Top

Review : Killing Veerappan

కిల్లింగ్ వీరప్పన్ : రామ్ గోపాల్ వర్మ బ్రాండ్ మార్క్

Source: General

By: IFY LLC

Critic's Rating: 3/5

Thursday 07 January 2016

Movie Title

Review : Killing Veerappan

Director

Ram gopal varma

Star Cast

Shiva Rajkumar, Sandeep Bharadwaj

స్టొరీ  లైన్ : మోస్ట్ వాంటెడ్ స్మగ్లర్ వీరప్పన్ నిపట్టుకోవాలని ప్రయత్నించే నిజాయితి పోలీసాఫీసర్, అతని పట్టుకోవటం కోసం చేసిన జర్నీలో వీరప్పన్ ని  ఏలా అంతమొందిచాడు అనేదే ఈకిల్లింగ్ వీరప్పన్ మూల కథ.

స్టొరీ : వీరప్పన్  (సందీప్ భారద్వాజ్) ఇండియా లో మోస్ట్ వాంటెడ్  స్మగ్లర్ గా చలామణి అవుతుంటాడు. అతను చేసేప్రతి పనిలో కూరత్వం కనిపిస్తుంది. వీరప్పన్ ని పట్టుకోవాలని పోలిస్డిపార్ట్మెంట్స్ ఎంత ప్లాన్ చేసిన వీరప్పన్ కి వున్నా బలమైన సపోర్ట్ తో అతనిచంపటానికి వచ్చిన అందర్నీ చంపుకుంటూ వస్తాడు.వీరప్పన్ కి అడ్డుకట్టా వెయ్యాలని స్పెషల్పోలీసాఫీసర్  (శివాజీ రాజ్ కుమార్ ) తన టీంతో  కలసి వీరప్పన్ ని ఫారెస్ట్ లో నుండిబయటకి రప్పించి పట్టుకోవాలని ఒక పధకం వేస్తాడు. దానిలో బాగంగా శివాజీ రాజ్కుమార్  శ్రేయా (పరుల్ యాదవ్ ) సహయంతీసుకుంటాడు. వీరప్పన్ భార్య (ముత్తు లక్ష్మి) తన భర్త కి దూరంగా వుంటూ జీవనం  సాగించటానికి తనకి అవసరమైన ఇల్లు కోసం వెతికేక్రమంలో శ్రేయా ఇంటి లో అద్దె ఇంట్లో వుంటుంది. శ్రేయా కి ముత్తు లక్ష్మి మధ్యస్నేహం బందం బలపడుతుంది.  ముత్తు లక్ష్మితన భర్త వీరప్పన్ గురించి శ్రేయా కి చెబుతుంది.వీరప్పన్ తన భార్య ని కలవాలని చేసేప్రయత్నం పోలీసాఫీసర్ అయ్యిన శివాజీ రాజ్ కుమార్ కి తెలుస్తుంది. శివాజీ రాజ్కుమార్  వీరప్పన్ కోసం ఎలాంటి ప్లాన్ వేసాడు...?ముత్తులక్ష్మి ని అడ్డం పెట్టుకుని వీరప్పన్ ని పట్టుకోవటానికి చేసిన ప్రయత్నం ఎంతవరుకు పలిచింది...? వీరప్పన్ కి వున్నా అసలు లక్ష్యం ఏంటి...? శివాజీ రాజ్ కుమార్చివరికి వీరప్పన్ ని ఏలా అంతం చేసాడు ..? అనేది తెలియాలంటే తెర మీద చూడాల్సిందే.

స్క్రీన్ ప్లే :

కిల్లింగ్ వీరప్పన్సినిమా  ఓపెనింగ్ పోలీసాఫీసర్  (రాక్ లైన్ వెంకటేష్) మీద ఓపెన్ చేస్తూ  వీరప్పన్ ని పట్టుకోవటానికి దొరికిన ఒక క్లూద్వారా అతని టీం తో ఫారెస్ట్ లోకి వెళ్తుంటారు. అలాంటి సమయం లో ఆ విషయం తెలుసుకున్నవీరప్పన్ (సందీప్ భారద్వాజ్) తన గ్యాంగ్ తో వాళ్ళ మీద ఎటాక్ చేస్తాడు.

కిల్లింగ్ వీరప్పన్ని పట్టుకోవటం ఇక సాధ్యం కాదు అని  పొలిసుడిపార్ట్మెంట్ అందరు అనుకుంటున్నా సమయం లో ఆ ప్రాజెక్ట్ ని పోలీసాఫీసర్ శివాజీ రాజ్ కుమార్ బాధ్యతలు తీసుకుంటాడు.

ఇంటరెస్టింగ్పాయింట్ : ఒక రాజకీయ నాయకుడుఏమన్నాడు అంటే వీరప్పన్ ని పట్టుకోవటం అసాధ్యం...అతనికి వయస్సు అయ్యిపోయి అతనేఅంతటా అతనే చనిపోవాలి అని ఒక పోలీసాఫీసర్ తన టీం కి చెప్పే సన్నివేశాలు.

