Review : Police Movie
ఈ పొలిసు మరి ఓల్డ్ హే ...!
Review : Police Movie
Atlee Kumar
Vijay, Samantha
స్టోరీ లైన్ : తన ఐడెంటిటీ మార్చుకుని తన కూతురితో లైఫ్ లో హ్యాపీగా వున్నా ఒక పోలీసాఫీసర్ లైఫ్ లో చోటు చేసుకున్న సంఘటనల సముహరమే ఈ పొలిసు సినిమా కథ .
స్టోరీ :
జోసెఫ్ కురివిల్లా (విజయ్) తన కూతురు నివేదిత (బేబీ నైనిక)తో కలిసి కేరళ లో చిన్న ప్రాంతంలో ఎలాంటి సమస్యలు లేకుండా సాధారణం జీవనం గడుపుతూ ఉంటాడు. నివేదిత స్కూల్ టీచర్ యామి (అమీ జాక్సన్) వలన జోసెఫ్ కురివిల్లా కొన్ని సమస్యల్లో ఇరుకుంటాడు. అంతవరుకు సైలెంట్ గా వున్నా జోసెఫ్ కురివిల్లా తన ఏంటో, ఆ సమస్యలు కారణం అయిన వారికీ బుద్ది చెబుతాడు. జోసెఫ్ కురివిల్లా గురించి తెలుసుకునే ప్రయత్నం లో జోసెఫ్ కురివిల్లా ఒక పొలిసు ఆఫీసర్ అని యామి కి తెలుస్తుంది. అసలు హైదరబాద్ లో పోలీసాఫీసర్ గా వుండే విజయ్ కుమార్ పేరు మార్చుకుని కేరళ లో సాధారణ జీవితం ఎందుకు గడుపుతున్నాడు..? జోసెఫ్ కురివిల్లా జీవితం లో చోటు చేసుకున్న సంఘటనలు ఏంటి ..? వాటి నుండి ఏలా బయటపడ్డాడు..? అనేవి తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
స్క్రీన్ ప్లే :
- సినిమా కేరళ ప్రాంతం లో ఒక చిన్న విలేజ్ లో స్టార్ట్ అయి ఒక భారీ చేజ్ సన్నివేశాలు జరుగుతూ సినిమా ముందుకు వెళ్తుంది.
- విజయ్ తన కూతురి తో లైఫ్ లో హ్యాపీ వుంటూ ఎప్పుడు తన కూతుర్ని స్కూల్ కి లేట్ గా తీసుకెళ్లటం.
- నైనిక స్కూల్ కి లేట్ గా వెళ్ళటం, స్కూల్ టిచర్ యామి కి లేట్ గా వచ్చిన ప్రతి సారి ఏదో కారణం చెప్పి నైనిక తప్పించుకోవటం... ఆ ప్రయత్నం లో స్కూల్ టిచర్ యామి విజయ్ ని లవ్ చెయ్యటం
- స్కూల్ టిచర్ యామి వలన విజయ్ కూతురు ఒక అనుకోని ప్రమాదం నుండి బయట పడటం ...ఆ విషయంలో విజయ్ కలగజేసుకోవటం.
- అప్పటివరుకు సైలెంట్ గా వున్నా విజయ్ తన కూతురిని సమస్యల్లో తీసుకువచ్చిన వారి మీద దాడి చెయ్యటం.
- స్కూల్ టిచర్ యామి కి విజయ్ గురించి తెలుసుకునే ప్రయత్నం లో విజయ్ ఒక పోలీసాఫీసర్ అని తెలుసుకోవటం
- విజయ్ తన ఫ్లాష్ బ్యాక్ ని యామి కి చెప్పటం
ఫ్లాష్ బ్యాక్ 1 :
- హైదరబాద్ లో పోలీసాఫీసర్ అయిన విజయ్ కుమార్ గా స్టైలిష్ ఎంట్రీ ఇవ్వటం ... స్కూల్ ని అడ్డగా చేసుకుని స్కూల్ పిల్లలని ఇబ్బంది పెడుతున్న రౌడి గ్యాంగ్ కి విజయ్ బుద్ది చెప్పటం.
- రోడ్ సిగ్నల్ దగ్గర అడుకుంటున్న పిల్లల్ని ఇబ్బంది పెడుతున్న గ్యాంగ్ మీద విజయ్ దాడి చెయ్యటం.
- ఆ పిల్లల్ని కాపాడి వారికీ కావాల్సిన ట్రీట్మెంట్ ఇచ్చే క్రమంలో విజయ కుమార్ ని చూసి తొలి చూపుల్లోనే మైత్రి (సమంత) లవ్ లో పడటం.
