Review : krishna gadi veera prema gadha
ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యిన కృష్ణగాడి విజయగాధ
Review : krishna gadi veera prema gadha
Hanu Raghavapudi
Nani , Mehrene
స్టొరీ మెయిన్ లైన్ : చిన్నతనం నుండి ప్రేమించిన అమ్మాయి కోసం కృష్ణగాడి చేసిన సాహసాలసముహరమే ఈ సినిమా మూలకథ
స్టొరీ :
చిన్నతనం నుండి మహాలక్ష్మి (మెహ్రీన్)ని ప్రాణంగా ప్రేమించేకృష్ణ (నాని) ఒక విచిత్రమైన సమస్య తోసతమతమవుతుంటాడు. మహాలక్ష్మి - కృష్ణ మధ్య వుండే ప్రేమ వాళ్ళిద్దరికి తప్పఎవ్వరికి బయటికి చెప్పుకోలేని పరిస్థితుల్లో బ్రతుకుతుంటారు. ఫ్యాక్షన్ గొడవలతో ఎప్పుడుపగ, ప్రతీకారాలుతో రగిలిపోయేఅప్పిరెడ్డి , రాజన్న మధ్యజరిగే ఫ్యాక్షన్ గొడవలు వలన మహాలక్ష్మి - కృష్ణ ప్రేమకథ ఒక్కసారిగా ఇద్దరి జీవితాలనుమార్చివేస్తుంది. మహాలక్ష్మి ని దక్కించుకోవటానికి కృష్ణ చేసిన సాహసాలు ఏంటి...?కృష్ణ గాడి లైఫ్ కి మాఫియా వాళ్ళకి వున్నా సంబంధం ఏంటి...? అనేవి తెలియాలంటే తెరమీద చూడాల్సిందే.
స్క్రీన్ ప్లే :
ప్లే 1 :
- చిన్నతనం లో మహాలక్ష్మి (మెహ్రిన్ ) అంటే కృష్ణ (నాని ) కి ఎంత ఇష్టమో చూపించే సన్నివేశాలు
- సిందుపురం లో పగలు ప్రతికారాలతో రగిలిపోయే రెండు ఫ్యామిలీ ల మధ్య ఎలా ఉంటాయో చూపించటం
- బాలయ్య ఫ్యాన్ గా కృష్ణ (నాని ) ఎంట్రి ఇవ్వటం
- డిగ్రీ పాస్ కాని అమ్మాయి గా మహాలక్ష్మి (మెహ్రిన్ ) నిచూపించటం
ప్లాట్ పాయింట్ 1 : మహాలక్ష్మి ,కృష్ణ ఇద్దరు ప్రేమించుకుంటూన్నారు అని ఆ ప్రేమ కేవలం వారిద్దరి మధ్య పరిమితంఅయ్యి బయట ప్రపంచానికి సంబంధం లేకుండా వుండటం.
ప్లే 2 :
- సత్యం రాజేష్ -కృష్ణ , మహాలక్ష్మి మధ్య నడిచే కామెడి సన్నివేశాలు
- ఏ.సి.పి. క్యారెక్టర్ లో సంపత్ ఎంట్రీ ఇవ్వటం. మెహ్రిన్ఫ్యామిలీ కి సంపత్ కి సంబందం ఏంటో చూపించటం
- తన ఇంట్లో పెళ్లి సంబందాలు చూస్తున్నారని మహాలక్ష్మి కృష్ణకి చెప్పటం. తన అన్నయ్య తో మాట్లాడమని కృష్ణ కి వార్నింగ్ ఇవ్వటం
- కృష్ణ మహాలక్ష్మి మీద వున్నా ప్రేమ తో మెహ్రిన్ ఇంటి కి వెళ్లితన ప్రేమ గురించి దైర్యంగా చెబుదామని ప్రిపేర్ అవ్వటం
- రామరాజు ఇంటి మీదమాఫియా వాళ్ళు దాడి చెయ్యటం ...ఆ క్రమంలో మెహ్రిన్ అన్నయ్య తన దగ్గర వున్నాముగ్గరు పిల్లలను తీసుకుని పారిపోతుంటే నాని సహాయం తీసుకోవటం... తన ప్రేమ గురించిచెప్పాలని వచ్చిన నాని కి మెహ్రిన్ అన్నయ్య ఈ ముగ్గురి పిల్లలను కాపాడితే తనచెల్లెలను ఇచ్చి పెళ్లి చేస్తాను అని చెప్పటం తో సినిమా మిడ్ పాయింట్ కి చేరుకుంటుంది.
