Top

Review : Akhil Movie

పవర్ లేని అఖిల్

Source: General

By: Srinivas

Critic's Rating: 3/5

Wednesday 11 November 2015

Movie Title

Review : Akhil Movie

Director

V. V. Vinayak

Star Cast

Akhil, Sayesha Saigal

స్టొరీ లైన్ (ప్లాట్ ) : జూవా (సూర్య కవచం లాంటి బాల్ )కోసం అన్వేషణ చేస్తున్న ప్రత్యర్ధులు నుండి, జూవా తో ముడిపడివున్న ఈ భూప్రపంచాన్ని కాపాడుకోవటం కోసం ఒక యువకుడు చేసిన ప్రయత్నమే ఈ అఖిల్ సినిమా  

సినిమా కథ  :  భవిష్యత్తులోభూమి మీద ప్రళయం వస్తుందని అప్పటి ఋషులు సూర్య కవచం ఆలియాస్ జువా అనే ఒక బాల్ నితయారు చేసి భూమధ్య రేఖ కి దగ్గరగా వుండేఆఫ్రికాలోని ఓజా ప్రజలు నివసించేప్రాంతంలో జువా ప్రతిష్టిస్తారు. ప్రతి సూర్యగ్రహణం రోజు మొదటి సూర్య కిరణాలు దాని మీద పడే విధంగా ఉంచుతారు.సూర్య కిరణాలు  జువా ని పడే సమయం లో ఆ జువా లేకపోతే ప్రళయం సంభవిస్తుంది అని ఋషులు చెప్పిన నిజాన్ని బ్రతికించటం కోసం  ఓజా ప్రజలు ఆ  జువా ని కాపాడుకుంటూ వస్తారు.

మరో వైపు రష్యన్ సైంటిస్ట్ కతోర్జి  ఆజువా ని దక్కించుకోవాలనిప్రయత్నం లో  ఓజా ప్రజలు మీద ఎటాక్ చేస్తారు. ఓజా ప్రజల్లో  ఒకడు అయిన బోడో అనే వ్యక్తీ  జువా ని  సైంటిస్ట్కతోర్జి మనుషుల నుండి కాపాడి ఎవరికీతెలియకుండా ఒక ప్లేస్ లో దాస్తాడు.  

సైంటిస్ట్ కతోర్జి  జువా ని తెచ్చే వాడికోసం వెతికే పనిలో వుంటాడు. ఆ క్రమంలో  హైదరబాద్ లో వున్నా  అఖిల్(అఖిల్) ఎంతటి పనిని అయిన అసాధ్యాన్ని కూడా సుసాధ్యం చెయ్యగల సత్తా వున్నా అఖిల్ కి దివ్య (సయేషా సైగల్)ని చూసి తోలి  చూపులనే ప్రేమలోపడతాడు. దివ్య తో అఖిల్ ప్రేమలో వున్నాసమయం లో దివ్య అఖిల్ ని వదిలి  స్పెయిన్ వెళ్ళిపోతుంది. అసలు దివ్య ఎందుకు అఖిల్ ని వదిలి వెళ్ళిపోయింది...? అఖిల్ దివ్యకోసం వెళ్ళిన క్రమం లో అఖిల్ తెలుసుకున్న నిజాలు ఏంటి...? సైంటిస్ట్కతోర్జి  కి జూవాదక్కిందా...? జూవా కి అఖిల్ కి వున్నా సంబంధం ఏంటి ..? అనేది తెలియాలంటే తెర మీదచూడాల్సిందే.

స్క్రీన్ ప్లే : కథ వాయిస్ ఓవర్ లో స్టార్ట్అవుతూ ఈ భూ ప్రపంచం గురించి చెబుతూ  భవిష్యత్తులో భూమి కి ఏలాంటి విపత్తు జరగకుండా ఒక జూవా ని తయారు  చేసి భూమధ్య రేఖ కి దగ్గర లో వున్నా ఆఫిక్రాజాతీ కి చెందిన ఓజా ప్రజలకు అప్పగిస్తారు.ప్రతి సూర్యగ్రహణం రోజు మొదటి సూర్య కిరణాలు జూవా ని తాకే విధంగాచేస్తారు. ఒకవేళ తాకని పక్షంలో ఈ భూ ప్రపంచం అంత నాశనం అవ్వుతుంది అని చెప్పటంతోఓజా ప్రజలు తన ప్రాణాలు అడ్డుపెట్టి కాపాడుకుంటూ వస్తారు.