- సిటీ లో ఒక సాఫ్ట్ వేర్ అమ్మాయి మిస్ అయిన కేసులో ఆ అమ్మాయి ని వెతికే క్రమంలో మినిస్టర్ వెంకట్ రెడ్డి (మహింద్రన్) కొడుకు అత్యాచార కేసులో నిందితుడిగా విజయ్ కుమార్ తెలుసుకోవటం
- సాఫ్ట్ వేర్ అమ్మాయిని రేప్ చేసి చంపినా మినిస్టర్ కొడుకు ని విజయ్ కుమార్ దారుణంగా చంపటం. ఆ విషయాన్నీ మినిస్టర్ కి చెప్పటంతో సినిమా మిడ్ పాయింట్ కి చేరుకుంటుంది.
ఇంటర్వెల్
- స్కూల్ టిచర్ యామి విజయ్ లైఫ్ లో జరిగిన సంఘటనలు గురించి తెలుసుకునే క్రమంలో విజయ్ కుమార్ దగ్గర పనిచేసే కానిస్టేబుల్ అయిన రాజేంద్రన్ ని అడుగుతుంది.
ఫ్లాష్ బ్యాక్ 2 :
- మైత్రి ని పెళ్లి చేసుకునే విషయం లో మైత్రి తండ్రి ని ఒప్పించే ప్రయత్నం లో మినిస్టర్ మనుషులు ఎటాక్ చెయ్యటం.
- మైత్రి -విజయ్ కుమార్ ప్రేమ వ్యవహారం మైత్రి తండ్రి కి ఇష్టం లేకపోవటం. విజయ్ పొలిసు అని ఒకే ఒక్క కారణం చేత అతని దూరంగా ఉండమని చెప్పటం
- మైత్రి -విజయ్ ఇద్దరు పెళ్లి చేసుకోవటం ... వారికీ ఒక పాప పుట్టటం
- ఒక అనుకోని సంఘటన లో విజయ్ కుమార్ ఫ్యామిలీ మీద మినిస్టర్ తన గ్యాంగ్ తో ఎటాక్ చెయ్యటం. ఆ సంఘటన లో మైత్రి, విజయ్ అమ్మ రాధిక చనిపోవటం.. అక్కడ నుండి విజయ్ పేరు మార్చుకుని కేరళ కి తన కూతుర్ని తీసుకుని వెళ్ళిపోవటం. అందరి దృష్టిలో విజయ్ కుమార్ చనిపోయాడు అని క్రియేట్ చెయ్యటం తో ఫ్లాష్ బ్యాక్ పూర్తి అవ్వుతుంది.
- విజయ్ కుమార్ బ్రతికే వున్నాడు అన్న విషయం మినిస్టర్ కి తెలుస్తుంది.
- నైనిక స్కూల్ టీం అంత కలసి విహార యాత్ర వెళ్తున్న సమయం లో స్కూల్ పిల్లలు వెళ్తున్న బస్ నీటిలో మునిగిపోవటం... అందర్నీ విజయ్ కాపాడటం. ఇదంతా మినిస్టర్ చేసాడు అని విజయ్ కి అర్థం అవ్వటం
క్లైమాక్స్ :
కేరళలో సాధారణ జీవితం గడుపుతున్న విజయ్ మళ్ళి తన పవర్ ఏంటో చూపించాలని తన ఫ్యామిలీ ని దారుణంగా చంపినా వాళ్ళ మీద పగ తీర్చుకోవటానికి ఆత్మ అనే పదం అడ్డం పెట్టుకుని ఒక్కొక్కర్నీ చంపుకుంటూ రావటంతో సినిమా ముగుస్తుంది.
కలిసోచ్చే అంశాలు :
- నైనిక - విజయ్ మధ్య వచ్చే సన్నివేశాలు
- జీ.వి.ప్రకాష్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్
- ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో యాక్షన్ సన్నివేశాలు
సినిమా ఫార్ములా :
విజయ్ ''పొలిసు'' సినిమా చూస్తుంటే బాష , నరసింహ నాయుడు, ఇంద్ర, గాయం 2 , మాస్టర్, రాఘవన్, లాంటి సినిమాలు గుర్తుకు వస్తాయి.
సినిమా ఎవరికీ నచ్చుతుంది :
- తమిల్ డబ్బింగ్ సినిమాలని ఇష్ట పడేవారికి ఈ సినిమా నచ్చుతుంది
- విజయ్ ''తుపాకి'' సినిమా ని ఇష్టపడే వారికీ ఈ సినిమా నచ్చుతుంది
ఫినిషింగ్ టచ్ : ఈ పొలిసు మరి ఓల్డ్ హే ...!
పొలిసు మూవీ రివ్యూ : 2.5/5.00