Top

Review : Nava Manmadhudu

ఈ నవమన్మధుడు అందరిని ఆకట్టుకున్నాడు

Source: General

By: IFY LLC

Critic's Rating: 3/5

Saturday 19 December 2015

Movie Title

Review : Nava Manmadhudu

Director

R. Velraj

Star Cast

Dhanush, Amy Jackson, Samantha

స్టొరీ  లైన్ : ఇన్కంటాక్స్ డిపార్ట్ మెంట్ పనిచేసే ఒకమిడిల్ క్లాస్ ఉద్యోగి చెయ్యని తప్పులో ఇరుకున్న తండ్రి నిజాయితి ని కాపాడటానికి  అతని కొడుకు చేసే ప్రయత్నం లో అతను జీవితానికిప్రేమ అనుబంధాలతో కూడిన జీవితం ఎటు వైపు వెళ్లిందో అనేది ఈ నవమన్మధుడు కథ

స్టొరీ : భరత్ (ధనుష్) ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలైఫ్ లో తన ఫ్రెండ్స్ తో కలసి సంతోషంగా గడిపేస్తుంటాడు. అలాంటి సమయం లో హేమ (అమి జాక్సన్)ని చూసి ఆమె ను లవ్ లో పడెయ్యటానికి  చేసేప్రయత్నం లో హేమ , భరత్ ఇద్దరు గాడంగా ప్రేమించుకుంటారు. అదే సమయం లో వారిజీవితాల్లో మనస్పద్దలు రావటం వలన ఇద్దరు విడిపోతారు. అదే సమయం లో  హేమ లైఫ్ లోకి అరవింద్ (అదిత్ అరుణ్) వచ్చి ఆమెను పెళ్లి చేసుకుంటాడు. ఆదాయ పన్ను శాఖలోఉద్యోగం లో జాబ్ లో జాయిన్ అయ్యిన భరత్ లైఫ్ లోకి యమునా (సమంత) వస్తుంది. హేమ భర్తఅరవింద్ వలన ఆదాయ పన్ను  శాఖా లో పనిచేసేభరత్ తండ్రి (కె.యస్.రవికుమార్ ) ఒక అనుకోని కేసులో ఇరుక్కుని ఆత్మహత్య  చేసుకుంటాడు. అసలు భరత్ తండ్రి కి అరవింద్ కిఉన్న సంబంధం ఏంటి...? తన తండ్రి ఇరుకున్న కేసు లో వున్నా వాళ్ళని  భరత్ ఏవిధంగా ఈ సమస్యకి  ఏలా ఫుల్ స్టాప్ పెట్టాడు ...? అనేవితెలియాలంటే తెర మీద చూడాల్సిందే.

స్క్రీన్ ప్లే :

నవమన్మధుడు సినిమా ధనుష్ పాయింటాఫ్వ్యూ లో వాయిస్ నేరేషన్ లో చెప్పుకుంటూ తన లైఫ్ లో  జరిగిన సంఘటనలు చెబుతూ సినిమా ముందుకువెళ్తుంది.

ప్లే1:

  • సతీష్& అరవింద్ & భరత్ ముగ్గరు మధ్య వున్నా అనుబందం చూపించటం
  • భరత్  తండ్రి కె.యస్.రవికుమార్  మతిమరుపు మనిషిగా చూపించటం.
  • తోలిచూపులోనే అమి జాక్సన్ చూసి భరత్ లవ్ లో పడే సన్నివేశాలు
  • అరవింద్ని పట్టించుకోకుండా  భరత్ –సతీష్ తనకున్న ఇద్దరిలవర్స్ తో  ఎంజాయ్ చెయ్యటం

ప్లాట్పాయింట్ 1 :  హేమ-భరత్ ఇద్దరు పెళ్లి చేసుకోవాలని  ప్రయత్నాలు మొదలుపెట్టిన సమయం లో ఇద్దరి మధ్యమనస్పద్దలు రావటం వలన ఇద్దరు విడిపోవటం.

ప్లే2 :

  • అరవింద్– హేమ ఇద్దరు పెళ్లి చేసుకోవటం
  • తన తండ్రిపనిచేస్తున్న ఆదాయ పన్ను శాఖలో భరత్ కూడా జాబ్ లో జాయిన్ అవ్వటం
  • భరత్ లైఫ్ లోకియుమునా (సమంత) రావటం & ఇద్దరికీ పెళ్లి చేసుకోవటం

ఆదాయ పన్ను శాఖలో  భరత్ తండ్రి ఒక అనుకోని కేసు లో ఇరుక్కోవటం  వలన అతను ఆత్మహత్య చేసుకోవటం. దానివలన భరత్ఉద్యోగం కూడా పోవటం తో ఫ్యామిలీ అంత రోడ్డునా పడటం.

