Review : Sardaar Gabbar Singh
కేవలం పవన్ కళ్యాణ్ అభిమానులకి మాత్రమే ... !
Review : Sardaar Gabbar Singh
K. S. Ravindra
Pawan kalyan , Kajal Agarwal
స్టొరీ లైన్ :
రతన్ పూర్ అనే ఉరి మీద ఆధిపత్యం చలాయించే రాజకుటుంబానికి చెందిన భైరవ్ సింగ్ ని సర్దార్ గబ్బర్ సింగ్ అనే పోలీసాఫీసర్ ఏలా ఎదిరించి రతన్ పూర్ ప్రజలకి ఏలా విముక్తి ఇచ్చాడో అనేది ఈ సర్దార్ గబ్బర్ సింగ్ మూల కథ
స్టొరీ :
రాజకుటుంబానికి చెందిన భైరవ్ సింగ్ (శరద్ కెల్కర్) మూడు రాష్ట్రాల సరిహద్దులను కలుపుకొని ఉన్న రతన్ పూర్ ప్రాంతంలోని సహజ వనరులను మీద కన్ను పడటంతో ఆ ప్రాంత ప్రజల దగ్గర నుండి అక్రమంగా తీసుకుంటాడు. భైరవ్ సింగ్ చేస్తున్న అక్రమాలకి రతన్ పూర్ వచ్చిన పోలీసాఫీసర్ అయిన సర్దార్ గబ్బర్ సింగ్ (పవన్ కళ్యాణ్) ఏలా అడ్డుకున్నాడు...? రతన్ పూర్ రాజకుటుంబానికి చెందినా రాజ కుమారి అర్షిని (కాజల్) కి భైరవ్ సింగ్ కి వున్నా సంబంధం ఏంటి...? అనేవి తెలియాలంటే సినిమా చూడాల్సిందే...
స్క్రీన్ ప్లే :
- సర్దార్ సినిమా రతన్ పూర్ విలేజ్ లో ఓపెన్ అయ్యి ఆ విలేజ్ కి వున్నా సమస్యని చూపిస్తూ ముందుకు వెళ్తుంది. రాజకుటుంబానికి చెందిన భైరవ్ సింగ్ రతన్ పూర్ ప్రజల దగ్గర నుండి భూములని అన్యాయం గా లాక్కుని వాటిని గనులుగా మార్చి వేస్తాడు.
- హైదరబాద్ లో పనిచేసే సర్దార్ గబ్బర్ సింగ్ కి రతన్ పూర్ కి టాన్స్ ఫర్ చేస్తారు.
- రతన్ పూర్ వచ్చిన సర్దార్ గబ్బర్ సింగ్ అక్కడ పరిస్థితులను అర్థం చేసుకుంటూ సైలెంట్ గా వుంటాడు.
- రతన్ పూర్ రాజకుటుంబానికి చెందిన అర్షిని (కాజల్) చూసి సర్దార్ ప్రేమ లో పడతాడు.
- అర్షిని (కాజల్) సర్దార్ ముందు రతన్ పూర్ యువ రాణి లాగ కాకుండా ఒక సామాన్య యువతీ లాగ నటిస్తుంది.
- రతన్ పూర్ లో స్కూల్ ని వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు మార్చివేస్తే మళ్ళి దాన్ని స్కూల్ లాగ మార్చటానికి సర్దార్ తన బలాన్ని వాళ్ళకి చూపిస్తాడు.
- రతన్ పూర్ రాజా కుటుంభం మీద ఉన్న పగ ఎలాంటిదో ఆ రాజమహల్ ని కొనటానికి వచ్చిన వాడికి ఫ్లాష్ బ్యాక్ రూపంలో బైరవ సింగ్ చెబుతాడు.
- రతన్ పూర్ లో బైరవ సింగ్ కి సంబంధించిన ప్రతి విషయంలో సర్దార్ తన పవర్ ఏంటో చూపిస్తూ వస్తాడు.
- రతన్ పూర్ లో జరుపుకునే పండగ లో రతన్ పూర్ యువ రాణి అర్షిని (కాజల్) ని చూసి బైరవ సింగ్ అర్షిని మీద ఆశ పడతాడు.మరో వైపు ఇన్ని రోజులు ఒక సామాన్య యువతీ గా తన ముందు నటించిన అర్షిని (కాజల్) రతన్ పూర్ యువరాణి అని తెలిసి షాక్ తింటాడు.
