Top

Review : Baahubali Movie

బాహుబలి ఒక విజువల్‌ ఎఫెక్ట్స్‌ ప్రపంచం

Source: General

By: Durga Ramesh

Critic's Rating: 3/5

Thursday 28 April 2016

Movie Title

Review : Baahubali Movie

Director

SS Rajamouli

Star Cast

Prabhas, Anushka, Rana Daggubati

స్టోరీ ఐడియా :-  మహిష్మతి రాజ్యం కోసం ఇద్దరూ అన్నదమ్ములు  చేసే పోరాటం…ఆ అన్న దమ్ములు బిడ్డలు విరోధులుగా సాగించే ప్రయాణమే ఈ సినిమా పూర్తి కథ.
ఈ బాహుబలి పార్ట్ -1  ఐడియా ఒక గొప్పరాజు (అమరేంద్ర బాహుబలి) కొడుకు శివుడు ప్రేమ కోసం చేసే ప్రయాణం, తన తండ్రి గురించి తెలుసుకోవడమే ఈ కథ.
స్టోరీ :-  అమరేంద్ర బాహుబలి (మహిష్మతి రాజ్యం రాజు -ప్రభాస్ ), దేవ సేన (అనుష్క) కి ఒక కొడుకు పుడతాడు. ఆ కొడుకుని చంపాలని చూస్తే శివగామి (రమ్యకృష్ణ) ప్రాణాలొడ్డి, కాపాడి ఒక గూడెం ప్రజల వద్దకు చేర్చుతుంది. అప్పుడు గూడెంలో పిల్లలులేని జంట ఆ పసి బిడ్డ పేరు శివుడు అని పెట్టి పెంచుకుంటారు. కొండలు ఎక్కే శివుడు పెద్ద వాడై  జలపాతాల వెనుక వున్నా ఒక అమ్మాయి అవంతిక (తమన్నా) కోసం పరుగులు తీస్తాడు. ఆమెకు దగ్గరై , ఆమె ప్రేమను పొందుతాడు. అవంతికకి ఒక సైన్యం వుంటుంది. ఒక ఆశయం వుంటుంది.అదే దేవసేన (అనుష్క)ను విడిపించీ తీసుకురావడం. ఆ ఆశయాన్ని నేను సాధిస్తానని శివుడు ( ప్రభాస్) మాటిస్తాడు.
మహిష్మతి రాజ్యంలోకి వచ్చి విరోచితంగా పోరాడి దేవసేనను  విడిపించుకుని  వెళ్తుండగా కట్టు బానిస కట్టప్ప (సత్య రాజ్ ) ఎదురు తిరుగుతాడు. అయితే శివుడ్ని చూసిన కట్టప్ప ఆయుధాలు వదిలేసి. బాహుబలి అని అంటాడు. కట్టప్ప అలా ఎందుకు అన్నాడు…? కట్టప్ప చెప్పిన బాహుబలి కథ ఏమిటి…? అమరేంద్ర బాహుబలికి భల్లాలదేవుడికి మధ్య వున్నా కథ ఏమిటి…? అనేది బాహుబలి పార్ట్ – 2 లో మిగిలిన కథ నడుస్తుంది….!

స్క్రీన్ ప్లే :
శివగామి క్యారెక్టర్ – చిన్న పిల్ల వాడ్ని ( శివుడు ) ని కాపాడటం తో సినిమా స్టార్ట్ అవుతుంది. తర్వాత శివుడు, గూడెం వాళ్ళ కి దొరకడం, పెరగటం, అవంతిక ( తమన్నా ) కోసం ప్రయాణం అంతా డైరెక్టర్ పాయింటఫ్ వ్యూ లో స్టోరీ జరుగుతుంది. ఆ తర్వాత అవంతిక ( తమన్నా ) పాత్ర ద్వారా – దేవసేన, కట్టప్ప, భల్లాలదేవ క్యారెక్టర్ లు ఓపెన్ చేసి, క్యారెక్టర్స్ ఎస్టాబ్లిష్ మెంట్ చేశారు. ఆ తర్వాత అవంతిక – శివుడు ప్రేమ కధ జరుగుతూ వెళ్ళి, అవంతిక లక్ష్యం – శివుడు తీరుస్తానని బయల్దేరడం.....అక్కడ నుండి కధ మహిష్మతి రాజ్యానికి వెళ్ళింది.
మహిష్మతి రాజ్యం లో భల్లాలదేవ ని విగ్రహ ప్రతిష్టాపన ద్వారా శివుడు – ప్రజలకు కనపడటం తో బాహుబలి గుర్తుకు వస్తాడు....దాని తో భల్లాలదేవుడు ‘బాహుబలి’ రూపం లో ఉన్న శివుడ్ని చూడటం.....తర్వాత శివుడు – దేవసేన ను తీసుకెళ్తుండగా కట్టప్పతో యుద్ధం. ఈ యుద్ధం లో బద్రుడు ( అడవి శేష్ ) ని శివుడు చంపటం....కట్టప్ప - శివుడు యుద్ధం....శివుడు ముఖాన్ని చూసి కట్టప్ప కాళ్ళ మీద పడటం తో కధ ఫస్టాప్ అయిపోతుంది.

