Review : KICK 2 Movie
మాంచి కిక్ ఇచ్చే సీక్వెల్ కిక్ -2
Review : KICK 2 Movie
Surender Reddy
Ravi Teja, Rakul Preet Singh, Ravi Kishan
స్టోరీ మెయిన్ ఐడియా : ఒక సమస్య ఉన్న ఏరియాలోకి “ కంఫర్ట్” లేకుండా ఉండలేని హీరో ని రప్పించడం , అతన్ని “కంఫర్ట్” గా చూసుకుంటూ తద్వారా సమస్య ను సాల్వ్ చేసుకోవడం సినిమా మెయిన్ ఐడియా ...
స్టోరీ: “కిక్ కళ్యాణ్(పెద్ద రవితేజ) కి పుట్టిన బిడ్డే ఈ “కంఫర్ట్” రాబిన్ హుడ్( యంగ్ రవితేజ ) . తనకు కంఫర్ట్ ఉండాలనుకునే తత్వం గలవాడు .అమెరికా లో పుట్టి పెరగడం వలన తనకు ప్రతీ విషయం లో కంఫర్ట్ ఫీల్ అయ్యే రాబిన్ హుడ్ , తన కంఫర్ట్ కోసం డాక్టర్ చదువుతాడు. తర్వాత హాస్పిటల్ కట్టాలనుకుంటాడు. హాస్పిటల్ కి డబ్బు కోసం ఇండియా లో వున్న లాండ్ అమ్మాలనుకుంటే ,అది కబ్జా చేస్తాడు ఆశిష్ విద్యార్ధి.ఈ లాండ్ కోసం రాబిన్ హుడ్ ఇండియా వస్తాడు.
తనను యాక్సిడెంట్ చేసిన జడ్చెర్ల ఎం.ఎల్.ఏ ని రాబిన్ హుడ్ ప్రజలందరి ముందు పట్టుకుని కొడతాడు. ఈ విషయం కళ్ళారా చూసిన బిలాస్ పూర్ గ్రామస్థుడు ,ఈ విషయాన్ని బిలాస్పూర్ వచ్చి తెలియ చేస్తాడు. దానితో గ్రామస్తులు అందరూ రాబిన్ హుడ్ ని తమ ఊరు రప్పించే పనిలో పడతారు . ఎందుకంటే బిలాస్ పూర్ గ్రామాన్ని సల్మాన్ సింగ్ టాకూర్(రవి కిషన్) అనే రాక్షసుడు ఇబ్బంది పెడుతూ ఉంటాడు. వాడ్ని చంపాలంటే రాబిన్ హుడ్ కరెక్ట్ అనుకుంటారు ఆ గ్రామప్రజలు.
రాబిన్ హుడ్ కి చైత్ర (రకుల్ ప్రీతీ సింగ్) ఒక కధ డిస్కస్ చేస్తూ కలుస్తుంది. వీళ్ళిద్దరూ బాగా దగ్గర అవుతారు. తన లాండ్ ని కబ్జా చేసిన వాడి దగ్గర నుంచి లాండ్ ని తెలివిగా లాక్కొంటాడు రాబిన్ హుడ్ . ఆ తర్వాత అమెరికా వెళ్ళిపోవడానికి రాబిన్ హుడ్ రెడీ అవుతాడు. ఇంతకీ గ్రామప్రజలు ఆ టాకూర్ భారి నుండి తప్పించుకున్నారా ...?లేదా ...?
రాబిన్ హుడ్ బిలాస్పూర్ వచ్చాడా ...? చైత్ర – రాబిన్ హుడ్ తో ప్రేమ కధ ఎక్కడకు చేరింది ...? అన్నదే మిగిలిన కధ ....
స్క్రీన్ ప్లే :
సినిమా ఓపెన్ అవ్వడమే సునీల్ వాయిస్ ఓవర్ తో ,కిక్ సినిమా విజువల్స్ తో ఓపెన్ అవుతుంది . అమెరికా లో కిక్ రవితేజ (తండ్రి రవితేజ ), తన కిక్ ని ఎంజాయ్ చేసే పనిలో ఉంటాడు . అతన్ని కలవడానికి “కిక్” పోలీస్ ఆఫీసర్ శ్యాం వస్తాడు. వీళ్ళిద్దరి మాటల్లోంచి “కిక్ -2” హీరో క్యారక్టర్ రాబిన్ హుడ్ (రవితేజ యంగ్ ) ఓపెన్ అవుతుంది . ఈ క్యారక్టర్ ని ఎస్టాబ్లిష్ చేస్తూ సీన్ లు వేస్తూ వెళ్లారు. “కంఫర్ట్” ముఖ్యమైన రాబిన్ హుడ్ రవితేజ డాక్టర్ చదువుతాడు . హాస్పిటల్ కట్టాలని , తండ్రి ని డబ్బు అడుగుతాడు . లేదంటాడు తండ్రి రవితేజ ..హైదరాబాద్ లో ప్లేస్ వుంది దాన్ని అమ్మేసి ,హాస్పిటల్ కడతాను అని అంటాడు రాబిన్ హుడ్ రవితేజ . అందుకోసం హైదరాబాద్ వస్తుంటాడు రాబిన్హుడ్ రవితేజ.
