Top

Review : Loafer Movie

లోఫర్ : పూరి ట్రేడ్ మార్క్

Source: General

By: IFY LLC

Critic's Rating: 3/5

Friday 18 December 2015

Movie Title

Review : Loafer Movie

Director

Puri Jagannadh

Star Cast

Varun Tej, Disha Patani

స్టొరీ  లైన్ : లోఫర్ గా తిరిగే ఒక యువకుడి కి జీవితంలో తను ఎంతగానో  ప్రేమించే తల్లి ప్రేమ పొందటానికి తన తల్లికి దగ్గర అయ్యే క్రమంలో  అతనికి ఎదురైనా పరిణామాలు సమూహారమే ఈ లోఫర్  మెయిన్ స్టొరీ. 

స్టొరీ :మురళి (పోసాని కృష్ణమురళి) ఎటు వంటి వాడో తెలియకుండా గొప్పింటి అమ్మాయి అయిన లక్ష్మీ దేవి(రేవతి) అతని ప్రేమించి పెళ్లి పెళ్లి చేసుకుంటుంది. వాళ్ళ ఇద్దరి మధ్య ఆస్తి గురించి గొడవ రావటం తో వాళ్ళకి పుట్టిన కొడుకు రాజా(వరుణ్ తేజ్) ని తనకన్నా లోఫర్ లా పెంచాలని నార్త్ ఇండియాలోని జోద్ పూర్ కి తీసుకువెళ్ళి తన కొడుకుని పక్కా లోఫర్ లా పెంచుతాడు. రాజా కూడా నొక్కేయడానికే పుట్టానని బలంగా ఫిక్స్ అయ్యి దొరికిన చోట దొరికినంత దోచుకుంటూ ఉంటున్న సమయంలో జోద్ పూర్ వచ్చిన పారిజాతం(దిశా పటాని) ని చూసి రాజా ప్రేమలో పడతాడు. వీరిద్దరి ప్రేమ లో వున్నా సమయంలో ముఖేష్ (ముఖేష్ రుషి) మనుషులు పారిజాతం ని రాజా కళ్ళముందే కిడ్నాప్ చేసే తీసుకువెళ్తారు. పారిజాతం ని  కాపాడడం కోసం వెతుక్కుంటూ వెళ్ళిన రాజా పారిజాతం ని పట్టుకోవడం కోసం లక్ష్మీదేవి కొడుకుగా మారతాడు. అసలు పారిజాతం కి లక్ష్మి దేవి కి వున్నా సంబంధం ఏంటి...? పారిజాతం కోసం వెళ్ళిన రాజా లైఫ్ లో తెలుసుకున్న నిజాలు ఏంటి...? అనేవి తెలియాలంటే తెర మీద చూడల్సిందే.

స్క్రీన్ ప్లే :

  • వరుణ్ తేజ్  చైల్డ్ హుడ్ ఎపిసోడ్ తో  ముందుకు వెళ్తూ  వరుణ్ తేజ్ ని ఏలా పెరిగి పెద్దవాడు అవ్వుతున్నాడో  చూపిస్తూ  సినిమా ముందుకు వెళ్తూ వుంటుంది.
  • ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారు అని ఇంట్లో నుండి పారిపోయి వచ్చిన హీరొయిన్  హీరో కంటపడటం.
  • జోధ్ పూర్ లో  వరుణ్ తేజ్  హీరొయిన్  మధ్య  జరిగే సన్నివేశాలు  బట్టి హీరొయిన్ కి  ఏదో పెద్ద సమస్య వుంది అని  హీరొయిన్ ని  ముకేష్ రిషి మనుషులు వచ్చే తీసుకెళ్ళే వరుకు హీరో కి తెలియకపోవటం.
  • సినిమా స్టార్టింగ్ నుండి ఇంటర్వెల్  వరుకు హీరో –హీరొయిన్ మధ్య లవ్ స్టొరీ చూపిస్తూ  హీరో కి తన తల్లి కనిపించటం

