Review : Raja Cheyyi Vesthe
ఇలాంటి రొటీన్ సినిమాల్ని ఆడియన్స్ ఇష్టపడరు
Review : Raja Cheyyi Vesthe
Pradeep Chilukuri
Nara Rohit, Nandamuri Tarak Ratna, Isha Talwar
స్టోరీ లైన్ :
'' బ్రెయిన్ ని గన్ లాగ వాడితే ఆలోచనలు బులెట్లు గా దూసుకు వెళ్తాయి అని నమ్మే హీరో కి , తప్పు చెయ్యమని మా నాన్న చెప్పలేదు ... తప్పు చెయ్యవద్దు అని మా అమ్మ చెప్పలేదు ... నాకు తోచింది నేను చేసుకుంటూ పొతే జనం దాన్నే తప్పు అంటున్నారు అని ఫీల్ అయ్యే ఒక విలన్'' మధ్య జరిగిన డ్రామా నే ఈ రాజా చెయ్యే వేస్తే సినిమా మెయిన్ స్టోరీ లైన్.
స్టోరీ :
సిటీ లో ఎలాంటి నేరాలు చేసిన ఎవరికీ సాక్ష్యం దొరకుండా అందర్నీ శాషించే మాణిక్ (తారకరత్న) ని డైరెక్టర్ అవ్వాలని ఫిల్మ్ నగర్ లో తిరిగే రాజా రామ్ (నారా రోహిత్) చంపటానికి ప్లాన్ వేస్తాడు. చైత్ర (ఇషా తల్వార్) ని తొలిచూపులోనే చూసి రాజా రామ్ చైత్ర ని ఇష్టపడతాడు. మరోవైపు చైత్ర మాణిక్ ని చంపాలని ట్రై చేస్తూ వుంటుంది. అసలు డైరెక్టర్ అవ్వాలని సిటీకి వచ్చిన రాజా రామ్ కి మాణిక్ కి వున్నా లింక్ ఏంటి ...? చైత్ర మాణిక్ ని ఎందుకు చంపాలని అనుకుంటుంది. రాజా రామ్ డైరెక్టర్ అయ్యాడా..? అనేవి తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
కలిసోచ్చే అంశాలు :
- మాణిక్ క్యారెక్టర్ లో తారకరత్న ని స్క్రీన్ మీద చూపించిన ప్రజెంటేషన్
- సినిమా లో తారకరత్న ని అక్కడక్కడ ఎలివేట్ చేసిన సన్నివేశాలు
సినిమా ఫార్ములా : గోపీచంద్ ''వాంటెడ్'' , జూ.ఎన్టీఆర్ ''ఉసరవెల్లి''
విశ్లేషణ : తప్పు చేస్తే అడ్డు చెప్పేవాడు ఎవడు లేడు అని తనకి ఇష్టం వచ్చినట్టు వుండే విలన్ ని చంపటానికి చాలా మంది ట్రై చేస్తుంటారు. సినిమా డైరెక్టర్ అవ్వాలని సిటీ కి వచ్చిన హీరోకి తొలిచూపులోనే హీరొయిన్ ని లవ్ చేస్తే ఆ అమ్మాయి వేసిన ప్లాన్ లో హీరో విలన్ ని చంపటానికి సిద్దం అవ్వుతాడు. ఇలాంటి కథలు ఇప్పటివరుకు ఇండస్ట్రి లో చాలా వచ్చాయి .. గోపీచంద్ ''వాంటెడ్'' , జూ.ఎన్టీఆర్ ''ఉసరవెల్లి'' లాంటి కోవలోకి ఈ రాజా చెయ్యే వేస్తే సినిమా కూడా వస్తుంది. సినిమా స్టార్టింగ్ నుండి క్లైమాక్స్ వరుకు ఎక్కడ ఆడియన్స్ కి సినిమా చూస్తున్నాం అన్న ఫీల్ లేకుండా డైరెక్ట్ న్యారేషణ్ లో సీన్స్ వేసుకుంటూ వెళ్ళిపోయారు. సినిమా మొత్తం మీద తారకరత్న నే బాధ్యత అంత తీసుకుని ముందుకు నడిపిస్తునట్టు కనిపిస్తుంది కాని నారారోహిత్ క్యారెక్టర్ ఎక్కడ ఆడియన్స్ కి ఏ మాత్రం కనెక్ట్ అవ్వదు. సినిమా లో తారకరత్న కి సంబంధించిన సన్నివేశాలు వచ్చినప్పుడు మాత్రమే సినిమా చూస్తున్నాం అన్న ఫీలింగ్ వస్తుంది తప్ప మిగతాది అంత తేలిపోయింది. ఈ సినిమా ద్వారా తారకరత్న కి అన్ని విధాలుగా ప్లస్ అయిన హీరోగా నారారోహిత్ మాత్రం కాస్త లావు తగ్గాలిసిందే...
ఫినిషింగ్ టచ్ : సారీ ... ఇలాంటి రొటీన్ సినిమాల్ని ఆడియన్స్ ఇష్టపడరు
రాజా చెయ్యే వేస్తే రివ్యూ : 2.00/5.00