Review : Bruce Lee - The Fighter
బ్రూస్ లీ - ఈ ఫైటర్ అందరి మనస్సు గెలిచాడు
Review : Bruce Lee - The Fighter
Srinu Vaitla
Ram Charan, Rakul Preet Singh, Kriti Kharbanda
స్టొరీ లైన్ (ప్లాట్ ) : తనఅక్క కలెక్టర్ అవ్వటానికి లక్ష్యంపెట్టుకున్న తమ్ముడు చేసిన సాహసాలే ఈసినిమా మూల కథ
సినిమా కథ : కార్తీక్(రామ్ చరణ్) ని కలెక్టర్ చెయ్యాలని లక్ష్యం పెట్టుకున్న రామచంద్ర (రావురమేష్)కి తన కొడుకు విఫలం అవ్వటంతో తన కూతురు కావ్య (కృతి ఖర్బంద )ని కలెక్టర్ చెయ్యాలని అనుకుంటాడు. తన అక్క లక్ష్యం కోసం తన కెరియర్ ని ఫనంగా పెట్టి అక్క లక్ష్యం నేరవెరటానికిసినిమా లో స్టన్స్ చేస్తూ తను సంపాదించిన డబ్బులతో తన అక్క ని లక్ష్యం వైపు అడుగులు వేసే విధంగా చేస్తుంటాడు. కార్తీక్ జీవితం లోకి రియా (రకుల్ ప్రీత్‌సింగ్ ) వచ్చిన దగ్గరనుండి రామ్ చరణ్ లైఫ్ సిటీ లో వుండే గాంగ్ స్టర్ అయిన దీపక్ రాజ్ (అరుణ్ విజయ్) వ్యాపారం మీద దెబ్బకొడతాడు. ఇదంతా ఎవరు చేస్తున్నారో తెలుకునే ప్రయత్నం లో ఒక అనుకొని కేసులో కావ్య (కృతి ఖర్బంద ) చిక్కుకుంటుంది. తన అక్కనిఆ కేసు నుండి కాపాడే ప్రయత్నం లో కార్తీక్(రామ్ చరణ్ ), జయరాజ్ (సంపత్ ) గురించి అతనిచీకటి రాజ్యం వెనకనున్న రహస్యాన్ని తెలుసుకోవటానికి జయరాజ్ (సంపత్ ) కంపెనీ లో చేరతాడు. జయరాజ్(సంపత్ ) వెనకనున్న రహస్యం ఏంటి...? అసలు జయరాజ్ కి కార్తీక్ కి సంబంధం ఏంటి...?వసుంధర (నదియా ) కి జయరాజ్ కి వున్నాసంబంధం ఏంటి...? కావ్య (కృతి ఖర్బంద ) తన లక్ష్యం నెరవేరిందా...? అనేది
తెర మీద చూడాల్సిందే ...!
స్క్రీన్ ప్లే : బ్రూస్లీ కథ వాయిస్ ఓవర్ న్యారేషన్ లో స్టార్ట్ అవుతూ సినిమా లో క్యారెక్టర్స్ ని పరిచయం చేస్తూకొనసాగుతుంది. కార్తీక్ (రామ్ చరణ్) , కావ్య (కృతి ఖర్బంద ) ఇద్దరిని చదివించటానికి రామచంద్ర (రావురమేష్) ఇబ్బంది పడుతుంటాడు. ఎప్పటికి అయిన తన కొడుకుని కలెక్టర్ చెయ్యాలని క్రమంలో అన్ని తనకొడుక్కే చేస్తుంటాడు. అది గమనించిన రామచంద్ర(రావురమేష్) కూతురు కావ్య కూడా కలెక్టర్అవ్వాలని పట్టుబడుతుంది. తన అక్క ని కలెక్టర్చెయ్యటానికి తన కెరియర్ ని త్యాగం చేస్తాడు కార్తీక్ (రామ్ చరణ్). సినిమా లోస్టన్స్ , హీరోలకి యాక్షన్ సీన్స్ లో డుబ్ కింద నటిస్తూ వుంటాడు. ఆ డబ్బులతో తన అక్క లక్ష్యానికి దగ్గర చేస్తూజీవితాన్ని గడిపేస్తున్నా సమయం లో రియా(రకుల్ ప్రీత్ ) కార్తీక్ (రామ్ చరణ్) ని చూసి అతను ఒక పోలీసాఫీసర్ అనుకుని లవ్ లోపడుతుంది. అతని మీద ఒక గేమ్ డిజైన్చెయ్యాలని ప్లాన్ చేస్తూ అతని చుట్టూ తిరుగుతుంది. ఆ ప్రయత్నం లో రియా చేసే ప్రతి పనిలో కార్తీక్ ని ఇన్వాల్వ్ చేస్తుంది. కార్తీక్ చేసే ప్రతి పని సిటీలో గ్యాంగ్ స్టర్ అయిన దీపక్ రాజ్ (అరుణ్ విజయ్) వ్యాపారం మీద దెబ్బకొట్టినట్టు చేస్తాడు. ఇదంతా చేస్తుంది ఎవరు తెలుసుకునే క్రమం లో దీపక్ రాజ్(అరుణ్ విజయ్) వుంటాడు.
