Top

Review : Rudhramadevi

రుద్రమ్మదేవి : హిస్టారికల్ డ్రామా

Source: General

By: Sify

Critic's Rating: 3/5

Friday 09 October 2015

Movie Title

Review : Rudhramadevi

Director

Gunasekhar

Star Cast

Anushka Shetty, Allu Arjun

స్టోరీ లైన్ (ప్లాట్ ) : కాకతీయ సామ్రాజ్యాన్ని కాపాడుకోవటం  కోసం రుద్రమ్మ దేవి చేసిన సాహసాల  సమూహమే సినిమా మూల కథ 

స్టోరీ : కాకతీయ  సామ్రాజ్యన్ని  63 ఏళ్లగా పరిపాలిస్తున్న రాజు గణపతి దేవుడు  (కృష్ణం రాజు ). ఆయన తర్వాత రాజ్యానికి  వారసులు లేరని బాధలో వుంటాడు. అదే సమయం లో  ఆయనకు చివరి సంతానంగా ఆడబిడ్డ పుడుతుంది. వారసుడు  లేని రాజ్యం అంటే అందరికి  చులకనగా చూస్తారు అని  మంత్రి శివ దేవయ్య  (ప్రకాష్ రాజ్ఆదేశం ప్రకారం  మగబిడ్డ  పుట్టాడు అని  అందరిని  నమ్మిస్తాడు. విషయం బయటికి రాకుండా  అతనికి   అన్ని విద్యలలో ఆరితేరేలా  తయారుచేస్తాడు. గణపతి దేవుడు దాయుదులైన హరిహర దేవుడు (సుమన్) , మురారి దేవుడు (ఆదిత్యరుద్రదేవ (అనుష్క ) ని చంపి సింహాసనం అధిరోహించాలని పధకాలు వేస్తుంటారు. మరో వైపు కాకతీయ రాజ్యం మీద శత్రువు శేషం పెట్టుకున్న దేవగిరి యువరాజు  మహా దేవ నాయకుడు (విక్రం జిత్ ) పగతో రగిలిపోతుంటాడు.జనం కోసం  బందిపోటు అయిన గోన గన్నారెడ్డి (అల్లు అర్జున్ ) కూడా కాకతీయ రాజ్యం మీద పగతో రగిలిపోతుంటాడు. ఇన్ని ఆటంకాలు  వున్నా కాకతీయ రాజ్యానికి  రుద్రదేవ (అనుష్క ) మగాడు కాదు అని  ఒక ఆడది అని  అందరికి తెలిసిపోతుంది. కాకతీయ సామ్రాజ్యం  నుండి  బహిష్కరణ  చేస్తారురుద్రదేవ  నుండి రుద్రమ్మ దేవిగా తెలిసిన తర్వాత దాయుదులు  ఎలా కాకతీయ సామ్రాజ్యన్ని  తన ఆధీనం లోకి తీసుకున్నారు...? గోన గన్నారెడ్డి  కి , రుద్రమ్మ దేవికి  వున్నా సంబంధం  ఏంటి...?  మహా దేవ నాయకుడు చిరకాల స్వప్నం నెరవేరిందా....? రుద్రమ్మ దేవి  తన రాజ్యాన్ని తిరిగి కాపాడుకోగలిగిందా అనేది  తెర మీద చూడాల్సిందే ...!  

స్క్రీన్ ప్లే : కథ బ్రిటిష్  కాలం లో ఫ్లాష్ బ్యాక్  రూపం  లో  స్టాట్ అవుతూ  కాకతీయ సామ్రాజ్యం లో  వారసులు లేరని  వారసుడు పుట్టాలని అందరు  ప్రార్ధనలు చేస్తుంటారు. కానీ మళ్ళి ఆడపిల్ల పుట్టటం వలన గణపతి దేవుడు  (కృష్ణం రాజు ) బాధపడతాడు. విషయం గమనించిన మంత్రి   శివ దేవయ్య (ప్రకాష్ రాజ్ ) నిజాని దాచి అందరికి  మగబిడ్డ పుట్టాడు అని పరిచయం చేస్తాడురుద్రమ్మ దేవి (అనుష్క ) గా నామకరణం చేసిన బయటికి మాత్రం  రుద్ర దేవ గా అన్ని విద్యలలో ఆరితేరి అయ్యేటట్టు చేస్తారు. రుద్ర దేవ పాలనా లో  అంత సంతోషంగా ఉంటున్న ప్రజలకి  కొన్ని సమస్యలు తెచ్చి పెడతాడు మహా దేవ నాయకుడు (విక్రం జిత్ ). కానీ అవన్నీ అధిగమించి అందరికి అండగా నిలబడుతుంది. గోన గన్నారెడ్డి (అల్లు అర్జున్ ) ప్రజల కోసం బందిపోటు గా మారి  ప్రజలకు మంచి చేస్తున్నా  కాకతీయ సామ్రాజ్యం  దృష్టిలో  మాత్రం ఒక గజదొంగ గా మిగిలిపోతాడు. , రుద్ర దేవ (అనుష్క ) తన స్నేహితుడు అయిన  చాళుక్య వీరభద్రుడు (రానా) కి  గోన గన్నారెడ్డి జాడ తెలుసుకుని  బంధించమని చెబుతుంది. తన తండ్రి  గణపతి  దేవుడు ఆపేసిన  ఏడు గోడల కట్టడాలని మళ్ళి పూర్తి చెయ్యటానికి సన్నహాలు చేస్తుంది.

