Review : Kerintha - Youth Film
కేరింత యూత్ ఫిల్మ్
Review : Kerintha - Youth Film
Sai Kiran Adivi
Sumanth ashwin , Sri Divya
స్టోరీ ప్రిమైస్ : లిమిట్స్ లేని ఫ్రెండ్షిప్, ఫ్రెండ్షిప్ నుండి ప్రేమ గా మారే సంధిగ్ధంలో ఉన్న కాలేజీ యువత కధే ఈ సినిమా మెయిన్ ఐడియా.
స్టోరీ : హైదరాబాద్ కాలేజీ లో జై ( సుమంత్ అశ్విన్ ), మనస్విని ( శ్రీ దివ్య ) , భావన ( సుకృతి), నూకరాజు (పార్వతీశం) , సిద్ధూ (విశ్వనాథ్), ప్రియ ( తేజస్విని ) ఐదుగురు ఫ్రెండ్స్.
మెయిన్ క్యారెక్టర్ : జై (సుమంత్ అశ్విని) అందరినీ హ్యాపీ నెస్ లో ఉంచే క్యారెక్టర్. ఈ జై ఒక జర్నీ లో బస్ లో హీరోయిన్ మనస్విని ( శ్రీ దివ్య ) ను ప్రేమిస్తాడు. ఆమె కోసం వెతుకుతూ ఉంటాడు. ఆమె ను పాట ద్వారా కలుస్తాడు, చూస్తాడు.
నెక్స్ట్ క్యారెక్టర్ : సిద్ధూ, ప్రియ తో పరిచయం పెంచుకుని, ప్రేమ లో పడతాడు. అయితే సిద్ధూ కుటుంబం అంతా తల్లికి భయపడుతూ అసలు విషయాలు దాచేస్తూ ఉంటారు. మ్యూజిక్ ప్రిన్సిపాల్ ఇష్టముండి, కోర్స్ చేసే విషయం తల్లి దగ్గర సిద్ధూ దాస్తాడు. అలాగే సిద్ధూ తన ప్రేమ ను తల్లి దగ్గర దాచి, ప్రియ తో ప్రేమ ను కంటిన్యూ చేస్తుంటాడు.
ధర్డ్ క్యారెక్టర్ : నూకరాజు ఊరి నుండి వచ్చిన అమాయకపు క్యారెక్టర్. తండ్రి పంపిన డబ్బు ను ఫేస్ బుక్ లో అమ్మాయి కి పంపుతూ, చాటింగ్ చేస్తూ ఆనందంగా గడుపుతూ ఉంటాడు.
ఫోర్త్ క్యారెక్టర్ : భావన ఈ గ్యాంగ్ లో స్ట్రాంగ్ లేడి. ఏమి చెయ్యాలో… ? ఎలా ఉండాలో ….? మగవాళ్ళ కి ఏలా సమాధానాలు చెప్పాలో తెలిసిన అమ్మాయి. ఈ బ్యాచ్ లో ఫైర్ బ్రాండ్. నూకరాజు – భావనల మధ్య ఒక బంధం తో కొనసాగుతూ వెళ్తుంది.
ప్రతీ క్యారెక్టర్ కీ ఉన్న ప్రేమ కధలన్నీ ముందుకి వెళ్ళుతూ హాయిగా కేరింత గా సాగిన వీళ్ళ జీవితాలు సడన్ గా డిస్ట్ర బెన్స్ అవుతాయి. ఆ డిస్ట్ర బెన్స్ నుండి వీళ్ళందరూ వారి ప్రేమల్ని నిలబెట్టుకోవడమే మిగిలిన కధ.
స్క్రీన్ ప్లే : నూకరాజు క్యారెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ తో సినిమా స్టార్ట్ అవుతుంది. నూకరాజు కాలేజీకి కార్లో బయలు దేరడం. కాలేజీ కి వెళ్ళడం, వాళ్ళ బ్యాచ్ ని పరిచయం చేస్తూ కధ మొదలు పెడ్తాడు. బ్యాచ్ ని వాళ్ళ క్యారెక్టరైజేషన్ పరిచయం అయ్యాక ఒకొక్కరి ప్రేమ కధలు స్టార్ట్ అవుతాయి. అందులో ఇబ్బందులు వచ్చినప్పుడు కూడా నూకరాజు క్యారెక్టర్ వివరిస్తూ వెళ్తుంది.
కధ ప్రీ క్లైమాక్స్ వరకూ నూకరాజు ద్వారా నడిచి, ఆ తర్వాత నూకరాజు ఫ్రెండ్స్ ద్వారా జై ను, మనస్విని ల ఇద్దరినీ కలుపుతాయి. సినిమా అంతా ఫ్లాష్ బ్యాక్ న్యారేషన్ – ప్రీ క్లైమాక్స్ వరకూ సాగుతుంది.
కలిసోచ్చే అంశాలు :
- కాలేజీ వాతావరణం కనెక్ట్ అయ్యే క్యారెక్టర్స్.
- నూకరాజు క్యారెక్టర్ కామెడీ.
- ఫీల్ గుడ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్.
- కెమెరా ప్రొడక్షన్ వాల్యూస్.
ఫిల్మ్ ఈక్వేషన్ :
- హ్యాపీ డేస్ 50% + బొమ్మరిల్లు 10% + ఓయ్ 30% + కాలేజ్ కామెడీ = కేరింత
ఈ సినిమా ఎవరికి నచ్చుతుంది ?
- 10th- Inter వారికి, B.Tech - డిగ్రీ వారికి విపరీతంగా నచ్చుతుంది ( 17- 25 Age)
- కాలేజీ ప్రేమలు,కామెడీ నచ్చివారికి ఈ సినిమా నచ్చుతుంది.
- హ్యాపీడేస్, కొత్తబంగారులోకం నచ్చిన వారికి ఈ సినిమా నచ్చుతుంది.
ఫినిషింగ్ టచ్ : కాలేజీ బ్యాచ్ లో స్నేహాలు, ఆనందాలు, ప్రేమలు ఫీలవుతూ సినిమా చూడొచ్చు.
రేటింగ్ : 3.25/5