Review : Courier boy kalyan
సినిమా రివ్యూ: కొరియర్ బాయ్ కళ్యాణ్
Review : Courier boy kalyan
Premsai
Nithin, yami gautam
స్టొరీ లైన్ (ప్లాట్ ) : ఒక కొరియర్ లో వున్నా నిజాన్ని ఒక సామాన్య మనిషి ఏలాబయట పెట్టాడో అనేది ఈ సినిమా కథ.
స్టొరీ : పి.కె అలియాస్ పనిలేని కళ్యాణ్ (నితిన్ )లైఫ్ లో పని పాట లేకుండా జాలిగా తిరుగుతున్న అతని కి కావ్య (యామి గౌతం ) ని తోలి చూపులోనే చూసిఇష్టపడతాడు. ఆమె ని ప్రతి సారి కలవటానికి కొరియర్ జాబ్ లో జాయిన్ అయ్యి ఆమెను ఇంప్రెస్స్ చెయ్యటానికి ట్రై చేస్తుంటాడు. ఇదిలా వుండగా మానవ జన్యూ కణాల మీద పరిశోధన సాగిస్తున్న సైంటిస్ట్ అశుతోష్ రానా తన ప్రయోగానికి కావాల్సిన వాటికోసం చేస్తున్న పరిస్థితి లో అన్ని నగరాల్లో వున్నా గర్భిని స్త్రీలకు అబార్షన్స్ అయ్యిపోతుంటాయి. దాని వెనక వున్నా కారణాలుతెలిసిన ఒక సామ్యాన మనిషి ఆ రహస్యాలను సత్యమూర్తి (నాజర్ ) కి కొరియర్చేస్తాడు. ఆ విషయం సైంటిస్ట్ అశుతోష్ రానా కి తెలిసి ఆ కొరియర్ ని ఎలాగైనా సత్యమూర్తి కిచేరకుండా ఆపాలనే చేసే ప్రయత్నం లో కళ్యాణ్ చిక్కుకుంటాడు. అసలు ఆ కొరియర్ లో వున్నా నిజాలు ఏలా బయటపడ్డాయి. కళ్యాణ్ – కావ్య లవ్ సక్సెస్అయ్యిందా లేదా అనేది తెర మీద చూడాల్సిందే.
స్క్రీన్ ప్లే :
సినిమా ఫారెన్ లో ఒక హాస్పిటల్ లో స్టార్ట్అవుతుంది. అక్కడ సైంటిస్ట్ అశుతోష్ రానా చేసే పరిశోదన లో చిన్న లోపం రావటం తో అక్కడ పరిశోదన చెయ్యటానికి ప్లేస్ లేక , ఆప్లేస్ కోసం వెతికే సమయం లో కథ ఇండియా కిషిఫ్ట్ అవుతుంది.
పని పాట లేకుండా జాలిగాతిరుగుతున్న కళ్యాణ్ కి తన ఫ్రెండ్స్ ,ఇంట్లో వాళ్ళు జాబ్స్ వెతికే పని వుంటారు. కానీ అన్ని ఫెయిల్ అయ్యిపోతూవస్తుంటాయి.
తన ఫ్రెండ్ నస(రాజేష్ ) ఒకకొరియర్ డెలివరి పని కళ్యాణ్ కి అప్పగించటం తో తన లైఫ్ లోకి కావ్య (యామిని గౌతం ) వస్తుంది. కావ్య కోసం కళ్యాణ్ కొరియర్ జాబ్ లోజాయిన్ అవ్వటం , కావ్య కోసం డైలీ కొరియర్స్ లేకపోయినా సృష్టించి కావ్య దగ్గరకి వెళ్లి తన లవ్ ని ఇంప్రెస్స్ చెయ్యడం జరుగుతుంది.
ప్రాబ్లం ఎస్టాబ్లిష్ మెంట్ : హాస్పిటల్ కి వచ్చే గర్భిని స్త్రీలకు వరుసగాఅబార్షన్స్ అవ్వటం , ఆ సమయం లోనే సైంటిస్ట్అశుతోష్ రానా హాస్పిటల్ లో మిగిలిన డాక్టర్స్ తో మీటింగ్ఏర్పాటు చేసి అతను చేస్తున్న పరిశోధన గురించి అందరికి చెప్పటం. ఆ విషయం ఆహాస్పిటల్ లో పనిచేసే వార్డ్ బాయ్ కితెలిసి ఇది ప్రపంచానికి తెలియాలని ఆ డిటైల్స్ అన్ని సత్యమూర్తి (నాజర్ ) కి కొరియర్ చెయ్యటం జరుగుతుంది. ఆ విషయం అశుతోష్ రానా కి తెలిసిపోవటం , ఆ కొరియర్ ని ఎలాగైనా ఆపాలనిప్రయత్నం స్టార్ట్ చేస్తారు.
