Review : Kanche Movie
కంచె -ఎమోషనల్ డ్రామా
Review : Kanche Movie
Krish
Varun Tej , Prajya Jaiswal
స్టొరీ లైన్ (ప్లాట్ ) : 1936 – 1944 రెండో ప్రపంచ యుద్ధం లో ఒక సైనికుడి జీవితం లో జరిగిన మధుర స్ముతులే ఈ కంచె సినిమా మూల కథ
స్టొరీ : కంచె సినిమా ఒకే దిశగా వెళ్తూ రెండుగా విడిపోతూ మళ్ళి ఒకటిఅవుతుంది. ఒకటి 1944లో రెండో ప్రపంచ యుద్ధం లో ఇండియన్ ఆర్మీనుండి ఇటలి కి సపోర్ట్ చెయ్యటానికి కొంతసైన్యం ఇటలి కి వెళ్తుంది. అక్కడ జర్మన్ సైన్యం తో పోరాడి వాళ్ళ చేతిలో ఓడిపోయివాళ్ళకి లొంగిపోతారు. ఆ లొంగిపోయిన వారిలో ఈశ్వర్ప్రసాద్ (నికేతన్ ధర్ ) వుంటాడు. అతని కాపడటానికి చేసే ప్రయత్నం లో ధూపాటి హరిబాబు (వరుణ్ తేజ్ ), ఈశ్వర్ ప్రసాద్ (నికేతన్ధర్ ) ఒకే ఊరి కి చెందినవారు అని తెలుస్తుంది. కానీ వారి ఇద్దరు శత్రుశేషంతో రగిలిపోతుంటారు. దానికి కారణం అయిన కథ ని 1936 లో రాచకొండ గ్రామం లో జమిందార్ అయిన ఈశ్వర్ ప్రసాద్ చెల్లెలు సీతాదేవి ( ప్రాగ్యజైశ్వాల్ ) కి హరి బాబు కి మధ్య ప్రేమ ఏర్పాడి పెళ్లి వరుకు వస్తుంది. ఆ విషయం తెలిసిన ఈశ్వర్ ప్రసాద్ ఒక కులం తక్కువవాడితో తన చెల్లిని ఇచ్చి పెళ్లి చేసే ప్రసక్తి లేదని చెబుతాడు. ఆ కారణం వలన ఆఉరిలో కులం పేరుతో అందరిలోనూ గొడవలు పెడతాడు. ఒక గొప్పింటి కుర్రాడు తోపెళ్లి చెయ్యాలని అనుకుంటాడు. సీతాదేవి ని హరిబాబు పెళ్లి చేసుకున్నాడా...? జర్మన్సైన్యం లో బందీగా వున్నా ఈశ్వర్ ప్రసాద్ ని ఏలా కాపాడాడు ...? రాచకొండ లో కులం కోసంజరుగుతున్న ఘర్షణలకి చివరికి ముగింపుఏవిధంగా ఇచ్చారు...? అనేది తెర మీద చూడాల్సిందే.
స్క్రీన్ ప్లే : కంచె కథ 1944 లో రెండో ప్రపంచ యుద్ధం కాలం లో స్టార్ట్ అవుతూ వాయిస్ ఓవర్ లో 1936 లో జరిగిన సంఘటనలని గుర్తుచేస్తూ సాగుతుంది. ధూపాటి హరిబాబు (వరుణ్‌తేజ్ ) పాయింట్ ఆఫ్ వ్యూ లో కథ నడుస్తూ వుంటుంది. జర్మన్ సైన్యం మీద ఇటలి యుద్ధంచేసే భాగంగా ఇటలి కి సపోర్ట్ గా ఇండియా సైన్యం ఇటలి కి వెళ్తుంది. ఆ క్రమం లో హరిబాబు తన లైఫ్ లో జరిగిన మధురస్ముతులు గుర్తుకుచేసుకుంటాడు. 1936 లో హరిబాబు చదువుకునే రోజుల్లో సీతాదేవి ( ప్రాగ్య జైశ్వాల్ ) నిచూసి తొలిచూపులోనే ఇష్టపడతాడు. సీతాదేవి రాచకొండ సంస్థానం లో ఒక జమిందార్ వంశానికి చెందిన యువతీ. ఇద్దరి మధ్య ప్రేమపెళ్ళికి దారి తీస్తుంది. ప్రస్తుతం 1944 లో యుద్దంలో జర్మన్ సైన్యం చేతిలోఇటలి ఓడిపోతుంది. ఆ సమయం లో ఇటలిసైన్యాన్ని బందిస్తుంది. ఆ బంధించిన వారిలో ఈశ్వర్ ప్రసాద్ (నికేతన్ ధర్ ) కూడా వుంటాడు. హరి బాబు ఈశ్వర్ ప్రసాద్ ని కాపాడుకోవటానికి చేసే ప్రయత్నం లో జర్మన్ బోర్డర్ దాటి వెళ్తాడు. తన మధురస్ముతులు లోబాగంగా 1936 లో జరిగిన సంఘటనలు గుర్తుచేసుకుంటాడు. ఈశ్వర్ ప్రసాద్, హరి బాబుఒకే గ్రామనికి చెందినవారు. ఈశ్వర్ ప్రసాద్ చెల్లెలు సీతాదేవిదేవి అవ్వటం , తన చెల్లిని ప్రేమగా చూసుకుంటాడు.