ప్లే 1 :

  • శివాజీ రాజ్ కుమార్  శ్రేయా (పరుల్ యాదవ్ ) ని తన టీం లో ఒకఇన్ఫార్మర్ గా చేర్చుకుని వీరప్పన్ భార్య ముత్తులక్ష్మి ని శ్రేయా ఇంట్లో అద్దె కివుండేటట్టు చెయ్యటం
  • ముత్తు లక్ష్మి కిశ్రేయా కి మధ్య స్నేహ బంధం చాలా బలపడటం

ప్లాట్ పాయింట్ 1 : ముత్తు లక్ష్మి తన భర్త వీరప్పన్ నికలవటం కోసం ఏర్పాట్లు చెయ్యటం. ఆ విషయం లో శ్రేయా హెల్ప్ తీసుకోవటం. ఆ విషయంశ్రేయా శివాజీ రాజ్ కుమార్ కి చెప్పటం.

వీరప్పన్ శ్రేయా ఒకఇన్ఫార్మర్ అని తెలియటం. ఆ విషయాన్ని తన భార్య కి తెలియజేయ్యటం. ముత్తు లక్ష్మిశ్రేయా మీద అనుమానం రావటం.

వీరప్పన్ తన  గ్యాంగ్ తో కలసి  శివాజీ రాజ్ కుమార్ గ్యాంగ్ మీద ఎటాక్ చెయ్యటం..ఆ ఎటాక్ లో చాలా మంది   శివాజీ రాజ్ కుమార్టీం చనిపోవటం.

ఇంటర్వెల్ 

శివాజీ రాజ్ కుమార్కి తన టీం లోనే  ఎవరో వీరప్పన్ కి సాయంచేస్తున్నారని  అతని  గుర్తించటం. అతని నుండి సమాధనం రాబట్టుకునేప్రయత్నం లో గాంధీ అనే వ్యక్తీ గురించి చెప్పటం.

ప్లే 2:

  • శ్రేయా  ని ముత్తు లక్ష్మి నుండి దూరంగా  ఉండమని శివాజీ రాజ్ కుమార్  చెప్పటం.
  • గాంధీ అనే వ్యక్తీకోసం వేసిన  ప్లాన్ లో గాంధీ ని పట్టుకోవటం
  • గాంధీ నుండి వీరప్పన్కి సంబందించిన ఇన్ఫర్మేషన్ ని శివాజీ రాజ్ కుమార్ రాబట్టం.

ప్లాట్ పాయింట్ 2 :

గాంధీ చెప్పిన  ఇన్ఫర్మేషన్ ప్రకారం శివాజీ రాజ్ కుమార్ తన టీంలో  కొంతమంది ని వీరప్పన్ గ్యాంగ్ లోకిపంపించటం

వీరప్పన్  తనకి కావాల్సిన  టీం ని తయారు చేసే క్రమంలో అందర్నీ  ఇన్విట్  చేసే క్రమంలో అసలు విషయం తెలిసి  వీరప్పన్ గ్యాంగ్ కి శివాజీ రాజ్ కుమార్ టీం కిమధ్య ఎటాక్ జరగటం. వీరప్పన్ అక్కడి నుండి తెలివిగా తప్పించుకోవటం.

ప్లే 3 :

  • వీరప్పన్ ఎవర్నినమ్మాలో అర్థం కాక  ఇబ్బంది పడటం.
  • ఇన్ని రోజులువీరప్పన్ ని ప్రాణాలతో పట్టుకోవాలని అనుకున్న శివాజీ రాజ్ కుమార్ ఇక లాభం లేదుఅనుకుని అతని ఎన్కౌంటర్ చెయ్యాలని డిసైడ్ అవ్వటం.
  • వీరప్పన్ కిఆయుధాలు సప్లయ్ చేసే వాడిని తెలివిగా పట్టుకోవటం. ఆయుధాలు సప్లయ్ చేసేవాడి నుండిఇన్ఫర్మేషన్ తీసుకోవటం.

ప్రి-క్లైమాక్స్ :

  • కుమార్  (ఎక్స్.పోలీసాఫీసర్ ) నుండి శివాజీ రాజ్ కుమార్ సహయం తీసుకోవటం  
  • కుమార్ వీరప్పన్ కికావాల్సిన ఆయుధాలని వీరప్పన్ వుండే ప్రదేశానికి తీసుకువెళ్లటం
  • కుమార్ మాట్లాడేమాటలకి  వీరప్పన్ కి నచ్చటం తో అతన్నినమ్మటం.
  • వీరప్పన్  ప్రభాకర్న్ ని కలవాలి అని కుమార్ నిఅడగటం.దానికి కుమార్ మీటింగ్ ఏర్పాటు చేస్తాను అని అనటం

 క్లైమాక్స్ : వీరప్పన్  ప్రభాకర్న్ ని కలవటానికి సిద్దం అయ్యి అతనికలవటానికి వెళ్ళే ప్రయత్నం లో శివాజీ రాజ్ కుమార్ ప్లాన్ ప్రకారం అతని మీద ఎటాక్చెయ్యటం. ఆ ఎటాక్ లో వీరప్పన్ చనిపోవటం తో సినిమా ముగుస్తుంది.