ప్రాబ్లం  ఎస్టాబ్లిష్ మెంట్  : రష్యా సైంటిస్ట్ కతోర్జి  ఆ జూవా కి వున్నా పవర్స్ తెలుసుకుని ఆ జూవా ని  దక్కించుకుంటే ఈ ప్రపంచాన్ని అంత తన గుప్పిట్లోతెచ్చుకోవాలని చేసే ప్రయత్నం ఆ జూవా కోసం ఓజా ప్రజల మీద దాడి చేయిస్తాడు. ఓజాప్రజల్లో బోడో అనేవ్యక్తీ ఆ జూవా ని  తీసుకుని ఎవరికీతెలియని ప్లేస్ లో వుంచుతాడు.  

జూవా ని  ఎలాగైనా ఓజా ప్రజల నుండి తెచ్చిసైంటిస్ట్ కతోర్జి కి  ఇవ్వటానికి డీల్ఒప్పుకున్నా మహేష్ (మహేష్ ముంజేకర్) పధకం విఫలం అవ్వటంతో  ఆ జూవా ని ముప్పై రోజులు తెచ్చి అప్పగిస్తాను అనిసైంటిస్ట్ కతోర్జి కిమాటిస్తాడు. ఆ ప్రయత్నం లో మహేష్  ఆ జూవాని తెచ్చే వాడికి కోసం వెతికే ప్రయత్నం లో కథ హైదరాబాద్  కి షిఫ్ట్ అవుతుంది.

హైదారబాద్ లో అఖిల్ (అఖిల్ )  స్ట్రీట్ ఫైటింగ్స్ చేస్తూ తన ఫ్రెండ్స్ తో లైఫ్ నిఎంజాయ్ చేస్తూ వున్నా సమయం లో దివ్య (సయేషా సైగల్ ) ని తొలిచూపులోనే చూసి ప్రేమలోపడతాడు. దివ్య కి దగ్గర అయ్యే పనిలో అఖిల్ కి దివ్య ఒక నిజం చెబుతుంది. తనకి ఆల్రెడీ పెళ్లి ఫిక్స్ అయ్యింది అని,దాంతో అఖిల్ ఆ పెళ్లి ని ఒక పధకం ద్వారా పెళ్లి జరగకుండా ఆపేస్తాడు.  పెళ్లి జరగలేదు అని బాధతో దివ్య హైదరబాద్ నుండిస్పెయిన్ వెళ్ళిపోతుంది.  ఆ విషయం తెలిసినఅఖిల్ స్పెయిన్ కి వెళ్తాడు.

ప్లాట్ పాయింట్ 1 : జూవా ని దాచిపెట్టిన ఓజా జాతికి చెందిన మనిషి బోడోని  సైంటిస్ట్ కతోర్జి  మనుషులు చంపేస్తారు. కానీ ఆ విషయం దివ్య కి తెలుసు అని సైంటిస్ట్కతోర్జి  మనుషులుదివ్య ని కిడ్నాప్ చేస్తారు. అదే సమయం లో దివ్య తండ్రి మహేష్ అఖిల్ ని చంపటానికిట్రై చేస్తాడు.

ఇంటర్వెల్

అఖిల్ ని కిడ్నాప్ చేసినమహేష్  తన కూతురి గురించి తెలుసుకునేక్రమంలో దివ్య మాంబో అనే వ్యక్తీ దగ్గర వుంది అని మహేష్ తెలుసుకుంటాడు. అఖిల్ దివ్య ని కాపాడటం కోసం ఆఫిక్రా వెళ్తాడు.దివ్యని  మాంబో దగ్గర నుండి కాపాడే ప్రయత్నంచేస్తాడు. మరో వైపు తన కూతుర్ని కాపాడటం కోసం మహేష్ ఆఫ్రికా వచ్చి మాంబో దగ్గరఇరుక్కుపోతాడు. మళ్ళి మాంబో  వుండే ప్లేస్కి వచ్చి అఖిల్  దివ్య తండ్రి ని కాపాడితప్పించుకుంటారు.

