Top

హర్రర్ థ్రిల్లర్ - రాక్షసుడు

హర్రర్ థ్రిల్లర్ - రాక్షసుడు

Source: General

By: Durga Ramesh

Critic's Rating: 3/5

Wednesday 10 June 2015

Movie Title

హర్రర్ థ్రిల్లర్ - రాక్షసుడు

Director

Ramesh Varma Penmetsa

Star Cast

Bellamkonda Sreenivas, Anupama Parameswaran, Saravanan, Rajeev Kanakala, Ravi, Kasi Vishwanath, Baby Dua, Kaushik Vinodini, Surya Kumar Bhagvandas, Suzane George, Vinod Sagar

1. స్టోరీ మెయిన్ ఐడియా ( ప్రీమైస్ ):- చనిపోయిన వాళ్ళందరూ హీరోకి కనపడుతూ తమ కోరికలు  తీర్చమని అడిగితే ఎలా ఉంటుంది? వాళ్ళలో హీరోకి సంబంధించిన వాళ్ళు ఉండి, వాళ్ళకో స్టోరీ ఉంటే ఎలా ఉంటుంది...? హీరో ద్వారా రివెంజ్ తీర్చుకుంటే ఎలా ఉంటుంది...? అనే పాయింట్ బేస్ మీద అల్లుకున్న కధ.

2. స్టోరీ :- మాస్ ( హీరో సూర్య ) ఒక అనాధ. తన తోటి ఫ్రెండ్ తో కలిసి దొంగతనాలు చేసుకుంటూ బ్రతుకుతుంటాడు. మాస్, నర్సు అయిన నయనతార ఇష్టపడుతుంటాడు. మాస్, తన ఫ్రెండ్ తో ఒక పెద్ద దొంగతనం చేస్తూ యాక్సిడెంట్ కి గురి అవుతాడు. కొన్ని రోజులు కోమాలోకి వెళ్తాడు. కోమాలోంచి బయట పడ్డ మాస్ కి చనిపోయిన వారందరూ కనపడటం మొదలవు తుంది. మొదట దీన్ని మాస్ నమ్మడు . ఆ తర్వాత ఒక స్వామీజీ మూలం గా నమ్మి, కనపడే ఆత్మలను అడ్డం పెట్టుకుని వ్యాపారం మొదలు పెడ్తాడు.

ఒకానొక టైమ్ లో మాస్ చేసే వ్యాపారం నయనతారకి తెలిసిపోయి, మాస్ ని దూరం పెడ్తుంది. మాస్ చివరిగా ఒక దెయ్యాల కేస్ డీల్ చేయడానికి వెళితే, అక్కడ మాస్ ( హీరో సూర్య ) లాగే ఉండే ఇంకొక వ్యక్తి శివ కనిపిస్తాడు. తన కంటూ ఒక కోరిక ఉందని, తీర్చమని అడుగుతాడు. మాస్ దానికి ఒప్పుకోడు. దాని తో శివ కధను మలుపులు తిప్పడం ప్రారంభిస్తాడు. లాకర్స్ దొంగతనం చేయి అని ఐడియా ఇస్తాడు. మాస్ దానికి ఒప్పుకుని పెద్ద దొంగతనం ప్లాన్ లోకి వెళ్ళి , అనుకోకుండా ఒకర్ని హత్య చేస్తాడు. ఇలా శివ – మాస్ ను మార్చే పనిలో పడ్తాడు. మాస్ లో మార్పు వస్తుంది. శివ అసలు కధ తెలుస్తుంది. ఆ శివ కధ ఏమిటి? శివ కి –మాస్ కి గల సంబంధం ఏమిటి? శివ – ఎందుకు ఒక్కొక్కరిని మాస్ చేత చంపిస్తున్నాడన్నదే మిగిలిన కధ.

3.స్క్రీన్ ప్లే :
స్టార్టింగ్ :- డైరెక్టర్ పాయింటాఫ్ వ్యూ స్టోరీ గా మొదలవుతుంది. మాస్ ( హీరో సూర్య ) దొంగతనాల జీవితం తో కధ చెబుతూ వెళ్తారు. అక్కడ మాస్ ( సూర్య ) కి కార్ యాక్సిడెంట్.

టర్నింగ్ పాయింట్ – 1 :- ఈ యాక్సిడెంట్ ఫలితం గా మాస్ ( సూర్య ) కి ఆత్మలు కనపడటం మొదలవుతుంది. అక్కడ నుండి కనపడే ఆత్మలకి మాస్ ( సూర్య ) మొదట బయపడ్తాడు. ఆ తర్వాత నార్మల్ మనుషులుగా గుర్తిస్తాడు.