- బైరవ సింగ్ రతన్ పూర్ ప్రజల మీద ఇబ్బందులు ఎక్కువ అవ్వుతున్నాయి అని తెలుసుకున్న సర్దార్ బైరవ సింగ్ మీద తిరగబడటంతో సినిమా మిడ్ పాయింట్ కి చేరుకుంటుంది.
ఇంటర్వెల్
- యువ రాణి అర్షిని (కాజల్) మీద వున్నా ఇష్టం తో బైరవ సింగ్ అర్షిని ని పెళ్ళిచేసుకోవలనే ఉద్దేశంతో వుంటాడు.
- తన ప్రేమించిన అమ్మాయి యువరాణి అని తెలిసిన సర్దార్ ఆమెకు దూరంగా వుండాలని ప్రయత్నం చేస్తుంటాడు.
- యువ రాణి అర్షిని (కాజల్) సర్దార్ కి దగ్గర అవ్వుదాం అని ప్రయత్నం చేస్తుంటే సర్దార్ పట్టించుకోకుండా సైలెంట్ గా వుంటాడు.
- రతన్ పూర్ రాజ్ మహల్ మీద ఇన్వెస్ట్ చేసే బిజినెస్ పర్సన్స్ కోసం సర్దార్ రతన్ పూర్ యువరాణి కి సహాయం చెయ్యటం
- సర్దార్ - యువ రాణి అర్షిని (కాజల్) ఇద్దరు ప్రేమించుకుంటున్నారు అన్న విషయం బైరవ సింగ్ కి తెలుస్తుంది.
- బైరవ సింగ్ వేసిన పధకం ప్రకారం సర్దార్ - యువ రాణి అర్షిని ప్రేమ వ్యవహారం అర్షిని ని పెంచిన మహారాజ్ బానిస అయిన హరి నారాయణ (ముకేష్ రుషి) కి తెలుస్తుంది.
- సర్దార్ - యువ రాణి ప్రేమ ని హరి నారాయణ ఒప్పుకోకపోవటంతో సర్దార్ కులం గురించి మాట్లాడతాడు.
- బైరవ సింగ్ వేసిన ప్లాన్ లో సర్దార్ ఒక అవినీతి పరుడు అని నిరూపిస్తాడు. దాంతో ఆతని ఉద్యోగం పోతుంది.
ప్రీ - క్లైమాక్స్ : రతన్ పూర్ కుటుంబాం మీద సమస్యలు తెచ్చి యువరాణి అర్షిని చేతే పెళ్ళికి ఒప్పుకునేలా బైరవ సింగ్ చేస్తాడు.
క్లైమాక్స్ : యువరాణి అర్షిని మీద వున్నా ఇష్టంతో ఆమెని బైరవ సింగ్ నుండి కాపాడి అతనికి బుద్ది చెప్పి రతన్ పూర్ కి విముక్తి కలిపించటంతో సినిమా ముగుస్తుంది
కలిసొచ్చే అంశాలు :
- సాయి మాధవ్ రాసిన పంచ్ డైలాగ్స్
- దేవిశ్రీప్రసాద్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ & మ్యూజిక్
- సినిమాటోగ్రఫీ అర్ధర్ ఎ.విల్సన్ పనితనం
- బ్రహ్మకడలి ఆర్ట్ వర్క్
- రామ్ -లక్ష్మణ్ కంపోజ్ చేసిన యాక్షన్ సన్నివేశాలు
- రాజకుమారిగా స్క్రీన్ మీద కాజల్ ని ప్రజెంటేషన్ చేసిన విధానం
సినిమా ఫార్ములా : సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా చూస్తుంటే రవితేజ ''కిక్ 2'' , మహేష్ బాబు ''ఆగడు'' & ''ఖలేజా'' సినిమాలు గుర్తుకు వస్తాయి.
సినిమా ఎవరికీ నచ్చుతుంది :
- పవర్ స్టార్ అభిమానులకి ఈ సినిమా నచ్చుతుంది.
- గబ్బర్ సింగ్ సినిమా చూసిన ప్రతి ఒక్కరికి ఈ సినిమా నచ్చుతుంది.
ఫినిషింగ్ టచ్ : కేవలం పవన్ కళ్యాణ్ అభిమానులకి మాత్రమే ... !
సర్దార్ గబ్బర్ సింగ్ రివ్యూ : 2.75 /5.00