Review : Kshanam Movie
ఈ క్షణం అడుగడుగున ఆడియన్స్ ని మోప్పిస్తుంది
Review : Kshanam Movie
ravikanth Perepu
Adivi Sesh, Adah Sharma
స్టొరీ లైన్ : హైదరబాద్ లో ఒక మిస్ అయ్యిన పాప కోసం అమెరికా నుండి వచ్చిన ఒక యువకుడు ఆ పాప ని వెతికే క్రమంలో ఆ యువకుడు తెలుసుకున్న నిజాల సముహరమే ఈ క్షణం సినిమా కథ.
స్టొరీ : అమెరికాలో జాబ్ చేస్తున్న రిషి (అడవి శేష్) కి హైదరాబాద్ లో వుండే మాజీ లవర్ శ్వేత(ఆద శర్మ)నుండి ఫోన్ కాల్ రావటంతో ఇండియా వచ్చిన రిషి శ్వేత ని కలుస్తాడు. శ్వేత తన కూతురు రియా ని రెండు నెలలు క్రితం ఎవరో కిడ్నాప్ చేసారు అని ఆ విషయం లో సాయం చెయ్యమని శ్వేత రిషి ని అడుగుతుంది. ఆ పాప ని వెతికే క్రమం లో రిషి కి ఏలాంటి ఆధారాలు దొరక్కకుండా ఆ పాప ని కిడ్నాప్ చేసిన దుండుగులు మాయం చేస్తుంటారు. రియా కోసం వెతికే పనిలో వున్నా రిషి కి శ్వేత భర్త అయిన కార్తీక్ (సత్య) ద్వారా ఒక నిజం తెలుసుకుంటాడు. రిషి తెలుసుకున్న నిజం ఏంటి...? అసలు పాప ని కిడ్నాప్ చెయ్యాల్సిన అవసరం ఏంటి...? రిషి పాప జాడ తెలుసుకునే ప్రయత్నం లో తెలుసుకున్న నిజాలు ఏంటి....? అనేవి తెలియాలంటే తెర మీద చూడాల్సిందే.
స్క్రీన్ ప్లే :
ప్లే 1 :
- క్షణం సినిమా ఓపెనింగ్ చెయ్యటమే ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి కార్ లో వున్నా శ్వేత ని కొట్టి పాప తో పాటు కార్ ని కూడా తిసుకుపోవటం
- అమెరికా లో వుండే రిషి కి హైదరబాద్ లో వుండే శ్వేత కాల్ చెయ్యటం
- రిషి ఇండియా కి వచ్చే సమయం లో రిషి – శ్వేత మధ్య వున్నా లవ్ స్టొరీ ని ఫ్లాష్ బ్యాక్ రూపం లో రిషి గుర్తుకు తెచ్చుకోవటం
ప్లాట్ పాయింట్ 1 : శ్వేత తన కూతురు రియా రెండు నెలలు నుండి కనిపించటం లేదు ఎవరో కిడ్నాప్ చేసారు అని రిషి చెప్పటం. రియా విషయం లో శ్వేత రిషి సహయం తిసుకోవటం.
ప్లే 2 :- రియా ని వెతికే పనిలో రిషి కి ఏలాంటి ఆదారాలు తెలియకపోవటం
- రిషి పేపర్ లో రియా గురించి ప్రకటన ఇవ్వటం
- ఆ ప్రకటన చూసిన ఒక వ్యక్తీ ఆ పాప నాదేనంటూ రిషి ని కలవటం
- శ్వేత భర్త కార్తీక్ ద్వారా రిషి అసలు శ్వేత కి పిల్లలు లేరు అని శ్వేత అంత ఉహించుకుంటుంది అని చెప్పటం.
- రిషి శ్వేత ని నిలదీసే క్రమంలో శ్వేత ఇంట్లో రియా గురించి కొన్ని ఆధారాలు దొరకటం. వాటి గురించి శ్వేత ని అడిగేలోపే శ్వేత బిల్డింగ్ పై నుండి దూకేయ్యటంతో సినిమా మిడ్ పాయింట్ కి చేరుకుంటుంది.
ఇంటర్వెల్
ప్లాట్ పాయింట్ 2 : శ్వేత చనిపోయింది అని తెలిసిన వెన్నెల కిశోర్ రిషి కి పాప గురించి చెప్పటం
ప్లే 3 :- వెన్నెల కిషోర్ ద్వారా కార్తీక్ తమ్ముడు రవి వర్మ యే రియా ని కిడ్నాప్ చేసాడు అని చెప్పటం
- రవి వర్మ ని పట్టుకుని రియా గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకునే క్రమంలో రవివర్మ ని అనసూయ అనుకోని పరిస్థితి లో రవివర్మ చనిపోవటం.
- రియా ని కిడ్నాప్ చేసిన గ్యాంగ్ వెన్నెల కిశోర్ మీద ఎటాక్ చెయ్యటం. ఆ ప్రమాదం లో వెన్నెల కిషోర్ చనిపోవటం. వెన్నెల కిషోర్ ని చంపినా గ్యాంగ్ ద్వారా అసలు ఇదంతా ఎవరు చేస్తున్నారో తెలుసుకోవటం
ప్రీ-క్లైమాక్స్ :
పాప ని ఎవరు కిడ్నాప్ చేసారో రిషి కి తెలిసిపోవటం ...రియా కోసం అనసూయ గెస్ట్ హౌస్ కి వెళ్ళటం. అక్కడ అనూహ్య రీతిలో అనసూయ రిషి మీద దాడి చెయ్యటం.అనసూయ ద్వారా అసలు నిజాన్ని రిషి తెలుసుకోవటం
క్లైమాక్స్ : అనసూయ భారీ నుండి రిషి ని చౌదరి (సత్యం రాజేష్ ) కాపాడటం . రిషి రియా ని కాపాడే ప్రయత్నం లో రిషి కి రియా తన కూతురే అని తెలియటంతో సినిమా ముగుస్తుంది.
కలిసొచ్చే అంశాలు :
- అడవి శేష్ నటన
- ఇంటరెస్టింగ్ స్క్రీన్ ప్లే
- సినిమా చివరి పదినిమిషాలు (క్లైమాక్స్ ఎపిసోడ్ )
- శానియాల్ డియో సినిమాటోగ్రఫీ ప్రజెంటేషన్
- సత్యం రాజేష్ కామెడి టైమింగ్
- అబ్బూరి రవి రాసిన పంచ్ డైలాగ్స్ టైమింగ్ ని బట్టి ఆడియన్స్ కనెక్ట్ అయ్యే విధానం
సినిమా ఫార్ములా :
- క్షణం సినిమా చూస్తుంటే 2013 లో బాలివుడ్ లో వచ్చిన అనురాగ్ కశ్యప్ సినిమా ‘’Ugly’’సినిమా గుర్తుకువస్తుంది.
- క్షణం సినిమా చూస్తుంటే 2012 లో వచ్చిన బాలివుడ్ సినిమా ‘’ Kahaani’’ సినిమా గుర్తుకువస్తుంది.
సినిమా ఎవరికీ నచ్చుతుంది :
- సస్పెన్స్ డ్రామా సినిమాలని ఇష్టపడే వారికీ ఈ సినిమా నచ్చుతుంది
- రొటీన్ సినిమాలు చూసిన విసిగిపోయిన వారికీ ఈ సినిమా నచ్చుతుంది.
ఫినిషింగ్ టచ్ : ఈ క్షణం అడుగడుగున ఆడియన్స్ ని మోప్పిస్తుంది
క్షణం మూవీ రివ్యూ :3.25/5.00