కలిసొచ్చే అంశాలు :

  • శివాజీ రాజ్ కుమార్  అవుట్ స్టాండింగ్ పెర్ఫార్మన్స్
  • వీరప్పన్ క్యారెక్టర్ లో ఒదిగిపోయినసందీప్ భారద్వాజ్
  • రామ్ గోపాల్ వర్మ మేకింగ్ బ్రాండ్
  • బ్యాక్ గ్రౌండ్ స్కోర్
  • ఫారెస్ట్ లోకేషన్స్ లో  సినిమాటోగ్రఫీ విజువల్స్
  • సెకండ్ ఆఫ్ లో కీలకమైన సన్నివేశాలు
  • ప్రీ-క్లైమాక్స్ & క్లైమాక్స్

సినిమా ఫార్ములా :  ఇండియా లో మోస్ట్ వాంటెడ్ స్మగ్లర్ అయ్యిన కూస్ముని స్వామి వీరప్పన్ నిజజీవిత చరిత్ర  ఆధారంగా ఈ సినిమా ని తెరక్కించారు.

సినిమా  ఎవరికీ నచ్చుతుంది :

  • వర్మ  రక్త చరిత్ర , రౌడీ సినిమాల్ని ఇష్టపడే వారికీఈ సినిమా నచ్చుతుంది
  • కిల్లింగ్ వీరప్పన్ని ఎలాంటి వ్యక్తీవో తెలుసుకోవాలని  ఆసక్తిచూపే వారికీ ఈ సినిమా నచ్చుతుంది.
  • వర్మ మేకింగ్ నిఇష్టపడే వారికీ ఈ సినిమా నచ్చుతుంది.
  • బయోగ్రఫీకల్సినిమాలని ఇష్టపడే వారికీ  ఈ సినిమానచ్చుతుంది.

ఆడియన్స్రెస్పాన్స్  :

  • వర్మ మేకింగ్ చాలాబాగుంది
  • స్క్రీన్ మీదచూస్తుంటే నిజంగా వీరప్పన్  ని చూస్తునట్టువుంది.
  • ఇలాంటిసినిమాలు  తియ్యాలంటే ఫిల్మ్ ఇండస్ట్రి లోకేవలం వర్మ గారికి మాత్రమే సాధ్యం.
  • థియేటర్ లో సినిమాచూస్తునప్పుడు మన కళ్ళముందు జరుగుతుంది అనే ఫీలింగ్ ని వర్మ కలిగించారు.
  • బ్యాక్ గ్రౌండ్స్కోర్ , సినిమాటోగ్రఫీ , వర్మ మేకింగ్ చాలా బాగున్నాయి.

తీర్పు : వాస్తవ సంఘటనల ఆధారం చేసుకుని  సినిమా  తియ్యటం రామ్ గోపాల్ వర్మ కి రక్త చరిత్రసినిమా తీసిన తర్వాత అందరు వర్మ ని  అలాంటిసినిమాలు వర్మ తప్ప ఎవరు తియ్యలేరు అని ఒక్క వర్మ కి మాత్రమే సాధ్యం అని అన్నమాటలని నిజం చేస్తూ వర్మ తనకి వున్నా మేకింగ్ మీద అనుభవం అంత ఈ కిల్లింగ్వీరప్పన్  మీద పెట్టారు. కేవలం  ఈ సినిమా లో పాత్రలు ఎంచుకోవటం లోనే సగం విజయంసాధించిన వర్మ తనదైన స్టైల్ లో ఈ సినిమా ని వెండితెర మీద ఆడియన్స్ కి కనెక్ట్అయ్యేలా చిత్రీకరించాడు. సినిమా చూస్తున్నంత సేపు ప్రతి ఆడియన్ కి థియేటర్ లో   అందరు సైలెంట్ గా తల తిప్పనివ్వకుండా వర్మచేసిన మేకింగ్ మ్యాజిక్ ఫలించింది.  

ఫినిషింగ్ టచ్ : కిల్లింగ్ వీరప్పన్ :  రామ్ గోపాల్ వర్మ బ్రాండ్ మార్క్  

కిల్లింగ్వీరప్పన్  సినిమా రేటింగ్ : 3.5/5.0 

recent reviews

Keshu Ee Veedinte Naadhan

Time pass comedy entertainer

Plan Panni Pannanum

Average comedy entertainer

Velan

Decent rural family entertainer

Meow

Soubin Shahir and Mamta Mohandas shine in this conventional film

Read more

galleries