Review : Bengal Tiger
ఈ టైగర్ - ఓల్డ్ కమర్షియల్ ఫార్ములా
Review : Bengal Tiger
sampath nandi
Raviteja , tamanna bhatia, rashi khanna
స్టొరీ లైన్ : రాజకీయ పదవి కోసం చేసే పోటి చేసే ప్రయత్నం లోతండ్రి ని కోల్పోయిన ఒక యువకుడు,ఫేమస్ అవ్వుతూముఖ్యమంత్రి మీద రివెంజ్ తీర్చుకోవటానికి చేసిన ప్రయత్నమే ఈ బెంగాల్‌టైగర్ మూల కథ
స్టొరీ :ఆకాష్నారాయణ్ (రవితేజ) ఆత్రేయపురం అనే గ్రామం లో అల్లరి చిల్లరిగా తిరుగుతూ అన్నివిషయాల్లో అందరితో గొడవపడుతూ వుంటాడు. ఆకాష్ చేస్తున్న పనులు నచ్చక అతనికి పెళ్లిచేసే క్రమంలో పెళ్లి కూతురు (అక్ష) ఆకాష్‌తో 'నాకుఫేమస్ అయ్యే వాడు మొగుడు గా రావాలి' అనిఅక్ష ఆకాష్ ని రిజెక్ట్ చేస్తుంది.ఆత్రేయపురం గ్రామంలోకి వచ్చిన అగ్రికల్చర్ మినిస్టర్ (షాయేజి షిండే)ని రాయి తోకొట్టి ఆకాష్ ఫేమస్ అవ్వటానికి చేసేప్రయత్నం లో మీడియా లో ఫేమస్ అయ్యి తిరిగిషాయేజి షిండే దగ్గరే జాయిన్ అవ్వుతాడు. హొo మినిస్టర్నాగప్ప (రావు రమేష్) తన కూతురు శ్రద్ద(రాశీ ఖన్నా) ని ఎయిర్ పోర్ట్ నుండితీసుకొచ్చే క్రమంలో హొoమినిస్టర్ నిఆకాష్ కాపాడుతాడు. ఆ ప్రయత్నం లో హొo మినిస్టర్నాగప్ప తన కూతురికి బాడిగార్డ్ గా ఆకాష్ ని నియిమిస్తాడు. శ్రద్ధ కి బాడీ గార్డ్‌గా వున్నాఆకాష్ కి శ్రద్ద కి మధ్య ప్రేమ మొదలై అది పెళ్లి వరుకు దారి తీస్తుంది.హొo మినిస్టర్ తన కూతురితో ఆకాష్ ఇచ్చే చేస్తాను అని అందరిముందు చెప్పే క్రమంలో ఆకాష్ నేనుముఖ్యమంత్రి అశోక్ గజపతి (బొమ్మన్ ఇరానీ) కూతురు మీరా (తమన్నా ) ని ప్రేమిస్తున్నాను అని చెప్పి అందరికి షాక్ ఇస్తాడు. అసలుఆకాష్ కి ముఖ్యమంత్రి కి వున్నా సంబంధం ఏంటి...? ఆకాష్ఫేమస్ అయ్యే ప్రయత్నం లో ముఖ్యమంత్రి ని ఏలా ఎదురుకున్నాడు...? ఆకాష్ కి వున్నా లక్ష్యం ఏంటి..అనేవి తెలియాలంటే తెరమీద చూడాల్సిందే.
స్క్రీన్ ప్లే :
"బెంగాల్‌టైగర్" సినిమా రవితేజ పాయింట్ ఆఫ్ వ్యూ లో స్టార్ట్ అయ్యి ఫ్లాష్ బ్యాక్ లోకివెళ్తూ ఆత్రేయపురం అనే విలేజ్ లో వున్నా రవితేజ క్యారెక్టర్ గురించి చెప్పటంజరుగుతుంది.
ఇంటరెస్టింగ్పాయింట్ 1 :
- నాకుఫేమస్ అయ్యే వాడు భర్తగా రావాలని అక్ష రవితేజ కి చెప్పి అక్ష రవితేజ తోపెళ్లి చూపులు కాన్సిల్ చేసుకోవటం.
ప్లాట్పాయింట్ 1 : అగ్రికల్చర్ మినిస్టర్ (షియాజీ షిండే) మీదరాయితో కొట్టి మీడియా లో ఫేమస్ అయ్యి అగ్రికల్చర్ మినిస్టర్ (షియాజీ షిండే) దగ్గరే జాబ్ లో జాయిన్ అవ్వటం.
