Review : Nannaku Prematho
నాన్నకు ప్రేమతో... కూల్ & సాఫ్ట్ గా సాగిపోయే ఇంటిలిజెంట్ డ్రామా
Review : Nannaku Prematho
Sukumar
Junior Ntr, Rakul Preet
స్టొరీ లైన్ : తన తండ్రి చివరి కోరికని తీర్చటం కోసం తన తండ్రి ని మోసం చేసిన వ్యక్తీ మీద ఇంటిలిజెంట్ మైండ్ గేమ్ తోఅతనికి (ప్రతినాయకుడు ) మీద అతని కోడుకు (హీరో)ఏలా రివెంజ్ తీర్చుకున్నాడో ఈ నాన్నకుప్రేమతో సినిమా మూలకథ
స్టొరీ :
లండన్లో పెద్ద ధనవంతుడు అయ్యిన రమేశ్చంద్ర ప్రసాద్ (రాజేంద్ర ప్రసాద్) రియల్ ఎస్టేట్ వ్యాపారి లో కృష్ణమూర్తి(జగపతి బాబు) చేతిలో మోసం పోయి ఆ బాధలో అనారోగ్యం పాలవుతాడు. తన చివరి కోరిక నేరవేర్చమని అతనికికున్న ముగ్గురుకొడుకులకు (రాజీవ్ కనకాల, శ్రీనివాస్ అవసరాల, జూనియర్ ఎన్టీఆర్) అప్పజేబుతాడు.తండ్రి కోరిక మేరకు వాళ్ళల్లో తెలివైన అభిరాం (జూ.ఎన్టీఆర్) తన తండ్రి కిమాటిస్తాడు. అభిరాం కృష్ణమూర్తి ని ఏలా ఎదిరించాడు...? అభిరాం కృష్ణమూర్తి నిపతనానికి ముగింపు పలకటానికి అతనికి సాయం చేసినవారు ఎవరు...? అభిరాం తన తండ్రి కోరికని నేరవేర్చడా ...? అనేది తేర మీదచూడాల్సిందే.
స్క్రీన్ ప్లే :
- హీరో కి వున్నా తెలివితేటలు గురించి హీరో సమస్యను ఒక ఇంటరెస్ట్ మైండ్ గేమ్ ద్వారా సాల్వ్ చేసే విధానం
- తన తండ్రి అనారోగ్యం పరిస్థితి గురించి హీరోకి తెలిసి తన తండ్రి దగ్గరకి వెళ్ళటం
- రాజేంద్రప్రసాద్ జగపతి బాబు గురించి తనకొడుకు కి జరిగిన దారుణాన్ని గురించి చెప్పటం
- తన తండ్రి ని ఏలా మోసం చేసాడో అదే విధంగాఅతని స్థాయి ని జీరో పొజిషన్ తీసుకురావటానికి 30 రోజులు టైం ఫిక్స్ చేస్తాడు.
- జగపతిబాబు కూతురు రకుల్ ని జూ.ఎన్టీఆర్ తన మైండ్ గేమ్ ఆడుతూ జగపతిబాబుకిదగ్గర అవ్వుతూ అతని తో గేమ్ ప్లే చేస్తాడు.
- ఇంటర్వెల్ కి జగపతి బాబు కి హీరో రాజేంద్రప్రసాద్ కొడుకు అని తెలిసిపోతుంది.
- హీరో తన తండ్రిని మోసం చేసిన వాడి మీద ఒక్కో మెట్టు అతన్నిస్థాయి దించుతూ హీరో అతని మీద విజయం సాధిస్తూ ముందుకు వెళ్తుంటాడు.
- రకుల్ కి అతను ఎందుకు వచ్చాడో జరిగిన కథ అంతచెప్పి జగపతి బాబు నుండి అతని కూతుర్ని దూరం చేస్తాడు.