ఇంటర్వెల్

  • హీరొయిన్  కాపాడటం కోసం చేసే ప్రయత్నం లో హీరో తన తల్లి పక్కనే వుంటూ సహాయం తీసుకోవటం
  • హీరో – రేవతి మధ్య వున్నా తల్లి – కొడుకు ప్రేమ అనుబంధాలు  ఎమోషనల్ గా చూపించటం
  • హీరో హీరొయిన్ కోసం వెతికే వేటలో  అసలు హీరొయిన్ వెనక నున్న కథ ని తెలుసుకోవటం
  • హీరొయిన్  కూడా తన ఫ్యామిలీ మెంబెర్ అని హీరో తెలుసుకొనే క్రమంలో ఆ ఉరిలో ఉన్న సమస్య వైపు వెళ్తూ తన తల్లి గురించి తెలుసుకుని హీరో తన తల్లి కి దగ్గర అవ్వటం తో సినిమా ముగుస్తుంది.

కలిసొచ్చే అంశాలు :

  • వరుణ్ తేజ్ ని  స్క్రీన్  మీద పూరి జగన్నాథ్  చూపించిన విధానం
  • అక్కడక్కడ పేలే పంచ్ డైలాగ్స్  
  • తల్లి క్యారెక్టర్ చేసిన రేవతి –వరుణ్ తేజ మధ్య సెంటిమెంట్ సన్నివేశాలు
  • పి.జి.విందా  సినిమాటోగ్రఫీ  విజువల్స్
  • సునీల్ కశ్యప్  బ్యాక్ గ్రౌండ్ స్కోర్

సినిమా ఫార్ములా :

  • పూరి జగన్నాథ్ – ప్రభాస్ కాంబినేషన్ లో వచ్చిన ‘ఎక్ నిరంజన్’ సినిమా ని లోతుగా వెళ్లిరీసెర్చ్ చేసే తీస్తే ఈ వరుణ్ తేజ్ లోఫర్ సినిమా వచ్చేస్తుంది.
  • రాజమౌళి –ప్రభాస్ కాంబినేషన్ లో వచ్చిన ‘చత్రపతి’ సినిమా లో  వున్నా ప్రభాస్  తన తల్లి భానుప్రియ కోసం చేసే అన్వేషణ & భాను ప్రియ తన కొడుకు  ప్రభాస్ కోసం చేసే అన్వేషణని కొంచం  రీ-మోడల్ చేస్తే  ఈ వరుణ్ తేజ్ లోఫర్  సినిమా వచ్చేస్తుంది.
  • 1994 లో  సంగీతం శ్రీనివాస్ రావు దర్శకత్వం  బాలకృష్ణ హీరోగా వచ్చిన ‘బైరవ ద్వీపం’సినిమా లో కె.ఆర్.విజయ్ తన కొడుకు (బాలకృష్ణ)  కోసం పడే తపన లో ఈ వరుణ్ తేజ్లోఫర్ సినిమా కన్పిస్తుంది.

సినిమా  ఎవరికీ నచ్చుతుంది :

  • పూరి జగన్నాథ్ సినిమాలని ఇష్టపడే వారికీ ఈ సినిమా నచ్చుతుంది.
  • మెగా అభిమానుల  అందరికి ఈ సినిమా నచ్చుతుంది.
  • మాస్ & కమర్షియల్  సినిమాలని ఇష్టపడే వారికి ఈ సినిమా నచ్చుతుంది.

ఫినిషింగ్ టచ్ :  ఈ లోఫర్ టైటిల్ లో వున్నా దమ్ము సినిమా లో లేదు

సినిమా రేటింగ్ : 2.75/5

recent reviews

Keshu Ee Veedinte Naadhan

Time pass comedy entertainer

Plan Panni Pannanum

Average comedy entertainer

Velan

Decent rural family entertainer

Meow

Soubin Shahir and Mamta Mohandas shine in this conventional film

Read more

galleries