వసుంధర (నదియా ) & జయరాజ్(సంపత్ ) ల కొడుకు ఒక ఫంక్షన్ లో రామచంద్ర(రావురమేష్) కూతురు కావ్య ని చూసి ఇష్టపడతాడు. రామచంద్ర , వసుంధర (నదియా ) వాళ్ళకంపెనీ లో పనిచెయ్యటం వలన అతని మంచితనం చూసి వాళ్ళతో సంబంధం కలుపుకోవాలని వసుంధర & జయరాజ్ అనుకుంటారు.
ప్రాబ్లం ఎస్టాబ్లిష్ మెంట్ : కావ్య (కృతి ఖర్బంద ) కలెక్టర్అవ్వాలని లక్ష్యం వైపు వెళ్తున్న సమయం లో దీపక్ రాజ్ (అరుణ్ విజయ్) ఒకఅనుకోని కేసు లో కావ్య ని ఇరికిస్తాడు. పోలీసు కేసు వుంటే కలెక్టర్‌కి అర్హత వుండదు అని బాధతో కావ్య ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం లో కార్తీక్ (రామ్ చరణ్ ) తన అక్కకి వచ్చిన సమస్యగురించి తెలుసుకుని ఆ బాధ్యత తన మీద వేసుకుంటాడు.
తన అక్కని కేసులో ఇరికించింది దీపక్ రాజ్ (అరుణ్‌విజయ్) అని తెలుసుకుని అతనితో పోరు కి సిద్దం అవుతాడు. మరో వైపుఇన్నిరోజులు తన వ్యాపారాలు అన్ని నాశనం చేసింది కార్తీక్ (రామ్ చరణ్ ) అనితెలుసుకుంటాడు. ఆ పోరులో కార్తీక్, దీపక్ రాజ్ (అరుణ్ విజయ్) సామ్రాజన్ని నాశనంచేస్తాడు. వసుంధర (నదియా ) కొడుకు తో రామచంద్ర(రావురమేష్) కూతురు కావ్య (కృతి ఖర్బంద) కి ఎంగేజ్ మెంట్ అయ్యిపోతుంది.
ప్లాట్ పాయింట్ 1 : అంత సవ్యంగా వుంది అనుకున్న సమయం లో దీపక్ రాజ్ (అరుణ్ విజయ్) ని హాస్పిటల్ బెడ్ మీద చూసిన జయరాజ్ (సంపత్ ) , దీపక్ రాజ్ కూడ తన మొదటి భార్య కొడుకు గా రివిల్అవుతుంది. తన కొడుకుని ఈ స్థితిలోకి ఉండటానికి కారణం అయ్యిన వాడిని నాశనం చేస్తానుఅని తన మొదటి భార్య టిస్కా చోప్రా కి మాటిస్తాడు జయరాజ్ (సంపత్ )
ఇంటర్వెల్
రియా (రకుల్ ప్రీత్ )కార్తీక్ ని తన ఇంటికి తీసుకుని వెళ్లి తన ఫ్యామిలీ కి పరిచయం చేస్తుంది. ఆప్రయత్నం లో రియా తండ్రి ఒక పోలీసాఫీసర్ అని తెలియగానే కార్తీక్ బయపడతాడు. రియా తండ్రి(ముకేష్ రుషి ) కార్తీక్ పోలీసాఫీసర్ కాదు అని , స్టన్స్ మాస్టర్ అనితెలుసుకుంటాడు.