ఇంటర్వెల్

ప్లే3:

  • భరత్తన తండ్రి తప్పు చెయ్యలేదు అని అతనికి వెనక జరిగిన కుట్ర ఏంటో ఎంత ప్రయత్నం చేసినఅతనికి అంతు పట్టకపోవటం
  • భరత్తన ఫ్యామిలీ  పరిస్టితి  మిడిల్ క్లాస్ జీవన విధానానికి దిగజారడం

ప్లాట్పాయింట్ 2 :ఆదాయ పన్ను శాఖలో  పనిచేసే ఒక వ్యక్తీ ద్వారా భరత్ కి కొంచంసమాచారం  తెలిసి ఆదాయ పన్ను శాఖ హెడ్ అయ్యినజయ ప్రకాష్ (ప్రకాష్  కుమార్ )కలిస్తే అతనుఒక నిజం చెప్పటం తో దాని కోసం భరత్ ప్రయత్నాలు కొనసాగించటం.

ప్లే4:

  • హేమభర్త అరవింద్ వలనే  భరత్ తండ్రిచనిపోవటానికి కారణం అయ్యాడు అని హేమ భరత్ కి చెప్పటం.
  • అరవింద్దగ్గర వున్నా ఐదు  కోట్లు  ఎక్కడ వున్నాయో కనిపెట్టే సమయం లో డబ్బు కి వున్నావిలువలతో  మానవ సంబందాలకి వున్నా తేడా నిచెప్పటం

ప్రీక్లైమాక్స్ :

అరవింద్మారిపోయి భరత్ కి తిరిగి డబ్బు ఇవ్వటం.ఆ డబ్బును తిరిగి ఆదాయ పన్ను శాఖ హెడ్ అయ్యిన జయ ప్రకాష్(ప్రకాష్  కుమార్ ) కి ఇచ్చి తన తండ్రినిజాయితి పరుడు అని నిరూపించాలని చేసే ప్రయత్నం లో భరత్ కి జయ ప్రకాష్(ప్రకాష్  కుమార్ ) నుండి సమస్య రావటం.

క్లైమాక్స్: ఆదాయ పన్ను శాఖ హెడ్ అయ్యిన జయ ప్రకాష్(ప్రకాష్  కుమార్ ) కింద పనిచేసేఅసిస్టెంట్ సహాయం తో అసలు నిజాన్ని మీడియా ముందుకు తీసుకురావటంతో ఈ సినిమాముగుస్తుంది.

కలిసొచ్చే అంశాలు :

  • ధనుష్ సింపుల్  పెర్ఫార్మన్స్
  • సమంత – అమి జాక్సన్ వెండితెర  మీద ప్రజెంటేషన్
  • సతీష్ –ధనుష్ మధ్యవచ్చే కామెడి సన్నివేశాలు
  • ప్రీ-క్లైమాక్స్  -క్లైమాక్స్ సన్నివేశాలు
  • మిడిల్ క్లాస్ లైఫ్కి సంబంధించిన  సినిమాటోగ్రఫీ  విజువల్స్
  • అనిరుద్ రవిచంద్రన్బెస్ట్ మ్యూజిక్

సినిమా ఫార్ములా :

  • 2005 లో వచ్చినమహేష్ బాబు ‘అతడు’ సినిమా లో  ఎవ్వరుఉహించిన హత్య కేసులో ఇరుకున్న మహేష్ జీవితంలో ఇదంతా ఎవరు చేసారు అని తెలుసుకోవటానికి చేసే ప్రయత్నం లో వున్నా ప్లేలో మిడిల్ క్లాస్ - ఆదాయ పన్ను శాఖ అనే పాయింట్ ని పెట్టి రన్ చేస్తే  ఈ నవమన్మధుడు సినిమా.
  • 2007 లో గోపీచంద్ ‘ఒక్కడున్నాడు’సినిమా లో  గోపీచంద్ కి వున్నా ఫ్లాష్బ్యాక్ కి ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ యువకుడు అనే పాయింట్ ని మిక్స్ చేస్తే ఈ నవమన్మధుడుసినిమా.

సినిమా  ఎవరికీ నచ్చుతుంది :

  • ధనుష్ ‘రఘువరన్బి.టెక్ ‘ సినిమా చూసిన వారందరికి ఈ సినిమా నచ్చుతుంది.
  • సమంత యాక్టింగ్ నిఇష్టపడే వారికీ ఈ సినిమా నచ్చుతుంది.
  • తమిళ్ సినిమాల్నిఎక్కువగా చూసేవారికి  ఈ సినిమా నచ్చుతుంది.
  • ప్రతి మిడిల్క్లాస్ ఫ్యామిలీ మెంబెర్స్ కి ఈ సినిమా నచ్చుతుంది.

ఫినిషింగ్ టచ్ :  ఈ నవమన్మధుడు అందరిని ఆకట్టుకున్నాడు

సినిమా రేటింగ్ :3.0/5

recent reviews

Keshu Ee Veedinte Naadhan

Time pass comedy entertainer

Plan Panni Pannanum

Average comedy entertainer

Velan

Decent rural family entertainer

Meow

Soubin Shahir and Mamta Mohandas shine in this conventional film

Read more

galleries