Top

Review : Sher

షేర్ : ఆడియన్స్ మీద రివెంజ్

Source: General

By: SIfy

Critic's Rating: 3/5

Friday 30 October 2015

Movie Title

Review : Sher

Director

Mallikarjun

Star Cast

Kalyan Ram, Sonal Chauhan, Brahmanandam

తెలుగు సినిమా చరిత్ర లో గత పదిహేను ఏళ్లుగా నడుస్తున్న ఫార్ములాని  పాటిస్తూ వస్తున్నా వాటిలో  కళ్యాణ్ రామ్ షేర్ కూడా చేరింది. తెలుగు సినిమాలు ఇంతే వుంటాయి అని మరో సారి షేర్రూపం లో డైరెక్టర్ మల్లికార్జున నిరూపించారు.1990  సంవత్సరం నుండి స్టార్ట్ అయ్యిన రివెంజ్ పాయింట్స్  వస్తున్నే వున్నాయి. అన్నయ్య ని చంపేస్తే తమ్ముడు రివెంజ్ తీసుకోవటం , తల్లిని చంపేస్తే కొడుకు రివెంజ్ , తండ్రి ని చంపేస్తే కొడుకు రివెంజ్ ,ఫ్రెండ్ ని చంపేస్తే తన ఫ్రెండ్ ని చంపిన వాళ్ళ మీద రివెంజ్ , ఫ్యామిలీ లో ఎవరైనా  ఒకరి చేత చంపబడితే రివెంజ్ తీసుకోవటానికి ఎవడో ఒకడు ఎక్కడి నుండో మొదలుపెడతాడు. ఇలా చెప్పుకుంటూ పొతే చాలా వున్నాయి.మనం కూడా అదే ఫార్ములా ని పాటిస్తే తప్పు ఏముంది అన్నట్టు డైరెక్టర్ మల్లికార్జున , కళ్యాణ్ రామ్ తో షేర్ ని తీసి ఆడియన్స్ అందరూ  డైరెక్టర్ మీద రివెంజ్ తీర్చుకోవటానికి కారణం అయ్యాడు. పటాస్ సినిమా లో  కళ్యాణ్ రామ్ ని చూసిన ఆడియన్స్ కి కళ్యాణ్ రామ్ కి ఇంక తిరుగులేదు  అని అనుకున్నారు. కానీ కళ్యాణ్ రామ్ ని షేర్ లో చూసి అసలు కళ్యాణ్ రామ్ కి కథలు సెలెక్ట్ చెయ్యటం కూడా సరిగ్గా రాదు ఏమో అని క్లియర్ గా తెలిసిపోతుంది. తెలుగు సినిమా ని మల్లికార్జున 2015 నుండి 1980 లోకి తీసుకు వెళ్ళారు

కథ లో ఏలాంటి మెలికలు లేకుండా హీరో ని చూపించేటప్పుడు యాక్షన్ సీన్ , ఇంటర్వెల్ ముందు యాక్షన్ సీన్ , సినిమా ముగింపు లో యాక్షన్ సీన్ వుండాలని రాసుకున్నా డైరెక్టర్ మల్లికార్జున క్యారెక్టర్స్ కి ఇవ్వవలసిన కనీస బాధ్యత ఇవ్వకుండా  పాత చింత కాయ పచ్చడి పద్ధతి లో తీసుకుంటూ వెళ్ళిపోయారు. కామెడీ పండిచాలని  మల్లికార్జున చేసిన ప్రయత్నం బెడిసికొట్టింది.ప్యాడింగ్ ఆర్టిస్ట్ లు వున్నా వాళ్ళని ఏలా వాడుకోవాలో  తెలియక కేవలం కళ్యాణ్ రామ్ మీదే అన్ని కోణాల్లో చూపించటానికి ట్రై చేసాడు. కామెడీ రాని వాళ్ళతో కూడ కామెడీ చెయ్యిస్తే ఏలా వుంటుందో సినిమా లో కళ్యాణ్ రామ్ ని చూస్తే అర్థం అవుతుంది. సినిమా స్టార్టింగ్ లో కళ్యాణ్ రామ్ తండ్రి గా రావు రమేష్ కనిపిస్తే, మళ్ళి  సినిమా పది నిమిషాల్లో అయ్యిపోతుంది అనగా కనిపిస్తాడు. అర్థం పర్థం లేని విధంగా రాసుకున్నా  స్క్రీన్ ప్లే  లో  కళ్యాణ్ రామ్ ని ఒక కీలు బొమ్మ చేసి మల్లికార్జున ఆడించాడు. ప్రత్యర్ధులు తమ్ముడు ని చంపేస్తే అన్నయ్య రివెంజ్  తీసుకోవటం , అసలు తమ్ముడికి , అన్నయ్య కి వున్నా సెంటి మెంట్ ని వర్క్ అవుట్ చెయ్యలేదు. బ్రహ్మానందం , యం.యస్ నారాయణ్ , అలీ , 30 ఇయర్స్ పృద్వీ  లాంటి ఆర్టిస్ట్ లు వున్నా  కామెడీ పండలేదు. సోనాలి చోహన్ స్క్రీన్ మీద తన అందాలని చూపించినా  ఆడియన్స్ కి కనెక్ట్ అవ్వలేకపోయింది.

