Review : lacchimdeviki o lekkundi
ఈ లచ్చిందేవి లెక్క తప్పింది
Review : lacchimdeviki o lekkundi
Jagadish Talasila
Naveen Chandra, Lavanya tripathi
స్టొరీ లైన్ : బ్యాంకు ల్లో అనాధగా పడివున్న డబ్బు మీద కన్నువేసిన గ్యాంగ్స్ నుండిబ్యాంక్ నే తన తల్లిదండ్రులుగా భావించే దేవి, దుండుగుల నుండి ఆ డబ్బుని కాపాడుకోవటానికి చేసినసాహసాల సముహరమే ఈ ''లచ్చిందేవికి ఓ లెక్కవుంది'' మూల కథ
స్టొరీ : దేశంలోని అన్నిబ్యాంక్స్ లో అనాధగా పడి ఉన్న డబ్బుని కొట్టేయాలని మహేష్ (అజయ్ ) తన టీం తో కలసి వేసినప్లాన్ లో వాళ్ళకి అనుఅనుకూలమంగా వున్నబ్యాంకు ని సెలెక్ట్ చేసుకుంటారు. ఆ బ్యాంకు లో హెల్ప్ డెస్క్ గా పనిచేసే నవీన్(నవీన్ చంద్ర ) ఒక్కడే ఈ పని చెయ్యగలడు అని నమ్మి అతనికి డబ్బు ఆశ చూపుతాడు.బ్యాంకు ని తన కన్నా తల్లి దండ్రులుగా చూసుకునే దేవి (లావణ్య త్రిపాటి) నవీన్ చేసేబ్యాంకు లోనే క్యాషియర్ గా పనిచేస్తూ మేనేజర్ (జయప్రకాశ్ రెడ్డి ) తర్వాత సర్వహక్కులు తనకే వుండేటట్టుగా బ్యాంకు ని కంట్రోల్ లో వుంచుకుంటుంది. నవీన్ దేవి నిప్రేమతో మచ్చికగా చేసుకుని దేవి దగ్గర నుండి అనాధగా పడివున్న డబ్బు కిసంబంధించిన డేటా ని దొంగిలించి అజయ్ కిఇస్తాడు. అజయ్ ఆ డేటా తో ఆ బ్యాంకు లో వున్నాడబ్బు ని ఏలా దక్కించుకోవాలని చేసిన ప్రయత్నం ఏంటి...? ఆ డబ్బుని కాపాడుకోవటానికిదేవి ఏమి చేసింది...? ఈ అనాధగా పడివున్న డబ్బు మీద ఎంత మంది కన్ను పడింది...?ఇవన్ని తెలియాలంటే తేర మీద చూడాల్సిందే.
స్క్రీన్ ప్లే :
సినిమా ఓపెనింగ్ వాయిస్ఓవర్ o స్టార్ట్ అవ్వుతూ ఆర్.బి.ఐ బ్యాంక్ రూల్స్ ప్రకారం అన్ని బ్యాంక్స్ లోవున్నా అనాధలుగా పడివున్న కరెన్సీ నోట్లలకి అడ్రస్ లేదు అని, వాటి లెక్క ఏంటోతేల్చమని చెప్పటం తో సినిమా మొదలు అవ్వుతుంది.
నవీన్ (నవీన్ చంద్ర )బ్యాంక్ లో హెల్ప్ డెస్క్ లో జాబ్ చేస్తుంటాడు. అదే బ్యాంక్ లో దేవి (లావణ్యత్రిపాటి) క్యాషియర్ గా పనిచేస్తూ మేనేజర్ (జయప్రకాశ్ రెడ్డి ) తర్వాత ఆ బ్యాంక్‌ని తన కంట్రోల్ లో ఉంచుకుంటూ జాగ్రత్త గా చూసుకుంటూ వుంటుంది.
ప్లాట్ పాయింట్ 1 : బ్యాంకు లలో అనాధగా పడివున్న డబ్బు మీద మహేష్ (అజయ్) తన గ్యాంగ్‌తో ప్లాన్ వేసి నవీన్ ని ఎరగా వాడుకుని ఆ డబ్బుని కొట్టేయాలని పధకం వేస్తారు.
ప్లే -1 :
- నవీన్ -దేవి మధ్య లవ్‌స్టొరీ ..నవీన్ ని దేవి ఇష్టపడటం..
- మేనేజర్ దేవి ని అనాధగాపడివున్న డబ్బుకి సంబంధించి డేటా ని రెడీ చేసి ఇవ్వమని చెప్పటం. దానిలో బాగంగా దేవి నవీన్ హెల్ప్ తీసుకోవటం.
- నవీన్ దేవి కి తెలియకుండా ఆడేటా ని కాఫీ చేసుకోవటం
- నవీన్ ఆ డేటా ని మహేష్ కిఇవ్వటం.. ఆ డేటా లో ఎక్కువ అమౌంట్ వున్నా వాళ్ళ లిస్ట్ రెడీ చేసి ఆ అకౌంట్స్ మాకుసంబంధించినవే అని అన్నిడాక్యుమెంట్స్ రెడీ చెయ్యటం..