మెయిన్ ప్రాబ్లం ఎస్టాబ్లిష్మెంట్ :
ఇండియా లో “బిలాస్ పూర్” అనే ఒక ప్రాంతం...అక్కడ ఒక విలన్.అతను చేసే కధ ను ఎస్టాబ్లిష్ చేస్తూ ,అతను ఎంత క్రూరుడో చూపే ఒక ఇన్సిడెంట్ చూపుతారు . ఆగ్రామస్తుల క్రైసిస్ ను ఎస్టాబ్లిష్ చేస్తారు .
హీరో రాబిన్ హుడ్ వచ్చి తనకు “కంఫర్ట్” గా వున్న పండిట్ రవితేజా (బ్రహ్మానందం ) ఇంట్లో దిగుతాడు . వీల్లిద్దరి మధ్య కామెడీ సీన్ లు వస్తుంటాయి . ఇంకో పక్క రాబిన్ హుడ్ కి రకుల్ ప్రీతీ సింగ్ ఒక రైటర్ గా పరిచయం అవుతుంది . తనకు రవితేజ క్యారక్టర్ ఇంటరెస్ట్ గా వుండటం తో , అతని కధ తో స్టొరీ రాయాలని అనుకుంటూ వుంటుంది . రవితేజా తన కధ చెబుతూ వుండటం తో, రవితేజా తో తిరగడం మొదలు పెడుతుంది . వీళ్ళిద్దరి మధ్య ప్రేమ మొదలవుతుంది. రవితేజా కి వున్న అలవాట్లు ,ఇష్టాలు తెలుసుకునే బిలాస్ పూర్ ముగ్గురు గ్రామస్తులు ఎప్పుడూ రవితేజా వెనకే ఉంటూ వుంటారు .
తన భూమి ని కబ్జా చేసిన ఆశిష్ విద్యార్ధి ని తెలివిగా ఇరికించి ,తననుండి తన కబ్జా భూమి సంపాదిస్తాడు రవితేజా. వచ్చిన పని అయిపొయింది కాబట్టి అమెరికా వెల్లిపోవాలనుకుంటాడు.
ట్విస్ట్ 1 : బిలాస్ పూర్ గ్రామస్తురాలు హీరోయిన్ అని ఇక్కడ ఓపెన్ చేస్తారు. తన ప్రేమ తో రవితేజా ని రాప్పిస్తానని గ్రామస్తుల ముందు మాట ఇచ్చిన హీరోయిన్ రకుల్ ప్రీతీ సింగ్ “నేను ఫెయిల్ అయ్యాను” అని బాధ పడుతూ వుంటుంది.
అమెరికా వెళ్ళే రవితేజా కి హీరోయిన్ ప్రేమ గుర్తుకు వచ్చి ,వెనక్కి వచ్చేస్తాడు. అప్పుడు తన ప్రేమ ను చెబుతాడు. అయితే అప్పుడే హీరోయిన్ కిడ్నాప్ అవుతుంది . దానితో రవితేజా “బిలాస్ పూర్ కి ప్రయాణం అవుతాడు ....
---ఇంటర్వెల్ ---
రవితేజా ని గ్రామం లోకి రాగానే బిలాస్ పూర్ గ్రామస్తులు అంతా నాటకం మొదలు పెడతారు. పది రోజులు వుండాలని కండీషన్ పెడతారు. హీరోయిన్ మాట విని రవితేజ , వాళ్ళ గ్రామం లో ఉంటాడు. రవితేజా కి నచ్చిన ఫుడ్ పెడుతూ గ్రామస్తులు అంతా “కంఫర్ట్” గా చూసుకుంటూ , వాళ్ళందరూ ఒక పూట పస్తులు వుంటారు.
ప్లే -1 : గ్రామస్తులు లో ఒకరు పనిలోకి వెళ్ళాను అని ప్లాన్ వేసి ,రవితేజ ని టాకూర్ మనుషులతో ఫైట్ క్రియేట్ చేద్దాం అని చేస్తాడు..కానీ అది రివర్స్ అవుతుంది ...ఇక్కడ రవితేజా రివర్స్ అవుతాడు ...
