Top

Review : sarainodu movie

ఈ సరైనోడు కేవలం మాస్ ఆడియన్స్ కి మాత్రమే

Source: General

By: IFY LLC

Critic's Rating: 3/5

Friday 22 April 2016

Movie Title

Review : sarainodu movie

Director

Boyapati Srinu

Star Cast

Allu Arjun, Rakul Preet Singh, Catherine Tresa

స్టోరీ లైన్ :  సమాజం లో తప్పు జరిగితే  సహించని ఒక యువకుడి  లైఫ్ లో చోటు చేసుకున్న పరిణామాల సముహరమే సరైనోడు  సినిమా కథ .

స్టోరీ :

అయిల్ కంపెనీ కోసం  వ్యవసాయ రైతుల దగ్గర భూములను దక్కించుకోవటం లక్ష్యం  పెట్టుకున్న వైరం ధనుష్(ఆది పినిశెట్టి) తన ఆధిపత్యాని కొనసాగిస్తుంటాడు. మిలటరీ లో పనిచేసే గణ (అల్లు అర్జున్ ) తన ఉద్యోగానికి  స్వస్తి చెప్పి  సొసైటి లో ప్రజలకి జరిగే సమస్యలు వస్తే గుణ అండగా వుంటాడు. తన నియోజకవర్గం లో ఎమ్మెల్యే హన్సిత రెడ్డి (కేథరిన్ ) ని చూసి గణ ప్రేమలో పడతాడు. గొడవలు మానేస్తే  పెళ్లి చేసుకుంటాను గణ నుండి ఎమ్మెల్యే హన్సిత రెడ్డి మాట తీసుకునే సమయం లో మహాలక్ష్మి(రకుల్ ప్రీత్ సింగ్) ను వైరం ధనుష్  గ్యాంగ్ నుండి  కాపాడతాడుఅసలు  మహాలక్ష్మి కి  వైరం ధనుష్ వున్నా సంబందం ఏంటి ...?  మహాలక్ష్మి ని ఎందుకు చంపాలని అనుకుంటున్నారు ...? మహాలక్ష్మి కోసం వైరం ధనుష్ ని గణ  ఏలా ఎదిరించాడు...? అనేది  తెలియాలంటే  సినిమా చూడాల్సిందే

స్క్రీన్ ప్లే

 • వైరం ధనుష్(ఆది పినిశెట్టి) అయిల్ కంపెనీ కోసం  వ్యవసాయ రైతుల దగ్గర భూములను స్వాధీనం చేసుకుంటూ వైరం ధనుష్ ఎలాంటి వ్యక్తో  చూపిస్తూ సినిమా ముందుకు వెళ్తుంది.
 • గణ ఎలాంటి  వ్యక్తో  జనాలకి  ఎవడైనా అన్యాయం జరిగితే ఏలా రియాక్ట్ అవ్వుతాడో  గణ (అల్లు అర్జున్ ) క్యారెక్టర్ అని  చూపించటం.
 • తన నియోజకవర్గం లో ఎమ్మెల్యే హన్సిత రెడ్డి (కేథరిన్ ) ని చూసి గణ ప్రేమలో  పడటం 
 • గణ కి  వున్నా దైర్యం , అతని క్యారెక్టర్ ని చూసి  ఎమ్మెల్యే హన్సిత రెడ్డి గణ ని లవ్ చెయ్యటం 
 • కొన్ని కండిషన్స్ మీద  గణ తో  ఎమ్మెల్యే హన్సిత రెడ్డి పెళ్ళికి ఒప్పుకునే ప్రయత్నం లో  వైరం ధనుష్ మనుషులు  మహాలక్ష్మి  (రకుల్ ప్రీత్ సింగ్) ని చంపాలని ప్రయత్నం చెయ్యటం. వైరం ధనుష్ మనుషులు  నుండి మహాలక్ష్మి ని కాపాడటంతో  సినిమా మిడ్ పాయింట్ కి చేరుకుంటుంది.