టర్నింగ్ పాయింట్ - 2 :- మాస్ ( సూర్య ) ఆత్మలను అడ్డం పెట్టుకుని వ్యాపారం మొదలు పెట్టడం. దానితో సంపాదన పెరగడం. నయనతారకు  దగ్గరవ్వడం. ఒకానొక సమయంలో అది బయట పడి, నయనతార మాస్ కి దూరం అవ్వడం.

టర్నింగ్ పాయింట్ - 3 :- ఒక దెయ్యం కేస్ లో – మాస్ కి తన లాగే ఉండే వ్యక్తి శివ కలవడం. శివను మాస్ పట్టించుకోకపోవడం. శివ – మాస్ ను దారి మరల్చి, పెద్ద దొంగతనానికి తీసుకెళ్ళడం .

మిడ్ పాయింట్ :- శివ – మాస్ చేత ఒకరిని హత్య చేయించడం. ఆ తర్వాత శివ – మాస్ ల మధ్య గొడవ రావడం. శివ తన ఫ్లాష్ బ్యాక్ తన పాయింటాఫ్ వ్యూ లో సగం వివరించడం.
ఫ్లాష్ బ్యాక్ - 1 :- శివ తన కూతురు మూలంగా ప్రణీత ను  పెళ్ళి చేసుకోవడం. ఫ్యామిలీ లైఫ్, వాళ్ళకి అబ్బాయి పుట్టడం. ఫ్లాష్ బ్యాక్ 1 అవుతుంది . పోలీస్ ఎంక్వైరీ సాగుతూ ఉండటం. పెద్ద దొంగతనానికి సంబంధించిన ఫైల్స్ కోసం గాలింపులు. దాని కోసం మాస్ మీద ఎంక్వైరీ చేయడం.  మాస్ ని చంపాలని విలన్ మనుషులు చూస్తారు. అయితే అనుకోని ఫైట్ లో రెండవ విలన్ చనిపోతాడు. మెయిన్ విలన్ వచ్చి మాస్ ని చంపాలని చూస్తే, శివ ఫ్రెండ్ కాపాడతాడు. అప్పుడు శివ ఫ్రెండ్ అసలు జరిగిన కధ చెబుతాడు.

ఫ్లాష్ బ్యాక్ – 2 :- శివ తన ఫ్యామిలీ తో వచ్చి అనాదశ్రమం పెట్టాలనుకున్నా ప్లేస్ ని, కబ్జా చేసిన విలన్స్ శివను, ఫ్యామిలీ ని దారుణంగా చంపుతారు. శివ కొడుకే మాస్. ఫ్లాష్ బ్యాక్ 2 కంప్లీట్ అవుతుంది.

ప్రీక్లైమాక్స్ :-  చివరిగా తండ్రి పగను తీర్చడం కోసం మాస్ బయల్దేరబోతుండగా , మాస్ ని చంపాలని విలన్స్ చూస్తారు . అక్కడ ఒక యాక్సిడెంట్ అవుతుంది. దానితో మాస్ తనకున్న పవర్ ఆత్మలను చూడటం అనే శక్తి పోతుంది. దానికి మాస్ బాధ పడ్తాడు.

క్లైమాక్స్ :- చివరిగా తండ్రిని, తల్లిని, చెల్లిని చంపిన విలన్ ని మాస్ చంపడంతో కధ అయిపోతుంది.

4. కలిసోచ్చే అంశాలు :
  • సూర్య రెండు క్యారెక్టర్స్ లలో నటన. 
  • ఆత్మలతో మాట్లాడే కామెడీ డైలాగ్స్. 
  • కనెక్టివిటీ చేసే తండ్రి – కొడుకుల రిలేషన్. ఆత్మల కోరికలు హీరో తీర్చడం.
5. ఫిలిం ఈక్యూవేషన్   :  సూర్య సన్నాఫ్ కృష్ణన్ హర్రర్ థ్రిల్లర్ అయితే……..

6. సినిమా ఎవరికీ నచ్చుతుంది  :
  • వెరైటీ కోరుకునే వాళ్ళ కి ఈ సినిమా నచ్చుతుంది.
  • తమిళ సూర్య ని ఇష్ట పడే వారికీ నచ్చుతుంది.
  • థ్రిల్లర్స్ చూసే వారికి నచ్చుతుంది.
పంచ్ లైన్ :-   వెరైటీ థ్రిల్లర్ మూవీ   

రేటింగ్ :- 3/5

recent reviews

Keshu Ee Veedinte Naadhan

Time pass comedy entertainer

Plan Panni Pannanum

Average comedy entertainer

Velan

Decent rural family entertainer

Meow

Soubin Shahir and Mamta Mohandas shine in this conventional film

Read more

galleries