ప్రాబ్లం  ఎస్టాబ్లిష్ మెంట్ : గణపతి దేవుడు దాయుదులైన హరిహర దేవుడు (సుమన్) , మురారి దేవుడు (ఆదిత్య ) కి  కాకతీయ సామ్రాజ్యం  సొరంగ మార్గం ద్వారా రాజ్యం లోకి వెళ్ళవచ్చు అన్న విషయం తెలుస్తుంది. కానీ దాని వెనకాల ఒక   రహస్యం వుంది  అని తెలుస్తుంది

కాకతీయ సామ్రాజ్యం  కొలువులో   చాళుక్య వీరభద్రుడు (రానాఒక కన్య ని చూసి మనస్సు పారేసుకుంటాడు. కన్య కోసం  సామ్రాజ్యం లో వెతుకుతూ  రుద్ర దేవ (అనుష్క ) చాళుక్య వీరభద్రుడు (రానా) కి చెప్పిన విషయం మర్చిపోతాడు. రుద్ర దేవ (అనుష్క) అతనికి గుర్తుకు చేస్తుంది.

ప్లాట్ పాయింట్ 1 : రుద్ర దేవ (అనుష్క ) కి ముక్తంబా (నిత్య మీనన్ ) కి పెళ్లి  ఖాయం చేస్తారు. హరిహర దేవుడు (సుమన్) , మురారి దేవుడు (ఆదిత్యవేసిన పధకం లో  నాగదేవుడు రుద్ర దేవ ని చంపేస్తే , గణపతి దేవుడు ని చంపుదామని ప్లాన్ వేస్తారు. సొరంగ మార్గం ద్వారా  రహస్యం తెలుసుకోవటానికి వెళ్ళిన నాగదేవుడు  (బాబా సెహగల్ ) చనిపోతాడు. రుద్ర దేవ (అనుష్క ) కి ముక్తంబా (నిత్య మీనన్ ) కి పెళ్లి  అయ్యిపోతుంది.

హరిహర దేవుడు (సుమన్) , మురారి దేవుడు (ఆదిత్య ) కుట్ర లో బాగంగా  ఒక పధకం వేసి  రుద్ర దేవ (అనుష్క ) అని అందరి ముందు చంపాలని ప్రయత్నం చేస్తారు. నింద  గోన గన్నారెడ్డి  మీద వేద్దామని అనుకుంటారు. కానీ గోన గన్నారెడ్డి  స్వయంగా వచ్చి  వాళ్ళు వేసిన పధకాని తిప్పికోడతాడు. విషయం తెలియని  రుద్ర దేవ (అనుష్కగోన గన్నారెడ్డి  ని బంధించమని  చాళుక్య వీరభద్రుడు (రానాకి చెబుతుంది. ప్రయత్నం లో చావు నుండి తప్పించుకున్న గోన గన్నారెడ్డి  రుద్ర దేవ (అనుష్క ) మీద సవాలు  విసురుతాడు.

                                             ఇంటర్వెల్ 

ముక్తంబా (నిత్యమినన్ ) కి రుద్ర దేవ (అనుష్క ) మగాడు కాదు అని తెలిసిన బయట పడకుండా రహస్యాని తనలోనే దాచుకుంటుంది. చాళుక్య వీరభద్రుడు (రానామనస్సు పారేసుకున్న అమ్మాయి ఎవరో  తెలిసిపోతుంది. రుద్ర దేవ తన స్నేహితుడి తో  జీవితం రాజ్యానికి అంకితం అని చెబుతుంది. చాళుక్య వీరభద్రుడు (రానాబాధ తో అక్కడి నుండి వెళ్ళిపోతాడు.