- హీరో ఫ్యామిలీ ని నాశనం చేసే పనిలో జగపతి బాబు తనకి వున్నాఅన్ని దారులు క్లోజ్ అవ్వటం వలన అతను మళ్ళి జీరో పొజిషన్ కి తీసుకువచ్చిరాజేంద్రప్రసాద్ తన కోరిక ని తన కొడుకు ద్వారా నేరవేర్చుకుంటాడు.
కలిసొచ్చే అంశాలు :
- జూ.ఎన్టీఆర్ స్టైలిష్ యాక్టింగ్పెర్ఫార్మెన్స్
- రకుల్ ప్రీత్ సింగ్ స్క్రీన్ మీద చూపించిన ప్రజంటేషన్
- దేవిశ్రీప్రసాద్ బెస్ట్ మ్యూజిక్ & బ్యాక్ గ్రౌండ్ స్కోర్
- సుకుమార్ డిజైన్ చేసిన మైండ్ గేమ్ & ఇంటిలిజెంట్ సాఫ్ట్ స్క్రీన్ ప్లే
- ప్రతినాయకుడి పాత్రలో జగపతి బాబు పెర్ఫార్మెన్స్
ఆడియన్స్ రెస్పాన్స్ :
- జూ.ఎన్టీఆర్ స్టైలిష్ లుక్ చాలా బాగుంది.
- దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ అవుట్ స్టాండింగ్ గావుంది.
- జూ.ఎన్టీఆర్ యాక్టింగ్ చాలా బాగా చేసారు.ఎన్టీఆర్ ఇప్పటి వరుకు తీసిన సినిమాలు అన్ని ఒక ఒక ఎత్తు అయితే , ఈ సినిమా ఇంకొకఎత్తు
- సినిమా స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరుకు అంత ఫారెన్ లో వున్నా లోకేషన్స్ చూస్తుంటేహాలివుడ్ మూవీ ని చూస్తునట్టు వుంది.
- సుకుమార్ గారు టేకింగ్ చాలా బాగుంది.
సినిమా ఫార్ములా :
- రవితేజ ‘భగీరధ’ సినిమా లో వున్నా పాయింట్ ని ఫారెన్ లో తీస్తే ఏలా వుంటుందో అదే ఈ నాన్నకుప్రేమతో...సినిమా
సినిమా ఎవరికీ నచ్చుతుంది :
- సుకుమార్ తీ’సిన నేనొక్కడినే , ఆర్య ,కుమారి 21 F సినిమాలనిఇష్టపడేవారికి ఈ సినిమా నచ్చుతుంది.
- జూ.ఎన్టీఆర్ ని ఇష్టపడే నందమూరిఅభిమానులకు ఈ సినిమా నచ్చుతుంది.
- దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ ని,సుకుమార్ రైటింగ్ ని ఇష్టపడే వారికీ ఈ సినిమా నచ్చుతుంది.
తీర్పు : మహేష్ బాబు తో ‘నేనొక్కడినే’లాంటి సినిమా ని తనదైన స్టైలిష్ టేకింగ్ద్వారా తీసి మంచి పేరు తెచ్చుకున్న సుకుమార్ ఎన్టీఆర్ ని ఈ సినిమా లో కూల్ &సాఫ్ట్ క్యారెక్టర్ తో సినిమా అంత నడిపించటం, ఇంటిలిజెంట్ మైండ్ గేమ్ ప్లే చేసిన విధానం ఒక హాలివుడ్ సినిమా ని చూస్తునట్టు ఆడియన్స్ కలిగించిన ఫీలింగ్స్ కిమరోసారి సుకుమార్ రైటింగ్ కి ఫిదాఅవ్వాల్సిందే.
ఫినిషింగ్ టచ్ : నాన్నకు ప్రేమతో... కూల్ & సాఫ్ట్ గా సాగిపోయే ఇంటిలిజెంట్డ్రామా
నాన్నకు ప్రేమతో మూవీ రేటింగ్ : 3.25/5.0