పటాస్ సినిమా ముందే షేర్ సినిమా షూటింగ్ పూర్తి అవ్వటం , సినిమాని పటాస్ కి ముందు రిలీజ్ చేస్తే  సినిమా గురించి ఎవరూ పట్టించుకోరు. కేవలం పటాస్ సినిమా లో కళ్యాణ్ రామ్ ని ఒక సరికొత్త మాస్ రూపం లో చూసిన ఆడియన్స్ తదుపరి సినిమా లో ఇంక బాగ చేస్తాడు అని నమ్మకం తో వస్తారు. అలా వచ్చిన వారికీషేర్సినిమా వెండి తెర మీద గర్జించకుండా ఆడియన్స్ డైరెక్టర్ మీద గర్జించేలాగ  చేసారు

సాంకేతక నిపుణులు విషయానికి వస్తే తమన్ తన సంగీత స్వరాలూ సినిమా లో అంతగా ఆడియన్స్ ని మోప్పించలేదు. తమన్ తన పాత సినిమాల్లో వచ్చే మ్యూజిక్ ని కొంచం మార్చి చేసినట్టు అనిపిస్తుంది. సినిమా ని బాగా సాగదీసిన ఎడిటర్ ఇంక తన ఎడిటింగ్ మాయాజాలం తో సినిమా లో ఇంకో ఇరవై నిముషాలు తీసేసిన పర్వాలేదు అని సగటు ఆడియన్స్ కి అనిపిస్తుంది. నిర్మాణ విలువలు అంత పెద్దగా లేకపోయినా వున్నా వాటిలో బాగా తీసారు. ఇప్పటికేషేర్సినిమా బిజినెస్ అయ్యింది.ఇదీ ఒక్కటే షేర్ కి ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. సినిమా తో డైరెక్టర్ మల్లికార్జున కథ ముగిసింది. ఒక వేళ మళ్ళి అతనికి సినిమా ఛాన్స్ రావాలంటే అది కేవలం కళ్యాణ్ రామ్ ఇవ్వాలి. ఇప్పటకే  మల్లికార్జున కి మూడు సినిమాలు డైరెక్షన్ ఇవ్వటం అంతే కళ్యాణ్ రామ్ కి ఎంత గొప్ప మనస్సో అర్థం అవుతుంది

షేర్  మూవీ రేటింగ్ : 1.25 /5

ఫినిషింగ్ టచ్ : తెలుగు సినిమా చరిత్ర ని 20 ఏళ్ళు వెనక్కి తీసుకువెళ్ళింది

recent reviews

Keshu Ee Veedinte Naadhan

Time pass comedy entertainer

Plan Panni Pannanum

Average comedy entertainer

Velan

Decent rural family entertainer

Meow

Soubin Shahir and Mamta Mohandas shine in this conventional film

Read more

galleries