Review : Run movie
వేగం లేని థ్రిల్స్ గురి చేసే రన్
Review : Run movie
Anil Kanneganti
Sandeep kishan, Anisha Ambrose
స్టోరీ లైన్ : మిడిల్ క్లాస్ లైఫ్ లో బ్రతికే ఒక యువకుడి కి టైం వలన అతనికి ఎదురైనా జయాపజయాల సముహరమే ఈ రన్ సినిమా మూల కథ
స్టోరీ :
ఉద్యోగం కోల్పోయి కొత్త జాబ్ కోసం వెతికే ప్రయత్నంలో సంజయ్ (సందీప్ కిషన్) తన చిన్ననాటి ఫ్రెండ్ అయిన అమూల్య (అనీష అంబ్రోస్) ని ప్రేమిస్తూ వుంటాడు. తన అక్క భర్త కట్నం బకాయిల్లో లక్ష రూపాయలు ఇవ్వటం కోసం టైంకి వడ్డీతో సహా డబ్బు ఇవ్వకపోతే వడ్డీ ఇవ్వని వాడి ప్రాణాలు తీసి, వాడి పార్ట్స్ అమ్ముకునైనా తన అప్పు వసూలు చేసే వడ్డీ రాజా (బాబీ సింహా) దగ్గర సంజయ్ అప్పు తీసుకుంటాడు. సంజయ్ కీ ఉద్యోగం లేదని ఒక్క కారణం వలన అమూల్య ఫాదర్ శ్రీనివాసులు గారు(కాశీ విశ్వనాథ్) సంజయ్ ని తన ఇంటి అల్లుడిగా ఒప్పుకోడు. వడ్డీ రాజా దగ్గర తీసుకున్న డబ్బుని తిరిగి ఇద్దామని వెళ్తున్న సమయం లో సంజయ్ దగ్గర వున్నా డబ్బులు ఎవరో కొట్టేస్తారు. మరో వైపు సంజయ్ కోసం అమూల్య ఇంట్లో నుండి వచ్చేస్తుంది. అసలు సంజయ్ దగ్గర డబ్బులు కొట్టేసింది ఎవరు...? వడ్డీ రాజా సంజయ్ మీద ఏలా రియాక్ట్ అయ్యాడు ...? సంజయ్ ఎవరి ద్వారా అమూల్య ని దక్కించుకున్నాడు...? అనేది తెలియాలంటే తెర మీద చూడాల్సిందే...!
స్క్రీన్ ప్లే :
- రన్ సినిమా సందీప్ కిషన్ పాయింటాఫ్ వ్యూ లో వాయిస్ ఓవర్ లో స్టార్ట్ అవ్వుతూ అతని కంపెనీ లో ఉద్యోగం ఏలా పోయిందో చూపిస్తూ ముందుకు వెళ్తుంది.
- వడ్డీ రాజా దగ్గరికి సంజయ్ వెళ్ళటం. అతని దగ్గర నుండి డబ్బులు తీసుకోవటం. వడ్డీ రాజా పెట్టె కండిషన్స్ కి సంజయ్ ఓకే చెప్పటం
- వడ్డీ రాజా ఎలాంటి వ్యక్తో విజువల్స్ లో చూపించటం
- సంజయ్ ఉద్యోగం వెతుకుంటూ వుండటం. సిటీ లో ఎక్కడికి వెళ్ళిన ఉద్యోగం రాకపోవటం. వడ్డీ రాజా కి డబ్బులు ఏలా తిరిగి ఇవ్వాలో ఆఒక్జ ఆలోచనలో పడటం
- సంజయ్ తన చైల్డ్ హుడ్ ఫ్రెండ్ అమూల్య తో వున్నా లవ్ స్టొరీ ఫ్లాష్ బ్యాక్ లో చెప్పటం.
- సంజయ్ - అమూల్య మధ్య లవ్ స్టొరీ మోంటేజ్ కట్స్ లో చూపిస్తూ స్టోరి ముందుకు వెళ్ళటం.
- సంజయ్ -అమూల్య ప్రేమ వ్యవహారం అమూల్య తండ్రి శ్రీనివాసులు గారు(కాశీ విశ్వనాథ్) కి తెలియటం. సంజయ్ కి ఉద్యోగం లేదని ఒప్పుకోకపోవటం.
- వడ్డీ రాజా సంజయ్ కి ఫోన్ చెయ్యటం...ఫోన్ లిఫ్ట్ చెయ్యకుండా సంజయ్ తప్పించుకోవాలని ట్రై చేస్తూ వుండటం.