సెకండాఫ్ ‘‘నెనెవర్ని’’ అని శివుడు అనడం తో కట్టప్ప ఫ్లాష్ బ్యాక్ తన పాయింటాఫ్ వ్యూ లో చెప్పడం చేశారు.  
ఫ్లాష్ బ్యాక్ శివగామి క్యారెక్టర్ తో మొదలై, భల్లాలదేవ – బాహుబలి చిన్నతనం నుండి ఎదుగుదల, యుద్ధ విద్యలు నేర్చుకోవడం, సారీ సమానంగా తయారవ్వడం. ఆ తర్వాత రాజద్రోహి కోసం ప్రయాణం తద్వారా చివరికి కాలకేయుల యుద్ధానికి సన్నద్ధాలు....వ్యూహాలు , కాలకేయుల తో యుద్ధం, త్రిశూల వ్యూహం. ఇలా ఫ్లాష్ బ్యాక్ అంతా మళ్ళి డైరెక్టర్ పాయింటాఫ్ వ్యూ లో స్టోరీ నడిచి, చిన్న ట్విస్ట్ తో సినిమా ఎండ్ అవుతుంది.
 
సినిమాకి కలిసి వచ్చే అంశాలు :
 • ప్రభాస్ హీరో ఎలివేట్ చేసే సీన్స్ బాగున్నాయి. ( ఫ్యాన్స్ ని )
 • ప్రభాస్ – తమన్నా లవ్ ఎపిసోడ్స్ ( యూత్ ని ఆకర్షిస్తాయి )
 • మహిష్మతి నగరం – గ్రాఫిక్స్ చాలా బాగున్నాయి.
 • రమ్యకృష్ణ (శివగామి) , సత్య రాజ్ ( కిట్టప్ప) గా బాగా నటించారు. ( ఎమోషన్ పండించారు )
 • ప్రభాస్ – రానా  యుద్ధ సన్నివేశాలు బాగున్నాయి.
సినిమా ఈక్వేషన్ :
 • జానపదంలో హీరో ( చిన్న ప్రభాస్ ) – అతని ప్రేమ ప్రయాణం ( భైరవ ద్వీపం ) 
 • పాండవులు – కౌరవులు  ( మహా భారతం ) అన్న – దమ్ముల అధికారం కోసం యుద్ధాలు ( ఫ్లాష్  బ్యాక్ )  =  బాహుబలి ‘‘బిగినింగ్’’
సినిమా ఎవరికి నచ్చుతుంది :
 • ‘‘మగధీర’’, ‘‘భైరవద్వీపం’’, సినిమాలు నచ్చిన వారికి ఈ సినిమా నచ్చుతుంది.
 • లవ్, యాక్షన్ కధ లో ఉన్నాయి కాబట్టి – యూత్ కి నచ్చుతుంది.
 • రమ్య కృష్ణ శివగామి క్యారెక్టర్ సెంటిమెంట్స్ ఉన్నాయి కాబట్టి లేడిస్ కి నచ్చుతుంది.
 • వార్ ఎపిసోడ్ లు అందరికీ నచ్చుతాయి.
ఫైనల్ టచ్ : బాహుబలి  ఒక విజువల్‌ ఎఫెక్ట్స్‌  ప్రపంచం 

బాహుబలి మూవీ రేటింగ్ : 4.4/5
 


recent reviews

Keshu Ee Veedinte Naadhan

Time pass comedy entertainer

Plan Panni Pannanum

Average comedy entertainer

Velan

Decent rural family entertainer

Meow

Soubin Shahir and Mamta Mohandas shine in this conventional film

Read more

galleries