ప్లాట్ పాయింట్ 2 : రియాతండ్రి కార్తీక్ కి ఒక కేసు గురించిచెబుతాడు. జయరాజ్ (సంపత్ ) చీకటిరాజ్యం వెనక వున్నా రహస్యాన్ని బయటపెడితేఅతను చేసిన అక్రమాలకి ఫుల్ స్టాప్పడుతుంది అని దీపక్ రాజ్ (అరుణ్ విజయ్) ఎవరో కాదు అని జయరాజ్ మొదటి భార్య కొడుకుఅని చెబుతాడు. ఆ విషయాలను విన్నా కార్తీక్ రియా తండ్రి చెప్పిన ప్రాజెక్ట్ చెయ్యటానికి సిద్దం అవుతాడు.
సుసుకి సుబ్రహ్మణ్యం (బ్రహ్మానందం ) ని అడ్డం పెట్టుకుని ఒక డ్రామా ప్లే చేస్తూ కార్తీక్ (రామ్ చరణ్ ) జయరాజ్ (సంపత్ )వెనకనున్న రహస్యాలను అన్ని బయటపెడుతూ జయరాజ్ (సంపత్ ) రెండో భార్య కి అసలు విషయంతెలిసేలాగా చేస్తాడు.
ప్రి-క్లైమాక్స్ : జయరాజ్ (సంపత్ ) తన రెండో భార్య అయిన వసుంధర (నదియా ) ని , అతని కొడుకుని , కావ్య (కృతి ఖర్బంద ) ని దీపక్ రాజ్ (అరుణ్ విజయ్) రాజు కిడ్నాప్ చేసి వాళ్ళను చంపాలని ప్రయత్నంచేస్తున్న సమయం లో కార్తీక్ (రామ్ చరణ్ ) వచ్చి వాళ్ళని కాపాడుతాడు. ఆ గొడవలో దీపక్ రాజ్ (అరుణ్ విజయ్) ని చంపేస్తాడు. దీపక్‌రాజ్ (అరుణ్ విజయ్) ని చంపి జయరాజ్ (సంపత్ ) కి గిఫ్ట్ గా పంపిస్తాడు.
క్లైమాక్స్ : రామచంద్ర (రావురమేష్) ని అడ్డం పెట్టుకుని జయరాజ్ (సంపత్ ) ఒక ప్లాన్ వేసి కార్తీక్ గర్ల్ ఫ్రెండ్ రియా (రకుల్ ప్రీత్ )ని కిడ్నాప్ చేయిస్తాడు. రామచంద్ర ని చంపటానికి ట్రై చేస్తాడు. ఆప్రయత్నం లో గాయాలు అయిన రామచంద్ర ని తనకొడుకు కార్తీక్ హాస్పిటల్ కి తీసుకువెళ్తాడు. మరో వైపు కార్తీక్ తన గురువు (మెగాస్టార్ చిరంజీవి ) సహాయంతీసుకుని తన గర్ల్ ఫ్రెండ్ ని కాపాడుమనిచెబుతాడు. మెగాస్టార్ రియాని కాపాడి కార్తీక్ కి అప్పగిస్తాడు. జయరాజ్(సంపత్ ) మీద వున్నా రహస్యాలు అన్నిబయటపడటం తో అతని అరెస్ట్ చెయ్యటానికి పోలీసు డిపార్టమెంట్ రావటంతో కథ ముగుస్తుంది.
కలిసొచ్చే అంశాలు :
- రామ్ చరణ్ అల్ రౌండర్ పెర్ఫార్మన్స్
- రకుల్ ప్రీత్ సింగ్ అందాలు
- తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్
- మెగాస్టార్ స్టైలిష్ ఎంట్రీ
- యాక్షన్ ఎలిమెంట్స్
- ఫస్ట్ ఆఫ్ లో వచ్చే కొన్ని కామెడి పార్ట్
- రావు రమేష్ పంచ్ డైలాగ్స్
- మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫీ
- శ్రీను వైట్ల బ్రాండ్ మార్క్
సినిమా ఎవరికీ నచ్చుతుంది :
- శ్రీను వైట్ల సినిమాలు ఇష్టపడే వారికీ ఈ సినిమానచ్చుతుంది.
- మెగాస్టార్ ఫాన్స్ కి మెగాస్టార్ రీ-ఎంట్రీ కోసం వెయిట్ చేసే వాళ్ళకి ఈ సినిమా నచ్చుతుంది.
ఫినిషింగ్ టచ్ : బ్రూస్ లీ - ఈ ఫైటర్ అందరి మనస్సు గెలిచాడు
రేటింగ్ : 3.00 /5