Review : Soukhyam movie
72 సీన్స్ వున్నా అచ్చతెలుగు చలనచిత్రం ‘’సౌఖ్యం’’
Review : Soukhyam movie
A.S. Ravi Kumar Chowdary
Gopichand,Regina
స్టొరీ లైన్ :
తను ప్రేమించిన అమ్మాయి కోసం ఆ ప్రేమను దక్కించుకోవటానికిచేసే ప్రయత్నంలో ఆ ప్రేమికుడికి ఎదురైనా పరిస్థితుల సముహరమే ఈ సౌఖ్యం సినిమా మూలకథ.
స్టొరీ :
రిచ్ ఫ్యామిలీ కి చెందిన శ్రీను(గోపీచంద్) తన ఫ్రెండ్స్ తో జాలీగా లైఫ్ లో ఎంజాయ్ చేస్తూ ఉంటున్న సమయం లో ట్రైన్జర్నీలో హీరోయిన్ శైలజ(రెజీనా)ని చూసి ప్రేమలో పడతాడు. శైలజ ని ప్రేమ దించే సమయంలోముందు శైలజ శ్రీను అంటే ఇష్టం లేకపోయినా శ్రీను క్యారెక్టర్ నచ్చి అతనిప్రేమిస్తుంది. ఆ ఒక అనుకోని పరిణామాలలలో శైలజని ఒక గ్యాంగ్ కిడ్నాప్ చేస్తుంది. గొడవలకిదూరంగా ఉండమని చెప్పే శ్రీను ఫాదర్ కృష్ణారావు(ముఖేష్ రుషి) కోరిక మేరకు శ్రీనుశైలజని గురించి పట్టించుకోకుండా సైలెంట్ అయ్యే సమయం లో శ్రీనుకి గతంలో వున్నా శత్రువులు అయ్యిన భావూజీ(ప్రదీప్‌రావత్) తిరిగి శ్రీను లైఫ్ లోకి వస్తాడు. భావూజీ నుండి తన ఫ్యామిలీ ని కాపాడుకోవటానికి శ్రీను కలకత్తాలోకింగ్ మేకర్ అయిన పి.ఆర్(దేవన్) లైఫ్ లోకి ఎంటర్ అవ్వుతాడు. అసలు ఈ పి.ఆర్ లైఫ్‌లోకి శ్రీను ఎందుకు వెళ్ళాడు....? భావూజీ కి పి.ఆర్ కి వున్నా సంబంధం ఏంటి....? శైలజని కిడ్నాప్ చేసిన గ్యాంగ్ కి పి.ఆర్ కివున్నా లింక్ ఏంటి అనేది తెలియాలంటే తెర మీద చూడాల్సిందే.
స్క్రీన్‌ప్లే :
- సౌఖ్యంసినిమా వాయిస్ ఓవర్ లో స్టార్ట్ అవ్వుతూ సినిమా లో వున్నా గోపీచంద్ క్యారెక్టర్ నిచూపిస్తూ ముందుకు వెళ్తుంది.
- గోపీచంద్ – రెజినా కి మధ్య వున్నా లవ్‌స్టొరీ ని ఫ్లాష్ బ్యాక్ మోడ్ లో చెప్పేవిధానం .
- గొడవలకిదూరంగా ఉండమన్న తండ్రి మాట కి కట్టుబడి వున్నా సమయం లో గోపీచంద్ లైఫ్ లోకి పాత కక్షలతో రగిలిపోతున్నప్రదీప్ రావత్ ఎంటర్ అవుతారు.
- తన ఫ్యామిలీ కి ఎలాంటి సమస్య రాకుండాజాగ్రత్త చూసుకోవాలని గోపీచంద్ ప్రదీప్ రావత్ చెప్పినట్టుగానే కలకత్తా కింగ్ మేకర్ అయ్యిన పి.ఆర్ దగ్గరకు వెళ్ళేలా చేస్తాడు.
