్టింగ్ లో చెప్పారు .

క్యారక్టర్ కాన్ఫ్లిక్ట్ స్టార్ట్ విత్ హీరోయిన్ ఫాదర్ :

 నాని కి , హీరోయిన్ ఫాదర్ మురళి శర్మ కిమధ్య చిన్న గొడవ . (ఇదే సినిమా అంతా డ్రైవ్ చేస్తుంది . )

సబ్ ప్లాట్ స్టార్ట్ విత్ ఇన్సిడెంట్ అండ్ లవ్ కంటిన్యు : సినిమా ఇక్కడి నుండిహిలేరియస్ కామెడి రన్అవుతూ రొమాంటిక్ గా సాగిపోతుంది . (ఈ సీన్ లు చూడాల్సిందే )

మిడ్ పాయింట్ :

లక్కీ కి మతి మరుపు విషయం తెల్సిన మురళి శర్మే హీరోయిన్ ఫాదర్ అని ,లక్కీ కితెలియడం ఇంటర్వెల్ ....

సెకండ్ హాఫ్ :

లక్కీ హీరోయిన్ ఫాదర్ నుండి తప్పించుకోవాలని చూస్తుంటాడు .

ప్లే-1 : అయితే ఇక్కడ లక్కీ ఆడిన చిన్న ప్లే తో ,విలన్ అజయ్ గురించి తెలుస్తుంది .దానితో లక్కీ కొత్త ప్లే మొదలు పెడతాడు .

ప్లే -2 : లక్కీ ,వెన్నెల కిశోర్ లు ఇద్దరూ ఆడే కొత్త గేమ్ . ఈ గేమ్ ద్వారా లక్కీహీరోయిన్ ఫ్యామిలీ అందరికీ దగ్గర అవుతాడు . కానీ ఒక పక్క పోలీస్ విజయ్ కి డౌట్ లువస్తుంటాయి.

ప్రీ క్లైమాక్ష్ : (హీరో ఇన్ క్రైసిస్ ) పోలీస్ అజయ్ లక్కీ ఆడేనాటకాన్ని అంతా బయట పెడతాడు . దానితో లక్కీ ని హీరోయిన్ అపార్ధం చేసుకునివెళ్ళిపోతుంది .

క్లైమాక్ష్ : సినిమా ని చిన్న ట్విస్ట్ ద్వారా సినిమాటిక్ గా మలచి ,లక్కీహీరోయిన్ ని పెళ్లి చేసుకునేలా చేస్తారు .

సినిమా కి కలసి వచ్చే అంశాలు :

1.     హీరో నాని క్యారక్టర్ ,నానినటన ,టైమింగ్ చాలా బాగా కామెడీ రప్పించాయి .

2.     సినిమా లో వున్నా కొత్తసీన్ లు అన్నీ నవ్వు తెప్పిస్తాయి .

3.     సినిమా లో సపోర్టింగ్క్యారక్టర్ లు అందరూ బాగా చేసారు . మురళీ శర్మ ,నరేష్ ,వెన్నెల కిశోర్ ..ఇలా అందరూబాగా చేసారు .

4.     నాని , లావణ్య జంట మ్యాజిక్బాగుంది .

సినిమా ఈక్వేషన్ :

“గజినీ” సినిమా ని రొమాంటిక్ కామెడి తో రన్ చేస్తే  = భలే భలే మగాడివోయ్

సినిమా ఎవరికి  నచ్చుతుంది :

1.     ఈ సినిమా యూత్ కి ,మాస్ కిబాగా నచ్చుతుంది . బాగా కామెడీ వుంది .

2.     ఈ సినిమా ని ఫ్యామిలీ లు కూడా ఎంజాయ్ చేయవచ్చు . వల్గారిటీ లేదు .ప్యూర్కామెడి ,క్లీన్ కామెడి సినిమా లో వుంది .

ఫైనల్ టచ్ : ఈ ఇయర్ లో వచ్చిన “బెస్ట్ రొమాంటిక్ కామెడి ఎంటర్టైనర్” ..బాగానవ్వుకునే ఛాన్స్ ని  మిస్ కాకండి ..

 

recent reviews

Keshu Ee Veedinte Naadhan

Time pass comedy entertainer

Plan Panni Pannanum

Average comedy entertainer

Velan

Decent rural family entertainer

Meow

Soubin Shahir and Mamta Mohandas shine in this conventional film

Read more

galleries