హోరా హోరి: ఒక సాధారణ ప్రేమ కధ
హోరా హోరి: ఒక సాధారణ ప్రేమ కధ
హోరా హోరి: ఒక సాధారణ ప్రేమ కధ
Teja
Dileep, Daksha, Ashwini, Chaswa
స్టొరీ మెయిన్ ఐడియా: తను ఇష్టపడ్డ అమ్మాయి కోసం ఏదైనా చేసేవిలన్ కి , తను ప్రేమించిన అమ్మాయికోసం తెగించలేనిపిరికి అబ్బాయికి మధ్య జరిగే కధ .
స్టొరీ : బసవేస్వర్(విలన్-చస్వా) ఒక వీధి రౌడి .రోడ్డు మధ్యలో అందరూ చూస్తుండగా ఒక మర్డర్ చేస్తాడు .దాన్నుండి బయటపడటం కోసం ఒక పోలీస్ ఆఫీసర్ కి అమౌంట్ ఇవ్వాలని వస్తే ,ఆ పోలీస్‌ఆఫీసర్ చెల్లెలు మైథిలి (హీరోయిన్ -దక్ష) నిచూస్తాడు . అప్పటి నుండి మైథిలి ని పెళ్లి చేసుకోవాలనే తపన తో పెళ్ళికొడుకుని ,పెళ్లి సంబంధం కి వచ్చే వాళ్ళని చంపుతూ ఉంటాడు . ఇవన్నీ చూసిన మైథిలి షాక్ కి గురిఅవుతుంది . మైథిలి ని షాక్ నుండి తప్పించాలంటే ,ప్లేస్ చేంజ్ చేయాలని డాక్టర్స్ చెప్పడం తో ,కర్ణాటక లో పల్లెటూరుప్రాంతానికి వెళ్తారు .
అక్కడకు వెళ్ళినమైథిలి కి స్కంద (హీరో-దిలీప్) పరిచయం అవుతాడు .అతని పరిచయం లో మైథిలి తిరిగిమామూలు మనిషి అవుతుంది . వీళ్ళిద్దరూ ప్రేమించుకుంటారు .
అయితే ఇదే వూరు కివచ్చిన బసవేస్వర్ (విలన్-చస్వా) కి ,స్కంద (హీరో-దిలీప్) మధ్య ఫ్రెండ్షిప్ఏర్పడుతుంది .దానితో స్కంద వ్యాపారపరం గా ఎదుగుతుంటాడు .
అయితే తనువెదుకుతున్న మైథిలి –స్కంద ని ప్రేమించింది అనే విషయం బసవేస్వర్ కి తెలియడం తో కధచివరకు వస్తుంది . ఇప్పుడు బసవేస్వర్ కి, స్కంద కి మధ్య లో మైథిలి విషయం ఏమయ్యింది? ఎవరు మైథిలి ని పొందారు ? అన్నదే మిగిలిన కధ .
స్క్రీన్ ప్లే :
సినిమా స్టార్టింగ్ “హోరాహోరి” సాంగ్ తో వర్షం తో బ్యూటిఫుల్ గా ఓపెన్ అవుతుంది . డైరెక్టర్ పాయింట్ ఆఫ్వ్యూ లో సినిమా రన్ అవుతుంది .
విలన్ (చస్వా) ఇంట్రడక్షన్ ఒక మర్డర్ తో చూపి , దాని ద్వారా క్యారక్టర్ ఇంట్రడక్షన్ లు జరుగుతూ వుంటాయి .విలన్‌కి హీరో కి పరిచయం ఏర్పాటు చేసారు .
టర్నింగ్ పాయింట్1 : విలన్ని –హీరోయిన్ తగలడం అనే పాయింట్ తో సినిమాకధ మొదటిగా టర్నింగ్ పాయింట్ వేసారు . ఇక ఇక్కడనుండి విలన్ –హీరోయిన్ ని చేసుకోబోయే పెళ్లికొడుకుని చంపించడం , ఆ తర్వాత వచ్చిన ఫారిన్ సంబంధం పెళ్లి కొడుకుని చంపిస్తాడు.
టర్నింగ్ పాయింట్ 2: దానితో హీరోయిన్ షాక్ లోకి వెళ్లిపోతుంది . సో ప్లేస్ చేంజ్ చేస్తారు . కర్నాటక లో ఒక గ్రామానికి వెళ్ళిపోతారుహీరోయిన్ ఫ్యామిలీ అంతా . విలన్ హీరోయిన్ కోసం వెతుకుతూ ఉంటాడు .కానీ దొరకదు .
హీరోయిన్ ని షాక్‌లోంచి ,హీరో మెల్లగా తనకు తెలియకుండా మార్చే ప్లే ఒకటి పెట్టారు .
ప్లే -1 : ఊర్ల మధ్యవున్న సమస్య - ప్రింటింగ్ ప్రెస్ ,కంప్యూటర్ సెంటర్ ..ఈ బేస్ మీద ఒక పోటి పెట్టారు .ఆ పోటి కోసం ఒక కామెడీక్యారెక్టర్ వస్తుంది . ఆ తర్వాత హీరోయిన్ కి ట్రైనింగ్ ఇలా సినిమా కధ ఈ ప్లేనుండి ప్రేమ కధ గా షిఫ్ట్ అవుతుంది ...
టర్నింగ్ పాయింట్ 3: హీరో వెళ్లి తన ప్రేమ ను ఎక్ష్ప్రెస్స్ చేస్తే ,నో చెబుతుంది . ఇక్కడ హీరో ఆత్మహత్య చేసుకోవడానికి వెళితే ,విలన్ వచ్చి అతని లవ్ కి హెల్ప్ చేస్తానని అంటూ ,ఒకహత్య చేస్తాడు ..
------------------ఇంటర్వెల్బ్లాక్ -----------------------------
ప్లే -2 : హీరో –విలన్ ల ఫ్రెండ్ షిప్ సాగుతూ ,హీరోఎదుగుతూ ,సంపాదిస్తూ ఉంటాడు . ఇంకో పక్క హీరోయిన్ తో ప్రేమ కొనసాగుతూ వుంటుంది .హీరో కి విలన్ ఫైట్ లు కుడా నేర్పుతూ ఉంటాడు ...ఈ ప్లే ఇలా కొనసాగుతూ ప్రీ క్లైమాక్ష్ వరకూ వెళ్తుంది .
ప్రీ క్లైమాక్ష్ : విలన్–హీరో లకి మధ్య వార్ ఓపెన్ అయిపోతుంది . హీరో పిరికి గా సమస్య కి బయపడి పోతుంటాడు. సమస్యకి హీరోయిన్ కుడా బయపడిపోతుంది.
క్లైమాక్ష్ : ఈ వార్‌లో విలన్ –హీరో కి మధ్య జరగడం , చివరికి హీరో గెలవడం తో సినిమా అయిపోతుంది .
సినిమాని కాపాడేఅంశాలు :
1. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ...
2. కెమెరా వర్క్ ...
3. కొన్ని సాంగ్స్ బాగున్నాయి ...
సినిమా ఈక్వేషన్ :
“జయం” కధ ను ప్రాబ్లం తో స్టార్ట్ చేసి రాన్ చేస్తే = హోరా హోరి
సినిమా ఎవరికి నచ్చుతుంది :
1. బిలో ఇంటర్ వాళ్ళకు నచ్చితే,నచ్చుతుంది ..
ఫైనల్ టచ్ : “ఫీల్ లేని” ప్రేమ కధ