Review : Dhanalakshmi thalupu thadithe
ధనలక్ష్మి తలుపు తడితే రివ్యూ
Review : Dhanalakshmi thalupu thadithe
Sai Achyuth Chinnari
Dhanraj, Sreemukhi, Sindhu Tolani
స్టోరీ మెయిన్ ఐడియా : నలుగురు ఫ్రెండ్స్ కి అనుకోకుండా ఒక కోటి రూపాయలు దొరికితే వాళ్ళు ఫ్రెండ్షిప్ మరిచిపోయి ప్రవర్తిస్తే ఎలా వుంటుంది... ? అనే పాయింట్ స్టోరీ మెయిన్ ఐడియా.
స్టొరీ : ఒక ఎం.పి (సింధు తులాని) మేనల్లుడు ని కిడ్నాప్ చేసి కోటి రూపాయలు డిమాండ్ చేస్తాడు రణధీర్ (విలన్). దానికి ఎం.పి ఒకే చెప్పి డబ్బు తో వస్తుంటుంది. అయితే కోటి రూపాయలు డిమాండ్ చేసిన రణధీర్ కార్ ఆక్సిడెంట్ కి గురి అవుతుంది. అందులోంచి ఎం.పి మేనల్లుడు క్షేమంగా బయటపడి , అడవిలో తిరుగుతూ వుంటాడు.
ధనరాజ్ కి ముగ్గురు స్నేహితులు వుంటారు. వాళ్ళు ఒక వెకేషన్ గా అడవిలో కార్ వేసుకుని వెళ్తుంటే , ఎం.పి మేనల్లుడు దొరుకుతాడు . ఒక పక్క డబ్బుతో వచ్చిన ఎం.పి చేతిలో బాబు ని పట్టుకుని వున్న ఈ ధనరాజ్ బ్యాచ్ కి ఒక సూట్ కేస్ ఇచ్చి ,తన మేనల్లుడి ని తీసుకుని వెళ్ళిపోతుంది. సూట్ కేస్ లో డబ్బు వుండటం తో ధనరాజ్ స్నేహితుల మధ్య కుట్రలు మొదలు అవుతాయి. డబ్బు కోసం పన్నాగాలు పన్నుకుని స్నేహితులు రెండు బ్యాచ్ లు గా విడిపోతారు. అందులో ఒక బ్యాచ్ ధనరాజ్ బ్యాచ్. వీళ్ళు అడవిలోకి వెళితే అక్కడ రణధీర్ గర్ల్ ఫ్రెండ్ శ్రీముఖి వీళ్ళతో కలసి వెళుతూ ,డబ్బు దొంగిలించాలని ప్లాన్ వేస్తూ వుంటుంది. ఇంకో పక్క ధనరాజ్ ఫ్రెండ్ మనోజ్ నందం బ్యాచ్ విలన్ రణధీర్ తో ట్రావెల్ చేస్తూ వుంటారు. ఈ రెండు బ్యాచ్ లు కోటి రూపాయల కోసం ఎంత అవస్థ పడ్డారు... ? ఎలా మళ్ళీ కలుసుకున్నారు అనేది మిగిలిన కధ....
స్క్రీన్ ప్లే :
సినిమా అంతా డైరెక్టర్ పాయింట్ అఫ్ వ్యూ లో సాగుతుంది. సినిమా ఓపెనింగ్ ప్రాబ్లం తో స్టార్ట్ అవుతుంది. మొదట విలన్ రణధీర్ ను , ఆతర్వాత శ్రీముఖి ని ఎస్టాబ్లిష్ చేసారు .ఆ తర్వాత ధనరాజ్ బ్యాచ్ ని ఇంట్రడ్యుస్ చేస్తారు. ఈ బ్యాచ్ కి వెంటనే కోటి రూపాయలు రావడం తో కధ పరుగు పెడుతుంది.
- ధనరాజ్ బ్యాచ్ రెండుగా విడిపోవడం తో కధ రెండు ట్రాక్ లు గా నరేట్ చేసారు. మధ్యలో ఎం. పి .సింధుతులాని తన బ్యాచ్ ని పంపించడం మూడవ ట్రాక్.
- ధనరాజ్ కోయ జాతి కి చిక్కి అక్కడ దేవర అవతారం ఎత్తడం ఇంటర్వెల్..
ధనరాజ్ ఎందుకు దేవర అయ్యాడు అనే దానికి చిన్న ఫ్లాష్ బ్యాక్ ...ఆ ఆతర్వాత అన్ని ట్రాక్ లు కలవడం మెల్లగా జరుగుతూ కధ ప్రీ క్లైమాక్ష్ కి చేరుతుంది . క్లైమాక్ష్ లో నుండి ధనరాజ్ బ్యాచ్ కి మళ్ళీ డబ్బు టెన్షన్ పెట్టించి , చివర్లో కోటి వచ్చేలా చేస్తారు.
సినిమా ఈక్వేషన్ : స్వామి రారా సినిమా అడవి లో జరిగితే ....క్షణక్షణం సినిమా లా కధ వెళితే ....పట్టుకోండి చూద్దాం లా కధ నడిస్తే = ధనలక్ష్మి తలుపు తడితే ....
సినిమా లో కలసి వచ్చే అంశాలు :
- జబర్ధస్ట్ టీం అంతా ఒక సినిమా లో వుండటం ...
- ఫ్రెండ్స్ డబ్బు దొరకగానే చేసే పనులు
- ధనరాజ్ పడే ఇబ్బందులు ద్వారా కామెడీ
- చివర్లో వచ్చే నాగేంద్ర బాబు ఎపిసోడ్
సినిమా ఎవరికీ నచ్చుతుంది :
- లైట్ కామెడీ చూసే వారికీ సినిమా నచ్చుతుంది .
ఫైనల్ టచ్ : టైం పాస్ గా చూసే సినిమా
రేటింగ్ : 2.5/5