- కలకత్తా కింగ్‌మేకర్ పి.ఆర్ కూతురే రెజినా అని ఇంటర్వెల్ లో గోపీచంద్ కి ఇచ్చే చిన్న ట్విస్ట్.
- ఒక పధకం వేసి విలన్ పి.ఆర్ ఇంట్లోకి గోపీచంద్ ప్రవేశించి, రెజినా ని అక్కడ నుండి తీసుకువచ్చి తన ఇంట్లో వుంచుతాడు.
- గోపీచంద్తన ఫ్యామిలీ అందరి చేత నాటకం ఆడించి తన తండ్రికి రెజినా నచ్చేలా సెట్ చేస్తాడు.
- క్లైమాక్స్‌లో విషయం తెలిసిన విలన్ గ్యాంగ్స్ రెజినాని తీసుకెళ్ళే క్రమంలో గోపీచంద్ రెజినా ని కాపాడుకోవడంతో కథ ముగుస్తుంది.
కలిసొచ్చే అంశాలు :
- ప్రసాద్ మూరేళ్ళ సినిమాటోగ్రఫీ
- అక్కడక్కడ వచ్చే కామెడి సన్నివేశాలు
సినిమా ఎవరికీ నచ్చుతుంది :
- గోపీచంద్ ‘’యజ్ఞం, లక్ష్యం, శౌర్యం, లౌఖ్యం’’ సినిమాలని ఇష్టపడే వారికీ ఈ సినిమా నచ్చుతుంది.
- కామెడి స్పూఫ్ లు ఇష్టపడే వారికీ ఈ సినిమానచ్చుతుంది.
సినిమా ఫార్ములా : గత 10సంవత్సరాలు గా కోనవెంకట్ –గోపీమోహన్ కాంబినేషన్ లో వచ్చిన అన్ని సినిమాల్ని మిక్స్చేస్తే ఈ సౌఖ్యం సినిమా వచ్చేస్తుంది.
సినిమా జడ్జిమెంట్ :
లౌక్యం సినిమా విజయం సాధించినబ్రమలో వున్నా స్టార్ట్ రైటర్స్ గోపి మోహన్ – కోనవెంకట్ కి ఇంకా ఆ సినిమా మత్తు వదలలేదు అని ఈ సినిమా చూస్తుంటే అందరికి అర్థంఅవ్వుతుంది. కోనవెంకట్ –గోపీమోహన్ కి ఏమి తీసిపోని విధంగా శ్రీధర్ సిపానా రాసినా 72స్కీన్స్ వున్నా తెలుగు సినిమా కథ కి గోపీమోహన్ –కోనవెంకట్ రాసిన స్క్రీన్ ప్లే రాసి ఆడియన్స్ కి వున్నామినిమమ్ సినిమా సెన్స్ కి రిచ్ అవ్వలేకపోయారు. సినిమా లో గోపీచంద్ చెప్పే డైలాగ్‌లో ఒకటి అయ్యిన ‘చేతి నిండాపనిలేకపోతే నాకు చిరాకు దొబ్బిద్ది’ ని తీసుకుంటే మరి సినిమా లో విషయం లేని కంటెంట్ నిచూస్తుంటే ఆడియన్స్ కి కూడా రెండింతల చిరాకు పుడుతుంది. తెలుగు సినిమా స్థాయి నిమరో 10 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్ళి ఇప్పటివరుకు కోనవెంకట్ – గోపీమోహన్కాంబినేషన్ లో వచ్చిన అన్ని కథలని మిక్స్ చేసి తీసి ఆడియన్స్ కి సుఖం లేకుండాచేసిన సినిమానే ఈ గోపీచంద్ సౌఖ్యం.
ఫినిషింగ్ టచ్ : 72సీన్స్ వున్నా అచ్చతెలుగు చలనచిత్రం ‘’సౌఖ్యం’’
సౌఖ్యం సినిమా రేటింగ్ : 2.0/5