సినిమాప్లే :
- ఫారెన్నుండి వస్తున్నా హొoమినిస్టర్నాగప్ప (రావు రమేష్) ఫ్యామిలీ ని రవితేజ కాపాడటం
- హొo మినిస్టర్నాగప్ప (రావు రమేష్) కూతురు శ్రద్ద (రాశిఖన్నా) కి బాడిగార్డ్ గా రవితేజ వుండటం
- రాశిఖన్నా -రవితేజ మధ్య లవ్ కెమిస్ట్రీ పెళ్ళికి దారి తియ్యటం
- రావురమేష్ రవితేజ ని అల్లుడుగా ఒప్పుకొనేప్రయత్నం లో రవితేజ సి.యం అశోక్ గజపతి (బొమ్మన్ ఇరానీ) కూతురు మీరా (తమన్నా ) నిప్రేమిస్తున్నాను అని చెప్పటం
ఇంటర్వెల్
ఇంటరెస్టింగ్పాయింట్ 2:
- రవితేజ కి తమన్నా ప్రేమిస్తున్నాను అని చెప్పటం
- అశోక్‌గజపతి (బొమ్మన్ ఇరానీ ) కి రవితేజ శంకర్ నారాయణ్( నాగినీడు) కొడుకు అనితేలిసిపోవటం
ప్లాట్పాయింట్ 2 :బోమన్ ఇరానీ రవితేజ కి 500 కోట్లు డీల్ఆఫర్ చెయ్యటం. రవితేజ మీరా ని వదిలి దూరంగా వెళ్ళే క్రమం లో ఆ విషయం తమన్నా, రాశి ఖన్నా కితెలిసి రవితేజ ని అడిగేసరికి రవితేజ ఫ్లాష్ బ్యాక్ చెప్పటం.
ఫ్లాష్‌బ్యాక్ :
శంకర్‌నారాయణ్ (నాగినీడు) చేప మందు పంపిణీ చేసే అందరి నుండి మంచి పేరు తెచ్చుకున్నమనిషికి రాజకీయలోకి రావాలని పార్టీ టికెట్ ఇచ్చే క్రమంలో బొమ్మన్ ఇరానీ నాగినీడు ని దొంగ దెబ్బతీసినాగినీడు సంపాదించుకున్న పేరుని అందరిముందు చెడగొట్టే ప్రయత్నం లో నాగినీడు నిబొమ్మన్ ఇరానీ చంపటంతో ఫ్లాష్ బ్యాక్ ముగుస్తుంది.
ప్రీక్లైమాక్స్ :
బొమ్మన్ఇరానీ ని ముఖ్యమంత్రి పదవి నుండి దించే వేసే క్రమంలో రవితేజ బొమ్మన్ ఇరానీ కిసంబంధించిన ఆధారాలు వుండటం వలన అతని పదవిపోతుంది.
క్లైమాక్స్: రవితేజ బొమ్మన్ఇరానీ ని ఆత్రేయపురం ఊరి జనం ముందుతీసుకువచ్చి చంపెయ్యటం తో సినిమా ముగుస్తుంది.
కలిసొచ్చే అంశాలు :
- యాక్షన్ ఎపిసోడ్స్
- రవితేజ పంచ్ డైలాగ్స్
- రాశి ఖన్నా & తమన్నా గ్లామర్
- ఓపెనింగ్ సీన్ - ఇంటర్వెల్ బాంగ్
- పృథ్వి రాజ్ -రవితేజ మధ్య వచ్చే కామెడిసన్నివేశాలు
సినిమా ఫార్ములా :
- రవితేజ 'డాన్‌శ్రీను' సినిమా లో డాన్ అవ్వుధాం అని సిటీకి వచ్చే ఫేమస్ అయ్యే ప్రయత్నం లో అతను లక్ష్యం కోసం చేసే దానిలో వున్నా బేస్‌పాయింట్ కి ఈ బెంగాల్ టైగర్ సినిమా లోరవితేజ ఫేమస్ అవ్వటం కోసం చేసే ప్రయత్నం లో అతని లక్ష్యం రెండు ఇంచు మించు ఒకే లాగవుంటాయి.
- రామ్ గోపాల్ వర్మ'సత్య 2' సినిమా లో శర్వానంద్ సిటీ కి వచ్చే ఫేమస్ అయ్యే క్రమం లో అతనికి వున్నాలక్ష్యం అనే పాయింట్ లో ఈ రవితేజక్యారెక్టర్ ని పెడితే ఈ బెంగాల్ టైగర్ సినిమా అవ్వుతుంది.
సినిమా ఎవరికీ నచ్చుతుంది :
- మాస్ మసాలా రవితేజసినిమాలని ఇష్టపడే వారికీ ఈ సినిమా నచ్చుతుంది
- 'బెంగాల్ టైగర్' టైటిల్ ఇంటరెస్టింగా వుంటుంది కనుక అందరికిఈ సినిమా ని చూడాలి అనే ఆసక్తి కలుగుతుంది.
- కమర్షియల్ సినిమాలని ఇష్టపడే వారికి ఈ సినిమా నచ్చుతుంది.
ఫినిషింగ్ టచ్ : ఈ టైగర్ - ఓల్డ్ కమర్షియల్ ఫార్ములా
సినిమా రేటింగ్ :2.75/5