ఇంటర్వెల్  

 • మహాలక్ష్మి  ని ఎందుకు చంపాలని  ట్రై చేస్తున్నారో  మహాలక్ష్మి  తన ఊరి  కి వున్నా సమస్యని  చెప్పటం
 • మహాలక్ష్మి  ఉరిని, నాశనం చేసిన వైరం ధనుష్ ని  ఎలాగైనా బుద్ది చెబుతాను అని గణ  మహాలక్ష్మి కి మాట ఇవ్వటం 
 • వైరం ధనుష్ కి గణ తన పవర్ ఏంటో  చూపించటం 

క్లైమాక్స్ గణ తనకి వున్నా తెలివితో  వైరం ధనుష్ చేసిన  తప్పులు అన్ని  బయట పెట్టి అతని అంత చెయ్యటంతో   సినిమా ముగుస్తుంది.

కలిసోచ్చే అంశాలు :

 • అల్లు అర్జున్  స్క్రీన్  మీద ప్రజెంటేషన్  ( మాస్  లుక్ అప్పిరియన్స్
 • ఇంటర్వెల్  బాంగ్  దగ్గర వచ్చే సన్నివేశాలు
 • రిషి పంజాబీ సినిమాటోగ్రఫీ

సినిమా ఫార్ములా :

 • సరైనోడు  సినిమా చూస్తుంటే  బాలకృష్ణ  ''లెజెండ్'' , రవితేజ  ''భద్ర''  సినిమాలకి  ''సరైనోడు''  సినిమాకి  పోలికలు కనిపిస్తాయి.

సినిమా ఎవరికీ నచ్చుతుంది

 • మాస్ ఆడియన్స్  సినిమా నచ్చుతుంది  
 • అల్లు అర్జున్  అభిమానులకి సినిమా నచ్చుతుంది
 • లెజెండ్ , సింహ, దమ్ము , భద్ర  సినిమాలని చూసిన వారికి సినిమా నచ్చుతుంది 

విశ్లేషణ  : ''ఒక  ఉరిలో  హీరోయిన్ కష్టాల్లో ఉంటే హీరొయిన్ కోసం ఉరికి వచ్చిన  హీరో  విలన్స్ నుండి  హీరొయిన్  ని  కాపాడటం ... విషయం తెల్సిన మెయిన్ విలన్  హీరోయిన్ ఫ్యామిలీ కి సంబంధించిన వాళ్ళని దారుణంగా  చంపటం. విషయం  తెలుసుకున్న హీరో  విలన్ ని అంత మొందిచటం'' ఇది సరైనోడు  స్టొరీ ... స్టొరీ  ని వింటుంటే  సినిమా చూసే ఆడియన్స్ కి  ''భద్ర, లెజెండ్'' సినిమాలు గుర్తుకు వస్తాయి. ఎందుకంటే రెండు సినిమాలు అప్పట్లో సూపర్ హిట్ అయ్యాయి... ''భద్ర , లెజెండ్'' సినిమాల  మైకం లో నుండి డైరెక్టర్  బోయపాటి శ్రీను ఇంకా బయటికి రాలేదు ...అందుకే ''భద్ర, లెజెండ్ '' సినిమాల నుండి పుట్టికొచ్చిన సినిమానే సరైనోడు. కేవలం అల్లు అర్జున్  మాస్ లుక్ ని మాస్ ఆడియన్స్ కి మాత్రమే పరిమితం చేసిన డైరెక్టర్ బోయపాటి  శ్రీను ఒక మాములు  కథ ని ఎంచుకుని  బాక్స్ ఆఫీస్ వద్ద సక్సెస్ ని అందుకోలేకపోయారు

ఫినిషింగ్ టచ్ : సరైనోడు కేవలం మాస్ ఆడియన్స్ కి మాత్రమే 

సరైనోడు  మూవీ రివ్యూ : 2.75/5.00 

recent reviews

Keshu Ee Veedinte Naadhan

Time pass comedy entertainer

Plan Panni Pannanum

Average comedy entertainer

Velan

Decent rural family entertainer

Meow

Soubin Shahir and Mamta Mohandas shine in this conventional film

Read more

galleries