- వడ్డీ రాజా కి డబ్బులు ఇవ్వటం కోసం సంజయ్ తన ఫ్రెండ్ దగ్గర డబ్బులు తీసుకోవటం. మరో వైపు అమూల్య ఇంట్లో నుండి సంజయ్ కోసం వచ్చేయిటం.
- సంజయ్ కోసం ఎదురుచూస్తున్నా అమూల్య దగ్గరకి ఒక దొంగ వచ్చి అమూల్య మెడ లో చైన్ దొంగతనం చెయ్యటం.
- సంజయ్ వడ్డీ రాజా కి కోసం ఇవ్వాల్సిన డబ్బు ని దారిలో ఒకరు దొంగిలించటం.
- అమూల్య తండ్రి తన కూతుర్ని ని కిడ్నాప్ చేసాడు అని సంజయ్ మీద కేసు పెట్టటం.
- వడ్డీ రాజా కి ఇవ్వాల్సిన డబ్బు కోసం సంజయ్ తన ఫ్రెండ్స్ అందర్నీ అడగటం. మరో వైపు వడ్డీ రాజా ఒక అనుకోని సంఘటన లో అమూల్య ని కిడ్నాప్ చెయ్యటంతో సినిమా మిడ్ పాయింట్ కి చేరుకుంటుంది.
ఇంటర్వెల్
- సంజయ్ హోటల్ లో బిల్ కట్టటానికి కూడా డబ్బులు లేకపోవటం
- తనకి డబ్బులు ఇవ్వాల్సిన వ్యక్తీ కి వడ్డీ రాజా కి కాల్ చెయ్యటం. నీ లవర్ ని కిడ్నాప్ చేశాను అని చెప్పటం. నాకు ఎలాంటి లవర్ లేదు అని చెప్పటం
- SI బ్రహ్మాజీ (పద్మావతి ) అమూల్య కి గురించి ఎంక్వయిరీ చెయ్యటం.
- మధు - ప్రవీణ్ ఇద్దరు దొంగలు వాళ్ళు కొట్టేసిన వాటిని పంచుకుంటూ ఒక ప్లాన్ వెయ్యటానికి సిద్దం అవ్వటం
- పోసాని కొడుకు ని యాక్సిడెంట్ నుండి సంజయ్ కాపాడటం
ప్రీ- క్లైమాక్స్ : మధు - ప్రవీణ్ వేసిన ప్లాన్ ఫెయిల్ అవ్వటం తో ఆ ఇన్సిడెంట్ లో ఉహించిన రీతిలో వడ్డీ రాజా చనిపోవటం.
క్లైమాక్స్ : పోసాని కొడుకుని కాపాడిన సంజయ్ కి పోసాని జాబ్ ఇస్తాను అని మాట ఇవ్వటం. వడ్డీ రాజా నుండి కొట్టేసిన కారులో తప్పించుకున్న మధు -ప్రవీణ్ సంజయ్ కంట పడటం... వాళ్ళని కొట్టి వాళ్ళ దగ్గర నుండి సంజయ్ డబ్బులు తీసుకోవటం ...అదే కారు లో వున్నా అమూల్య ని విడిపించుకోవటంతో సినిమా ముగుస్తుంది.
కలిసోచ్చే అంశాలు :
- అనీష అంబ్రోస్ స్క్రీన్ ప్రజెంటేషన్
- బాబీ సింహ పెర్ఫార్మన్స్
- బి. రాజశేఖర్ సినిమాటోగ్రఫీ
- సాయి కార్తీక్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్
- అక్కడక్కడ ఆడియన్స్ నవ్వించే సన్నివేశాలు
సినిమా ఫార్ములా :
- 2013 లో తమిళం/మలయాళంలో రిలీజ్ అయిన ‘’నేరమ్’’ సినిమా ని తెలుగు లో ‘’రన్’’ రీమేక్ చేసారు
సినిమా ఎవరికీ నచ్చుతుంది :
- తమిళ్ రీమేక్ సినిమాలని ఇష్టపడే వారికీ ఈ సినిమా నచ్చుతుంది.
- సందీప్ కిషన్ ‘’టైగర్’’ సినిమా ని ఇష్టపడే వారికీ ఈ సినిమా నచ్చుతుంది.
- సందీప్ కిషన్ , బాబీ సింహ అభిమానులకి ఈ సినిమా నచ్చుతుంది.
ఫినిషింగ్ టచ్ : వేగం లేని థ్రిల్స్ గురి చేసే రన్
రన్ మూవీ రివ్యూ : 2.75 /5.00