Review : Abbayitho Ammayi
అబ్బాయితో అమ్మాయి : యూత్ ఫుల్ రొమాంటిక్ ఎంటర్టైనర్
Review : Abbayitho Ammayi
Ramesh Varma
Naga Sourya , Pallak Lalwani
స్టొరీ లైన్ : ఒక అమ్మాయి కి ఒక అబ్బాయి కి మధ్య వున్నా ప్రేమ-ఆకర్షణ రియల్ లైఫ్‌లో ఏలా ఉంటాయో సోషల్ మీడియా ద్వారా నిజమైన ప్రేమ కి ఆకర్షణ కి వున్నా తేడా ఏంటోఇద్దరు ప్రేమికులు ఏలా తెలుసుకున్నారో అనేది ఈ సినిమా మూలా కథ.
కథ : అభి(నాగ శౌర్య) ప్రతి కుర్రాడు ఆలోచించే లక్షణాలు వున్నా అబ్బాయికిఒక అమ్మాయిని ప్రేమించి ఫస్ట్ కిస్ కోసం ట్రై చెయ్యాలని చేసే ప్రయత్నం లో సమంత అనేఒక తెలియని అమ్మాయితో ఫేస్ బుక్ లో పరిచయం అవ్వుతుంది. వీరిద్దరూ ఫ్రెండ్స్ గా మారిలవ్ వైపు అడుగులు వేసే సమయంలో అభి కి ప్రార్ధన(పలక్ లల్వాని)ని చూసి ప్రేమలో పడతాడు.అభి - ప్రార్ధన ఫ్రెండ్స్ మధ్యన వున్నా ఫ్రెండ్షిప్ ముందుకు వెళ్తూ ఇద్దరూ ప్రేమలోపడతారు. అభి కి వున్నా ఫస్ట్ కిస్ కోరికని ప్రార్ధన ద్వారా సాధిస్తాడు. వీరిజీవితాలు సాఫీగా సాగిపోయే సమయంలో కొన్ని పరిస్టితుల వలన అభి - ప్రార్ధన విషయం వాళ్ళ ఫ్యామిలీ మెంబెర్స్ కి తెలిసిపోవటంవలన ప్రార్ధనకి అభి గురించి ఓ నిజం తెలుస్తుంది. దాంతో అభికి దూరంగా ఉంటుందిప్రార్ధన. అదే సమయంలో ప్రార్ధన తన ఫేస్ బుక్ ఫ్రెండ్ పవన్ కళ్యాణ్ కిదగ్గరవుతుంది. అసలు ఈ సమంత – పవన్ కళ్యాణ్ఎవరు....? అభి - ప్రార్ధన లైఫ్ లోకి పేస్ బుక్ ఫ్రెండ్స్ రూపంలో సమంతా –పవన్ కళ్యాణ్ఏలా వచ్చారు...? ప్రార్ధన ప్రేమనిపొందడానికి అభి ఏమి చేసాడు.? ప్రార్ధనకి అభి గురించితెలిసిన నిజం ఏమిటి...? అనేది తెలియాలంటే తెర మీద చూడాల్సిందే.
అబ్బాయితో అమ్మాయి పబ్లిక్టాక్ :
- యూత్ కి మంచి యూత్ ఫుల్ మెసేజ్ ఇచ్చారు
- సోషల్ మీడియా లో ఈ జనరేషన్ యూత్ ఏలా ఉంటున్నారోచూపించే విధనాం బాగుంది
- రావు రమేష్ పంచ్ డైలాగ్స్ బాగా పేలాయి
- సప్తగిరి కామెడి చాల బాగుంది
కలిసొచ్చే అంశాలు :
- నాగ శౌర్య – పలక్ లల్వాని మధ్య జరిగే లవ్ సన్నివేశాలు
- పలక్ లల్వాని స్క్రీన్ మీద ప్రజెంటేషన్
- నాగ శౌర్య – లాస్య – శకలక శంకర్ మధ్యవచ్చే కామెడి సన్నివేశాలు
- రావు రమేష్ పంచ్ డైలాగ్స్ &పెర్ఫార్మన్స్
- శ్యాం.కె.నాయుడు సినిమాటోగ్రఫీ
- బ్రహ్మ కడలి అవుట్ స్టాండింగ్ ఆర్ట్‌వర్క్
సినిమా ఫార్ములా :
కొత్త పాయింట్ : సోషల్‌మీడియా ని బేస్ చేసుకుని ప్రస్తుతం వున్నా యూత్ ని టార్గెట్ చేసి మెసేజ్చెప్పాలని చేసిన ప్రయత్నం
సినిమా ఎవరకి నచ్చుతుంది :
- యూత్ ఫుల్ రొమాంటిక్ ఎంటర్టైన్మెంట్ సినిమాలని ఇష్టపడే వారికీ ఈ సినిమా నచ్చుతుంది
- నాగశౌర్య సినిమాలని ఇష్టపడే వారికీ ఈ సినిమానచ్చుతుంది.
ఫినిషింగ్ టచ్ : అబ్బాయితో అమ్మాయి : యూత్ ఫుల్ రొమాంటిక్ ఎంటర్టైనర్
సినిమా మూవీ రివ్యూ రేటింగ్ : 2.75/5.0