ప్లే 3 :
- ముగ్గురి పిల్లలను ఆ ఊరి నుండి దూరంగా తీసుకుని కృష్ణ వెళ్ళటం
- కృష్ణ ఒక కిడ్నాపర్ అని ఆ ముగ్గరు పిల్లలు అనుకోవటం
ప్లాట్ పాయింట్ 2 : మాఫియా డాన్ డేవిడ్ (మురళీశర్మ) ని అరెస్ట్ చేసిన కారణంగా ఏ.సి.పి సంపత్ రాజ్ పిల్లలను కిడ్నాప్ చేస్తే మురళీశర్మ బయటికి వస్తాడు అని డేవిడ్ అనుచరులుసంపత్ రాజ్ పిల్లలు కోసం వెతకటం
డేవిడ్ అనుచరులు నుండి తప్పించుకుని ముగ్గురు పిల్లలతో కృష్ణ ట్రావెల్ చేసేక్రమంలో కృష్ణ కి మహాలక్ష్మి కనపడటం
ప్రీ -క్లైమాక్స్ : డేవిడ్ మనుషుల వలన మహాలక్ష్మి, ఆ ముగ్గురు పిల్లలు సమస్యలోపడటం.. కృష్ణ ఈ సమస్య నుండి ఎలా బయటపడాలో ఆలోచించటం.
క్లైమాక్స్ : డేవిడ్ అనుచరుల నుండి ఆ ముగ్గురి పిల్లలను తన ప్రాణాలుసైతం లెక్కచెయ్యకుండా డేవిడ్ మనుషులని ఎదిరించిఆ ముగ్గురి పిల్లలను తన తండ్రి దగ్గరికి చేర్చటంతో సినిమా ముగుస్తుంది.
కలిసొచ్చే అంశాలు :
- నాని పెర్ఫార్మెన్స్
- నాని (కృష్ణ), మహాలక్ష్మి(మెహ్రీన్ ) మధ్యన వచ్చే లవ్ ట్రాక్
- నాని-సత్యం రాజేష్‌ల మధ్య వచ్చే కామెడి సన్నివేశాలు
- హీరొయిన్ మెహ్రీన్ ని స్క్రీన్‌మీద చూపించిన ప్రజంటేషన్
- సెకండ్ ఆఫ్ లో నాని& బేబి నయన, మాస్టర్ప్రదమ్, బేబిమోక్ష మధ్య నడిచే ఎపిసోడ్
- ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ ఎపిసోడ్
- విశాల్‌చంద్రశేఖర్ మ్యూజిక్
- సినిమాటోగ్రఫీ& పిక్చరైజేషన్
సినిమా ఫార్ములా : సాయి రామ్ శంకర్ ''143'' సినిమా లో హీరో -హీరొయిన్ ఒకే ఇంట్లోవుంటూ ఇంట్లో వాళ్ళకి తెలియకుండా లవ్ చేసుకుంటూ లో వున్నా పాయింట్ ని తీసుకుని మహేష్ బాబు ''అతిధి'' సినిమా లో వున్నా ''ఖైజర్ =మాఫియాడాన్'' క్యారెక్టర్ ని తీసుకుని రాయలసీమఫాక్షనిజం కలిపితే ఈ ''కృష్ణ గాడి వీర ప్రేమ కథ''
సినిమా ఎవరికీ నచ్చుతుంది :
- నాని ''భలే భలే మగాడివోయ్'' సినిమా నిఇష్టపడేవారికి ఈ సినిమా నచ్చుతుంది
- ''అందాల రాక్షసి'' సినిమా ని చూసినవారికీ ఈ సినిమా నచ్చుతుంది
- నందమూరి బాలకృష్ణ అభిమానులకి ఈ సినిమా నచ్చుతుంది
ఫినిషింగ్ టచ్ : ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యిన కృష్ణగాడి విజయగాధ
సినిమా రివ్యూ రేటింగ్ : 3.25/5.00