ప్లాట్ పాయింట్ 1 : కళ్యాణ్ లవ్ చేస్తున్న విషయం కావ్య కి తెలిసిపోతుంది.కావ్య కళ్యాణ్ ని ఒక కేఫ్ లో కలుస్తాను అని చెప్పటం. కళ్యాణ్ లివ్ పెట్టి కావ్య కోసం వెళ్ళే ప్రయత్నంలో నస (రాజేష్ ) డెలివరి చేయ్యాలిసినకొరియర్ కళ్యాణ్ చేతికి వస్తుంది. కళ్యాణ్ కావ్య నికలవకుండా సత్యమూర్తి కి కొరియర్ డెలివరి చేద్దామని సత్యమూర్తి ఇంటికి వెళ్తుంటాడు.
ఇంటర్వెల్
సత్యమూర్తి ఇంట్లో అప్పటికే అశుతోష్ రానా మనుషులు ఆ కొరియర్ కోసం వెయిట్ చేస్తుంటాడు. కళ్యాణ్ సత్యమూర్తి కి కొరియర్ డెలివరి చేసి వెళ్లిపోతుంటే పెన్ మర్చిపోవటం వలన కళ్యాణ్ మళ్ళి తిరిగి సత్యమూర్తి ఫ్లాట్ కి రావటం , అక్కడ అశుతోష్ రానా మనుషులు సత్యమూర్తి దగ్గర వున్నా కొరియర్ని దొంగిలించాలనే ప్రయత్నం లో కళ్యాణ్ ఆ కొరియర్ ని తీసుకుని అక్కడ నుండి తప్పించుకునిపారిపోతాడు.
కళ్యాణ్ ఆ కొరియర్ తో తప్పించుకోవాలని చేసే ప్రయత్నంలో గాయాలు అవుతుంటాయి. అశుతోష్ రానా మనుషులనుండి తప్పించుకోవాలని ట్రై చేస్తుంటాడు.మరో వైపు సత్యమూర్తి అసలు ఆ కొరియర్ ఎవరు పంపారు అని ఎంక్వయిరీ చేయిస్తాడు. ఆ కొరియర్ పంపిన వార్డ్ బాయ్ ని అశుతోష్ రానా మనుషులు చంపేస్తారు. ఆ విషయం తెలుసుకున్నసత్యమూర్తి , కొరియర్ లో ఏదో వుంది అని సిటీ అంత పోలీసులతో అలెర్ట్ చేయిస్తాడు.
ప్లాట్ పాయింట్ 2 : కళ్యాణ్‌కి ఆ కొరియర్ లో వున్నా నిజాలు తెలిసిపోతాయి. దీన్ని ఎలాగైనా ఆపాలని ప్రయత్నం చేస్తాడు. కానీపోలిసులల్లో కూడా అశుతోష్ రానా మనుషులువుండటం తో కళ్యాణ్ దొరికిపోతాడు.
ప్రి-క్లైమాక్స్ : పోలీసులు కళ్యాణ్ ని అశుతోష్ రానా మనుషులకు అప్పగించటానికి ట్రై చేస్తారు. కానీ ఆ టైంలోనే కళ్యాణ్ ఆ కొరియర్ కవర్ ని మార్చేస్తాడు.
క్లైమాక్స్ : అశుతోష్‌రానా మనుషులకి , కళ్యాణ్ కి మధ్య జరిగినపోరులో కళ్యాణ్ పోరాడతాడు. కానీ అదే సమయం అశుతోష్ రానా స్యయంగావచ్చి కళ్యాణ్ ని చంపాలని ట్రై చేస్తాడు. కానీ కళ్యాణ్ తెలివి తో వాళ్ళనిగవర్నమెంట్ కి పట్టిస్తాడు. వాళ్ళ ప్రజలమీద చేస్తున్నా పరిశోదన కి ఫుల్ స్టాప్పెట్టేస్తారు.
సినిమా కి కలిసొచ్చే అంశాలు:
- అద్బుతం గా వున్నా సినిమాటోగ్రఫి
- యామిని గౌతం అప్పిరేన్స్
- చివరి 20 నిముషాలు జరిగే డ్రామా
సినిమా ఫార్ములా :
- క్షణం –క్షణం సినిమా లో డబ్బు ఎక్కడ వుందో తెలుసుకోవటం కోసంజరిగే డ్రామా లో ఈ సినిమా ని పెడితే = కొరియర్ బాయ్ కళ్యాణ్
- 2012 లో వచ్చిన హాలివుడ్ సినిమా ‘’ ప్రీమియం రష్ ‘’ = కొరియర్ బాయ్ కళ్యాణ్
సినిమా ఎవరికీ నచ్చుతుంది :
- సస్పెన్స్ – డ్రామా నిఎంజాయ్ చేసేవారు ఈ సినిమా ని ఇష్టపడతారు.
- కొత్త విషయాలుతెలుసుకోవాలని ఇంటరెస్ట్ చూపే వాళ్ళకి ఈ సినిమా నచ్చుతుంది.
- ప్రేమించే అమ్మాయి కోసంఅబ్బాయి పడే పాట్లు ఎలా ఉంటాయో తెలుసుకోవాలని అనుకునేవారికి ఈ సినిమా నచ్చుతుంది.
ఫినిషింగ్ టచ్ : డెలివరి ఫెయిల్అయ్యింది
రేటింగ్ : 2.5 /5