Andhra Pori movie review
ఆంధ్రా పోరి - క్లీన్ లవ్ స్టోరీ వితౌట్ కమర్షియల్ ఎలిమెంట్స్
Andhra Pori movie review
Raj Mudhiraj
Akash Puri, Ulka Gupta
స్టోరీ మెయిన్ ఐడియా : ఒక స్వచ్చమైన అమాయకుడైన అబ్బాయికి , ఒక సున్నితమైన అమ్మాయికి మధ్య జరిగే ప్రేమ కధ..
స్టోరీ : నర్సింగ్ ( హీరో ఆకాష్ ) ఒక పేదింటి అబ్బాయి. తండ్రి లేని ఇతనికి అమ్మే సర్వస్వం. ఇతని కి ఒక చెల్లెలు. నర్సింగ్ అమ్మ గవర్నమెంట్ ఆఫీసర్స్ కి టిఫిన్ ,క్యారేజ్ లు ఇస్తూ వెళ్ళాను పెంచుతూ ఉంటుంది. నర్సింగ్ 10 వ తరగతి పాస్ కాకుండా 3 సార్లు ఫెయిల్ అయ్యి అల్లరి , చిల్లరి గా తిరుగుతూ ఉంటాడు. నర్సింగ్ అనుకోకుండా ప్రశాంతి (ఉల్కా గుప్తా) అనే పెద్దింటి అమ్మాయి ని చూస్తాడు. ఆమె ను ఇష్టపడతాడు .ఆమె ధ్యాసలో పడి టిఫిన్ క్యారేజి ల విషయం మరచి ,అమ్మతో దెబ్బలు తింటాడు . ఇంటి నుండి వెళ్ళి పోయి ఉత్తేజ్ నడిపే థియేటర్ లో పనికి కుదురుతాడు. నర్సింగ్- ప్రశాంతి ల మధ్య ప్రేమ మెల్లగా చిగురిస్తూ, చిన్న చిన్న ఆనందాలతో సాగుతూ ఉంటుంది. నర్సింగ్ వలన ప్రశాంతి కాలేజి లో పాటలు పాడుతుంది. ప్రశాంతి ప్రేమ వలన నర్సింగ్ లో కూడా మార్పు వస్తుంది. అయితే వీరి ప్రేమ విషయం మొదట ప్రశాంతి అన్నకు తెలుస్తుంది . అన్నకు కుడా ఒక లవ్ స్టొరీ ఉంటుంది. దాని వలన అన్న ప్రశాంతి ప్రేమను అంత గా సీరియస్ గా తీసుకోడు . చివరికి ప్రశాంతి తను చదివే సబ్జెక్టు లో ఫెయిల్ అవుతుంది . దానితో ఇంట్లో ప్రశాంతి ప్రేమ విషయం బయటపడుతుంది. ప్రశాంతి – నర్సింగ్ కు దూరం పెడతారు. వీరిద్దరూ కలిసారా ...? లేదా ...? వీరి ప్రేమ ను పెద్దలు ఏమి చేసారు ... ? అన్నదే మిగిలిన కధ ....
స్క్రీన్ ప్లే :
స్ట్రెయిట్ నరేషన్ లో సినిమా సాగుతుంది. హీరో క్యారెక్టర్ ని పరిచయం చేస్తూ , తన తల్లి ని , చెల్లి ని పరిచయం అయిన తర్వాత సినిమా కధ మలుపు తిరుగుతుంది.
టర్నింగ్ పాయింట్ 1 :
హీరో ఆకాష్ --హీరోయిన్ ఉల్కా గుప్తా ని చూడటం సినిమా కధ కి మొదటి టర్నింగ్ పాయింట్ . ఆతర్వాత ప్రేమ కధ మెల్లిగా మొదలవుతుంది . వీళ్ళిద్దరూ కలసి తిరగటం , మాట్లాడుకోవడం . ప్రశాంతి కాలేజీ లో సాంగ్ పాడటానికి హీరో నే కారణం అవ్వడం జరుగుతుంది .
మిడ్ పాయింట్ :
హీరోయిన్ అన్న రావడం తో సినిమా బ్రేక్ అవుతుంది. సెకండ్ హాఫ్ లో కధ లో మెల్లగా హీరో హీరోయిన్ అన్న కు దగ్గర అవ్వడం ..ఆ తర్వాత –హీరోయిన్ ల మధ్య పెద్దలు రావడం , వీళ్ళిద్దరినీ వేరుగా వుంచడం ...హీరోయిన్ సబ్జెక్టు లో ఫెయిల్ అవ్వడం ....ఫాదర్ సీరియస్ అయ్యి కొట్టడం ...
ప్రి క్లైమాక్ష్ : చివరిగా హీరోయిన్ ఎక్షామ్ రాసే పని లో పడటం ...హీరో ని దూరం పెట్టడం జరుగుతుంది .
క్లైమాక్ష్ : హీరోయిన్ ఫాదర్ ట్రాన్స్ఫర్ పేరు తో ప్రేమికులని విడదీయడం. వీరి మూలంగా హీరోయిన్ అన్న తన ప్రేమ ను గెలిపించుకోవడం ...హీరో హీరోయిన్ కోసం పరుగు మొదలు పెట్టడం ..
కలసి వచ్చే అంశాలు :
- సినిమా ఆద్యంతం “చిరంజీవి “ ముటామేస్త్రి” సినిమా రోజులలో కొనసాగినట్లు తీసారు.
- గోదావరి తీరం లో వున్న”పాల్వంచ” ..కొత్తగూడెం కే టి .పి ఎస్ కాలనీ ల బ్యాక్ డ్రాప్ లో సినిమా ఫ్రెష్ గా ఉంటుంది ...
- రొటీన్ కమర్షియల్ ఫార్ములా , ఫైట్స్ ,గ్రూప్ సాంగ్స్ లేకుండా చూడగలిగే సినిమా ..
సినిమా ఈక్యూవేషణ్ :
- “కొత్త బంగారు లోకం” ఒక కాలనీ లో 10 వ తరగతి చదివే పిల్లల ల మధ్య జరిగితే =ఆంధ్రా పోరి
- “నువ్వు నేను” సినిమా ఒక కాలనీ లో జరిగితే = ఆంధ్రా పోరి
సినిమా ఎవరికి నచ్చుతుంది :
- “ నా ఆటోగ్రాఫ్ స్వీట్ మేమరీస్ “ నచ్చిన వారికి ఈ సినిమా నచ్చుతుంది .
- “ కొత్త బంగారు లోకం , హ్యాపీ డేస్ , లైఫ్ ఈస్ బ్యూటిఫుల్” నచ్చిన వారికి ఈ సినిమా నచ్చుతుంది .
పంచ్ లైన్ : కమర్షియల్ ఎలిమెంట్స్ ఏమీ ఎక్ష్పెట్ చేయకుండా తెలంగాణ అబ్బాయి ని , అంధ్రా పోరిని చూడడానికి వెళితే బాగుంటుంది .
రేటింగ్ : 2.75/3