Top

Review : Shourya Movie

నత్తనడకలాగా సాగిపోయే థ్రిల్లర్ లవ్ స్టొరీ

Source: General

By: IFY LLC

Critic's Rating: 3/5

Friday 04 March 2016

Movie Title

Review : Shourya Movie

Director

K Dasaradh

Star Cast

Manchu Manoj, Regina Cassandra

స్టొరీ లైన్ : ‘’జరిగిన ప్రతి సంఘటన వెనుక మూడు కథలుంటాయి..

  • ఒకటి జనాలు ఊహించేది,
  • రెండు చేసినవాడు చెప్పేది,
  • మూడు వాస్తవంగా జరిగిన కథ

ఈ మూడు పాయింట్స్ మీద ఆధారం చేసుకుని ఒకప్రేమికుడు తన ప్రేయసి కోసం ఆడిన డ్రామా లో బయటపడ్డా  నిజాల సముహరమే ఈ మంచుమనోజ్ ‘’శౌర్య’’.

స్టొరీ :

తన ఫ్యామిలీ తో లైఫ్ లో సంతోషంగా వుండే శౌర్య(మంచుమనోజ్) నేత్ర(రెజీనా)ని చూసి ప్రేమలో పడి ఇద్దరు ప్రేమించుకునే స్టేజి వరుకువెళ్తుంది. కానీ నేత్ర  ఫ్యామిలీ నుండి సమస్యలు వచ్చే అవకాశం వుంది అని శౌర్య-నేత్ర  దేశం వదిలి పారిపోవాలని అనుకుంటారు. కానీ ఒకఅనుకోని పరిస్థితి లో నేత్ర ని చంపటానికి చేసిన ప్రయత్నం లో నేత్ర చావు బ్రతుకులమధ్య పోరాడుతూ వుంటుంది. పొలిసు ఇన్వెస్ట్గేషన్ లో నేత్ర ని చంపాలని ట్రై చేసిందిశౌర్య అని అందరి ముందు ఒప్పుకుంటాడు. అసలు నేత్ర ని చంపాల్సిన అవసరం శౌర్య కిఎందుకు వచ్చింది...? నేత్ర ఫ్యామిలీ నుండి ఏలాంటి సమస్యలు శౌర్య-నేత్ర ప్రేమ కిదారి తీసాయి...? శౌర్య అసలు ప్లాన్ ప్రకారం ఏం చేద్దామని అనుకున్నాడు...? ఇవన్నితెలియాలంటే తెర మీద చూడాల్సిందే.

స్క్రీన్ ప్లే :

  • శౌర్య తెలివైన వాడుఅని చూపించటానికి శౌర్య తన ఫ్రెండ్స్ తో ప్రాజెక్ట్ ఓకే  చేయించుకోవటం
  • శౌర్య చేసిన ప్రాజెక్ట్ నేత్ర కోసం అని చెప్పటం. నేత్ర  కోసం ఏలాంటి పని చెయ్యటానికి సిద్దం అవ్వటం
  • శౌర్య –నేత్ర లవ్ మధ్య లవ్  ట్రాక్

ప్లాట్ పాయింట్ : శౌర్య –నేత్ర గుడిలో జాగారం చేసినరాత్రి నేత్ర ని ఎవరో గొంతి కోసి చంపటానికి ప్రయత్నం చెయ్యటం.

  • పోలీసులు నేత్ర ని చంపటానికి ప్రయత్నం చేసిన కారణంగా శౌర్యని అరెస్ట్ చెయ్యటం
  • పోలీసులు ఇన్వెస్ట్గేషన్ స్టార్ట్ చేసే క్రమంలో శౌర్య తనలవ్ స్టొరీ ని ఫ్లాష్ బ్యాక్ మోడ్ లో చెప్పటం
  • ప్రకాష్ రాజ్  చేసినఇన్వెస్ట్గేషన్ నేత్ర ని చంపటానికి ప్రయత్నం చేసింది శౌర్య కాదు అని తెలుసుకోవటం
  • మనోజ్ గురించి ఇన్ఫర్మేషన్ కోసం మనోజ్అక్క ని పిలిస్తే ,ఆమె పాయింట్ అఫ్ వ్యూ లో ఫ్లాష్ బ్యాక్ మోడ్లో చెప్పటం
  • కోర్ట్ లో మనోజ్ -"రెజినా ను నేనేచంపాను" అని అనడం తో కధ  మిడ్ పాయింట్కి  చేరుకుంటుంది.
  • నేత్ర ని ఎందుకు చంపాల్సి వచ్చిందోశౌర్య ఫ్లాష్ బ్యాక్ మోడ్ లో చెప్పటం
  • శౌర్య చెప్పిన ఆధారాలు పరిగణం లోకితీసుకుని ఇన్వెస్ట్గేషన్ చేస్తే శౌర్య –నేత్ర మధ్య సంబంధం లేని కొన్ని ఆధారాలకిమరో కేసు కి లింక్ అవ్వటం.
  • నేత్ర ఫ్యామిలీ మెంబెర్స్  చేసిన తప్పులు బయటపడటం
  • శౌర్య ఇదంతా ఎందుకు చేసాడు అని  తెలుసుకున్న పొలిసు ఆఫీసర్ ప్రకాష్ రాజ్  అర్థం చేసుకోవటంతో సినిమా ముగుస్తుంది.

కలిసొచ్చే అంశాలు :

  • లవ్ స్టొరీ కి  థ్రిల్లర్  మిక్స్ చేసే ప్రజెంటేషన్ చేసిన విధానం
  • సినిమా చివరి 20 నిముషాలు  

సినిమా ఫార్ములా :

  • మనోజ్ ''శౌర్య'' సినిమా చూస్తుంటే  అజిత్ ''ఎంతవాడుగాని'' సినిమా లో  అజిత్ అనుష్క ని కాపాడటంకోసం చివరి వరుకు అనుష్క కి తెలియకుండా అజిత్ ప్లే చేసే చేసే డ్రామా కి ఈ శౌర్యసినిమా కి దగ్గర పోలికలు వుంటాయి.
  • అల్లు శిరీష్ ‘’గౌరవం’’ సినిమా  కి మనోజ్ ‘’శౌర్య’’ సినిమా కి కాస్త దగ్గరపోలికలు కనిపిస్తాయి.

సినిమా ఎవరికీ నచ్చుతుంది :

  • మంచు మనోజ్ సినిమాల్ని ఇష్టపడే వారికీ ఈ సినిమా నచ్చుతుంది.
  • ఫ్యామిలీ ఆడియన్స్ కి ఈ సినిమా నచ్చుతుంది

ఫినిషింగ్ టచ్ : నత్తనడకలాగా సాగిపోయే థ్రిల్లర్ లవ్ స్టొరీ

శౌర్య మూవీ రివ్యూ రేటింగ్ : 2.5/5.00 

recent reviews

Keshu Ee Veedinte Naadhan

Time pass comedy entertainer

Plan Panni Pannanum

Average comedy entertainer

Velan

Decent rural family entertainer

Meow

Soubin Shahir and Mamta Mohandas shine in this conventional film

Read more

galleries