ప్లే -2 : మళ్ళీ గ్రామస్తులు టాకూర్ మనుషుల్లా గుర్రాల మీద వచ్చి , రవితేజ ఇంట్లో సామాన్లు నాశనం చేస్తారు. ఇలా అయినా టాకూర్ కి రవితేజ కి మధ్య గొడవ వస్తుంది అని అనుకుంటారు . అప్పుడు టాకూర్ మనుషులు రావడం తో ఈ ప్లాన్ కుడా వర్క్ అవుట్ అవ్వదు .
ప్లే -3 :టాకూర్ బావమరిది ని బ్రహ్మానందం ద్వారా రెచ్చగొట్టి , రవితేజ తో గొడవ వచ్చేలా చేద్దామనుకుంటారు. అదీ వర్క్ అవుట్ అవ్వదు..
న్యూ ఇన్సిడెంట్ : టాకూర్ కొడుకు ,బిలాస్ పూర్ గ్రామం లో వుండే ఒక అమ్మాయిని రేప్ చేసి , చంపేస్తాడు. ఇక్కడ గ్రామస్తుల బాధ తీవ్రం అవుతుంది. ఆ అమ్మాయి తల్లి శోకం తో బాధ పడి అన్న మాటలు అందరినీ ఆలోచింపచేస్తాయి.
ప్లాట్ ఇన్సిడెంట్ – టర్నింగ్ పాయింట్ : అమ్మ వారి జాతరలో హీరోయిన్ రకుల్ ప్రీతీ సింగ్ ని పట్టుకుందామని అనుకోకుండా , టాకూర్ కూతురి ని కౌగిలించుకుంటాడు రవితేజ. దానితో అక్కడ టాకూర్ కొడుకు కి రవితేజ కి ఫైట్. టాకూర్ కొడుకు హాస్పిటల్ లో పడి ఉంటాడు. ఇక్కడ టాకూర్ కొడుకు ని రవితేజ ట్రీట్మెంట్ ఇచ్చి ,మళ్ళీ ఫైట్ చేస్తాడు. కానీ టాకూర్ కొడుకు మళ్ళీ హాస్పిటల్ బెడ్ ఎక్కుతాడు. దానితో టాకూర్ కొడుకు రవితేజ కి బయపడ తాడు. అప్పుడే విలన్ టాకూర్ కొడుకు ని చంపేస్తాడు.
ప్రీ –క్లైమాక్ష్ : రవితేజ కి “గ్రామస్తులు , హీరోయిన్ ఆడింది అంతా నాటకం” అని బయటపడుతుంది . దానితో రవితేజా వాళ్ళను తిట్టి , ఊరు వదిలి వేల్లిపోతుంటాడు . గ్రామస్తులను టాకూర్ చంపాలని చూస్తారు ..
క్లైమాక్ష్ : గ్రామస్తుల బాధలు అన్నీ తనికెళ్ళ భరణి ద్వారా అన్నీ రవితేజ తెలుసుకుంటాడు. దానితో కోపం వచ్చి టాకూర్ మీద కు వెళ్తాడు . టాకూర్ మనుషులను చంపి ,గ్రామస్తులను రక్షిస్తాడు . టాకూర్ చనిపోవడం తో సినిమా అయిపోతుంది .
సినిమా కి కలసి వచ్చే అంశాలు :
- రవితేజ క్యారక్టర్ , అతని ఎనర్జీ నటన
- రవితేజ –బ్రహ్మానందం మధ్య వచ్చే సీన్ లు
- రవితేజ – రకుల్ ప్రీతీ సింగ్ మధ్య లవ్ సీన్ లు
- గ్రామస్తుల కామెడీ కష్టాలు , బాధలు
సినిమా ఈక్వేషన్ :
“విక్రమార్కుడు” సినిమా లో ఫస్ట్ హాఫ్ లో దొంగ రవితేజ మీద చేసే ప్లే + “ గ్యాంగ్స్ ఆఫ్ వసేపూర్” సినిమా లో గనుల బ్యాక్ డ్రాప్ , విలన్ = కిక్ 2
సినిమా ఎవరికీ నచ్చుతుంది :
- “కిక్” నచ్చిన అందరికీ ఈ సినిమా నచ్చుతుంది.
- అన్ని రకాల యూత్ కి ఈ సినిమా నచ్చుతుంది.
- కామెడీ ఎక్కువగా వుండటం వలన ఈ సినిమా ఫ్యామిలీ కి నచ్చుతుంది.
ఫైనల్ టచ్ : రవితేజ సినిమా ని ఎంజాయ్ చేయాలనుకునుకుంటే “ కిక్ 2” చూడొచ్చు.
రేటింగ్ : 3.5 /5