- డబ్బు చేతికి అందుతున్నసమయం లో మేనేజర్ (జయప్రకాశ్ రెడ్డి ) ఆ అకౌంట్స్ (అంకాలమ్మ & ఉమా దేవి )ఏవరివో వాళ్ళకి వున్నా ఫ్లాష్ బ్యాక్ చెప్పటం తో మహేష్ తన టీం తో చేసిన మోసాన్నిమేనేజర్ బయటపెట్టటంతో కథ మిడి పాయింట్ కి చేరుకుంటుంది.
ఇంటర్వెల్
ప్లే - 2 :
- మహేష్ తన టీం ని , నవీన్ నిపోలీసులు అరెస్ట్ చేసి తీసుకు వెళ్తుంటే నవీన్ తన బ్యాంకు పరువు పోతుంది అని బ్యాంకుమేనేజర్ తో మాట్లాడి కేసుని క్లోజ్ చేయిస్తాడు.
- నవీన్ - బ్యాంకు మేనేజర్ఆడిన ఈ డ్రామా లో దేవి తన వలనే ఈ తప్పుజరిగింది అని దేవి బాధ పడుతుంది.
- బ్యాంకు మేనేజర్ - నవీన్ తో చేతుల కలిపి ఆ రెండు అకౌంట్స్ (అంకాలమ్మ & ఉమా దేవి ) నుండి డబ్బులు కొట్టేస్తారు. కానీ బ్యాంకుమేనేజర్ తెలివిగా నవీన్ కి ఎలాంటి వాటా ఇవ్వకుండా మోసం చేస్తాడు.
ప్లాట్ పాయింట్ 2 :
ఆ డబ్బు కొట్టేసిన బ్యాంకుమేనేజర్ మీద దేవి శరీరం లో అంకాలమ్మ (దేవతగా) & ఉమా దేవి (దెయ్యంగా ) వచ్చిబ్యాంకు మేనేజర్ ని , నవీన్ ని ఇబ్బందిపెట్టటం స్టార్ట్ చేస్తుంది.
ప్లే - 3 :
- నవీన్ కి దేవి మీద వున్నాప్రేమతో మంచిగా మారాలని ట్రై చేస్తూ వుంటాడు. కానీ దేవి మాత్రం నవీన్ ని దూరంపెడుతుంది.
- బ్యాంకు మేనేజర్ భయపడి ఆ డబ్బుని తిరిగి ఇచ్చేస్తాను అనిచెప్పటం తో దేవి శరీరం లో అంకాలమ్మ (దేవత ) & ఉమా దేవి (దెయ్యం) ఇద్దరు శాంతిస్తారు.
ప్రి-క్లైమాక్స్ :
ఆ డబ్బుని బ్యాంకు మేనేజర్ రెడీ చేసే క్రమంలో దేవి (లావణ్య త్రిపాటి ) మహేష్ (అజయ్ ) తో ఆడిన గేమ్ రివిల్ చేస్తుంది.
క్లైమాక్స్ : బ్యాంకు మేనేజర్ ఆ డబ్బుని దేవి శరీరం లో అంకాలమ్మ (దేవత ) & ఉమా దేవి (దెయ్యం) చెప్పినట్టుగా డబ్బుని అప్పగించేక్రమంలో నవీన్ తన ప్లాన్ ప్రకారం అందరికి (అజయ్టీం, బ్యాంకు మేనేజర్ టీం) ఫుల్ స్టాప్ పెట్టటంతో సినిమా ముగుస్తుంది.
కలిసొచ్చే అంశాలు :
- లావణ్య నటన
- అక్కడక్కడ నవ్వించే కామెడిసన్నివేశాలు
- ఫస్ట్ ఆఫ్ లో కీరవాణిబ్యాక్ గ్రౌండ్ స్కోర్
- ఇంటర్వెల్ బాంగ్
సినిమా ఫార్ములా :
- ''లచ్చిందేవికి ఓ లెక్కవుంది'' సినిమా చూస్తుంటే 'నితిన్' -మారో '' , నాగచైతన్య 'దోచేయ్'', సినిమాలు గుర్తుకు వస్తాయి.
- స్వామి రా రా...! & భలేమంచి రోజు లాంటి సినిమాల్లో వున్నాపాయింట్ లో ''లచ్చిందేవికి ఓ లెక్కవుంది'' సినిమా ట్రావెల్ చేస్తే అక్కడక్కడ స్క్రీన్ ప్లే పోలికలు కనిపిస్తాయి..
సినిమా ఎవరికీ నచ్చుతుంది :
- అందాల రాక్షసి సినిమా లో లావణ్య-నవీన్ చంద్ర యాక్టింగ్ ని ఇష్టపడేవారికీ ఈ సినిమా నచ్చుతుంది.
- కీరవాణి సంగీత స్వరాలనిఇష్టపడేవారికీ ఈ సినిమా నచ్చుతుంది.
- లావణ్య త్రిపాటి నటన నిఇష్టపడే వారికీ ఈ సినిమా నచ్చుతుంది.
ఫినిషింగ్ టచ్ : ఈ లచ్చిందేవి లెక్క తప్పింది
సినిమా రివ్యూ రేటింగ్ :2.75/5.00