మధానిక (హంస నందిని ) కాకతీయ సామ్రాజ్యం  లో వున్నా రహస్యాలను  మహా దేవ నాయుడు కి చేరవేస్తూ వుంటుంది. సమయం  లో మధానిక కి అసలు విషయం తెలుస్తుంది. విషయాన్ని హరిహర దేవుడు (సుమన్) , మురారి దేవుడు (ఆదిత్య ) చెబుతుంది

ప్లాట్ పాయింట్ 2 : కాకతీయ  సామ్రాజ్యన్నికి  రుద్రమ్మ దేవి (అనుష్కని పట్టాభిషేకం  చేద్దామని అనుకునే సమయం లో  అక్కడ ప్రజలంతా  ఒక ఆడది  మాకు రాజుగా వద్దు అని  చెప్పటం తో  అందరు సమస్యలో పడతారు. పెద్దల నిర్ణయం ప్రకారం  రుద్రమ్మ దేవి ని రాజ్య బహిష్కరణ చేస్తారు. రుద్రమ్మ దేవి (అనుష్క ) రాజ్యం విడిచి వెళ్ళిపోతుంది.

రుద్రమ్మ దేవి  రాజ్యం  విడిచిన తర్వాత  హరిహర దేవుడు (సుమన్) , మురారి దేవుడు (ఆదిత్య ) ఇద్దరు  కాకతీయ రాజ్యాన్ని వాళ్ళ ఆదినం లోకి తీసుకుంటారు.

కాకతీయ  రాజ్యన్నికి వారసుడు  లేరు , ఇన్ని రోజులు  మోసం చేసారు అని  మహా దేవ నాయకుడు (విక్రం జిత్ ). కాకతీయ రాజ్యం  మీద యుద్ధం ప్రకటిస్తాడు. విషయం తెలుసుకున్న  రుద్రమ్మ దేవి తన స్నేహితుడు చాళుక్య వీరభద్రుడు (రానాసహయం  చెయ్యమని కోరుతుంది

ప్రి-క్లైమాక్స్ : మరో వైపు  కాకతీయ సామ్రాజ్యం  లో వున్నా ప్రజలని  హింసించటం  మొదలు పెడతారు  సామంత రాజులు  అంత కలసి. దాంతో  ప్రజలు అంత రుద్రమ్మ దేవి కోసం వస్తారు. ప్రజలు పడుతున్న ఇబ్బందులను చూసిన  రుద్రమ్మ దేవి తన రాజ్యాన్ని తిరిగి కాపాడుకోవటం కోసం వెళ్తుందిరుద్రమ్మ దేవి  కి సపోర్ట్ గా  గోన గన్నారెడ్డి  తన సైన్యం తో వచ్చి  సహాయం చేస్తాడు

క్లైమాక్స్  : మహా దేవ నాయుడు (విక్రం జిత్ ) తో  యుద్ధానికి  సిద్దం అవుతుంది రుద్రమ్మ దేవి. యుద్ధం లో మహా దేవ నాయుడు  ఓడిపోతాడు. తన తండ్రికి ఇచ్చిన మాటని  రుద్రమ్మ దేవి నిలబెడుతుంది.

కలిసోచ్చే అంశాలు :

  • అనుష్కఅల్లు అర్జున్ నటన 
  • ప్రకాష్ రాజ్  అవుట్ స్టాండింగ్  పెర్ఫార్మన్స్ 
  • కాకతీయ  సామ్రాజ్యం విజువల్స్ 
  • ఆర్ట్ డిపార్టమెంట్  & సినిమాటోగ్రఫి పనితీరు 

సినిమా ఎవరికీ నచ్చుతుంది :

  • చరిత్ర  గురించి  తెలుసుకోవాలని ఆసక్తి చూపేవాళ్ళకి సినిమా నచ్చుతుంది
  • బాహుబలి  సినిమా  చూసిన ప్రతి ఒక్కరికి సినిమా నచ్చుతుంది

ఫినిషింగ్ టచ్ : చరిత్ర ని మరోసారి గుర్తు చేస్తుంది 

రేటింగ్ : 3.25 /5 

recent reviews

Keshu Ee Veedinte Naadhan

Time pass comedy entertainer

Plan Panni Pannanum

Average comedy entertainer

Velan

Decent rural family entertainer

Meow

Soubin Shahir and Mamta Mohandas shine in this conventional film

Read more

galleries