ప్లాట్ పాయింట్ 2 : దివ్యతండ్రి మహేష్ కి అఖిల్ మీద వున్నా కోపంతో అఖిల్ ని చంపటానికి  చేసే ప్రయత్నం లో  దివ్య మీద ఒక జంతువు దాడి చేసే క్రమం లో అఖిల్ అందరినిరక్షిస్తాడు. మహేష్ మనస్సు మరి దివ్య ని ఇచ్చి పెళ్లి చెయ్యాలని అనుకుంటాడు.

ప్రి-క్లైమాక్స్ : అప్పటికే సూర్య గ్రహణం స్టార్ట్ అవ్వటం తో ఓజా ప్రజలు జూవాఎక్కడ వుందో తెలియక  బాధపడుతుంటారు.అదేసమయంలో మాంబో నుండి తప్పించుకున్న అఖిల్ , దివ్య , మిగిలిన వాళ్ళంతా ఓజా ప్రజలువుండే చోటుకు చేరుకుంటారు.మరో వైపు  సైంటిస్ట్కతోర్జి రష్యా నుండి ఆఫిక్రా వస్తాడు.అకక్డ దివ్య నుండి నిజం రప్పిస్తాడు.  

క్లైమాక్స్ : అఖిల్ దైర్యం చేసి ఆ జూవా ఎక్కడ వుందో తెలుసుకునితీసుకురావటానికి వెళ్తాడు. అప్పటికే భూ ప్రపంచం అంతరించేపోయే సూచనలు  కనిపిస్తుంటాయి. ఆ జూవా ని తీసుకువచ్చి యధాస్థానం లో పెట్టే క్రమం లో సైంటిస్ట్ కతోర్జి  ని , అతని అనుచరాల్ని అంతమొందిస్తాడు... చివరికి సూర్యగ్రహణం అయ్యిపోతుంది అనగా ఆ జూవా ని  యధాస్థానంలో పెట్టటం తో  కథ ముగుస్తుంది.

కలిసొచ్చే అంశాలు :

 • అక్కినేని అఖిల్  అల్ రౌండర్ పెర్ఫార్మన్స్
 • బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్
 • యాక్షన్ ఎలిమెంట్స్
 • ఫస్ట్ ఆఫ్ లో వచ్చే కొన్ని కామెడి సన్నివేశాలు
 • అమోల్ రాథోడ్ సినిమాటోగ్రఫీ
 • క్లైమాక్స్ సన్నివేశాలు

సినిమా ఫార్ములా : దేవిపుత్రుడు సినిమా లో బాక్స్ కోసం జరిగే డ్రామా  ప్లేస్ లో  ‘జూవా’(సూర్య కవచం) ని పెట్టి  వి.వి.వినాయక్తనదైన  స్టైల్ లో తీస్తే  = అఖిల్ సినిమా

ఆడియన్స్ ని ఆకట్టుకొలేనిఅంశాలు :

 • ఇంటరెస్టింగ్ గా లేని కథ –స్క్రీన్ ప్లే
 • సెకండ్ ఆఫ్ లో బలవంతంగా చేసే కామెడి సన్నివేశాలు
 • విసిగించే సాంగ్స్
 • విలన్స్ నుండి సరైన సపోర్ట్  లేకపోవటం
 • తెలుగు సినిమా ఫార్ములా ని రిపీట్ చెయ్యటం

సినిమా ఎవరికీ నచ్చుతుంది :

 • అక్కినేని నాగేశ్వర్రావు , అక్కినేని నాగార్జున  , అక్కినేనిఅభిమానులని ఇష్టపడే వారికీ ఈ సినిమా నచ్చుతుంది.
 • ఇంటరెస్టింగ్ పాయింట్స్ తెలుసుకునే వారికీ ఈ సినిమానచ్చుతుంది.

ఫినిషింగ్ టచ్ : పవర్ లేని అఖిల్ 

రేటింగ్ : 2.5 /5

recent reviews

Keshu Ee Veedinte Naadhan

Time pass comedy entertainer

Plan Panni Pannanum

Average comedy entertainer

Velan

Decent rural family entertainer

Meow

Soubin Shahir and Mamta Mohandas shine in this conventional film

Read more

galleries