ప్రాబ్లం ఎస్టాబ్లిష్ మెంట్ : . సీతాదేవి &హరి బాబు ప్రేమ లో వున్నారు అని ఈశ్వర్ ప్రసాద్ తెలుసుకుంటాడు. ఒక కులం తక్కువవాడిని తన చెల్లెలు ప్రేమిస్తుంది అని తనచెల్లికి నచ్చజెప్పాలని అనుకుంటాడు. కానీ ఎంత చెప్పిన వినదు. హరిబాబు ని ఏదో చెయ్యాలని చేసే క్రమంలో ఆ ఉరిలో కులం పేరుతోఅందరి మధ్య గొడవలు పెడతాడు. ఆ గొడవలో హరి బాబు ని చంపాలని ట్రై చేస్తాడు.
ప్లాట్ పాయింట్ 1 : ప్రస్తుతం 1944 లో ఈశ్వర్ ప్రసాద్ కోసం జర్మన్ లోకి ఎంటర్ అయిన హరిబాబు కి అక్కడ హిట్లర్ చేసే అరాచకాల నుండిజర్మన్ మనుషులని కొంత మందిని కాపాడుతాడు.
ఇంటర్వెల్
హరిబాబు తన మధురస్ముతులు లోబాగంగా 1936 లో భాగంగా ఈశ్వర్ ప్రసాద్మనషుల చేతిలో గాయాలు పాలైన హరి బాబు , సీతా దేవి తన ఇంట్లోనే ఎవరికీ తెలియకుండా వైద్యం చేస్తుంది. అదే సమయంలో సీతా దేవికి తన బావ తో పెళ్లి ఖాయం అవ్వటంతో పెళ్లి పనుల్లో వుంటాడు.
ప్రస్తుతం 1944 లో హిట్లర్ నుండి కాపాడిన వాళ్ళని ఇటలి బోర్డర్ దాటించాలని చేసే ప్రయత్నంలో ఈశ్వర్ ప్రసాద్ ని జర్మన్ లోకి తీసుకొచ్చే ప్రయత్నం లో హరిబాబు& అతని సైన్యం వాళ్ళ మీద దాడి చేస్తుంది. ఆ ప్రయత్నం లో గాయాలుపాలైన ఈశ్వర్ ప్రసాద్ కి హరి బాబు మీదవున్నా పగ తగ్గుతుంది.
హరిబాబు దైర్యం చేసి ఈశ్వర్ ప్రసాద్ లేని సమయం లో సీతా దేవి ని అందరి సమక్షం లో పెళ్ళిచేసుకునితన ఇంటికి తీసుకువెళ్తాడు. ఊరంతా హరిబాబు తప్పు చేసాడు అని నిలదిస్తుంది. దానికిహరిబాబు తనదైన స్టయిల్ లో వాళ్ళకి బుద్దిచేబుతాడు. తన చెల్లిని పెళ్ళిచేసుకున్న హరిబాబు మీద కోపంతో అతనితో గొడవ కి దిగుతాడు. ఆప్రయత్నం లో వాళ్ళని ఆపటానికి ప్రయత్నంచేసిన సీతాదేవి అనుకోకుండా చనిపోతుంది.
ప్రి –క్లైమాక్స్ : ప్రస్తుతం1944 లో జర్మన్ బోర్డర్ నుండి ఇటలి కి వెళ్ళే మార్గం కోసం వెతుకుతూ వుంటారు. ఆసమయం లో జర్మన్ బోర్డర్ దగ్గర వున్నా సైన్యాన్ని ఎలాగైనా దారి మళ్ళించి హరిబాబు తన సైన్యాన్ని , హిట్లర్ బారినుండికాపాడిన వాళ్ళని బోర్డర్ దాటించాలని ప్రయత్నంలో వాళ్ళ మీద దాడి చేసి అందరిని బోర్డర్దాటిస్తాడు. ఆ క్రమంలో హరిబాబు జర్మన్సైన్యం చేతిలో మరణిస్తాడు.
క్లైమాక్స్ :ఈశ్వర్ప్రసాద్ హరిబాబు జ్ఞాపకాలు తీసుకునిరాచకొండ వెళ్తాడు. తన చెల్లెలు సమాధి పక్కనే అతని జ్ఞాపకాలు వుంచుతాడు. ఈశ్వర్ప్రసాద్ తన తప్పు తెలుసుకుని ఆ ఉరిలో వున్నా కుల-మత గొడవలకి నాంది పలకటంతో కథ ముగుస్తుంది.
సినిమా కి కలిసొచ్చే అంశాలు:
- ప్రాగ్య జైశ్వాల్ పెర్ఫార్మన్స్
- అద్బుతం గా వున్నా సినిమాటోగ్రఫి
- 1936 బ్యాక్ డ్రాప్సెట్స్ & విజువల్స్
- అవసరాల శ్రీను కామెడి
- వరుణ్ తేజ్ డైలాగ్ డెలివరి
సినిమా ఫార్ములా :
- పెరల్ హార్బర్ (2001) హాలివుడ్సినిమా లో ఫ్రెండ్స్ క్యారెక్టర్స్ లో కంచె హీరో–విలన్ క్యారెక్టర్స్ ని పెడితే = కంచె
సినిమా ఎవరికీ నచ్చుతుంది :
- గమ్యం , వేదం లాంటి సోషల్‌మెసేజ్ సినిమాలను ఇష్టపడే వారికీ ఈ సినిమా నచ్చుతుంది.
- హాలివుడ్ సినిమాలు ఇష్టపడేవారికీ ఈ సినిమా నచ్చుతుంది
- మెగా ఫాన్స్ అభిమానులకి ఈసినిమా నచ్చుతుంది
ఫినిషింగ్ టచ్ : కంచె -ఎమోషనల్ డ్రామా
రేటింగ్ : 3.5 /5