Review : Speedunnodu Movie
ఈ స్పీడున్నోడు కేవలం మాస్ ఆడియన్స్ మాత్రమే పరిమితం
Review : Speedunnodu Movie
Bhimaneni Srinivasa Rao
Bellamkonda Sreenivas, Sonarika Bhadoria
స్టొరీ లైన్ : ''శత్రువు అనేవాడుస్నేహితుడుగా మారటానికి ఎన్ని అవకాశాలు అయ్యిన ఇవ్వవచ్చు ఏమో కాని ...అదేస్నేహితుడు శత్రువుగా మారటానికి ఒక్క చాన్స్ కూడా ఇవ్వకూడదు'' ఆధారం చేసుకుని తీసినకథే ఈ స్పీడున్నోడు.
స్టొరీ : రామగిరి పంచాయితీపెద్ద వీరభద్రప్ప(ప్రకాష్ రాజ్) కొడుకు శోభన్(బెల్లంకొండ శ్రీనివాస్) తన ఫ్రెండ్స్‌తో కలిసి ఎలాంటి లక్ష్యం లేకుండా లైఫ్ లో ఎంజాయ్ చేస్తుంటాడు. ఫ్రెండ్స్ కి ఎలాంటిసమస్య వచ్చిన కేరాఫ్ అడ్రస్ శోభన్. శోభన్ ఫ్రెండ్గిరి(మధు) వాసంతి(సొనారిక బడోరియా) ని చూసి లవ్ లో పడతాడు. ఆ విషయం లో గిరి తనఫ్రెండ్ శోభన్ హెల్ప్ చెయ్యమని అడిగే సమయం లో మధుకి మిగిలిన ఫ్రెండ్స్ కి వాసంతి -శోభన్ ప్రేమ వ్యవహారం బయటపడుతుంది. వాసంతి శోభన్ ఫ్రెండ్స్ అందరు సైడ్ అవ్వటంతో అంత హ్యాపీ గా సాగుతున్న సమయంలో శోభన్ మీద జగన్(కబీర్ సింగ్ దుహాన్) & మదన్ (చైతన్య కృష్ణ) పగ పెట్టుకుంటాడు. అసలు జగన్& మదన్ ఎందుకు పగ పెట్టుకున్నారు...? వాసంతి - శోభన్ మధ్య వున్నా ప్రేమ వ్యవహారంవలన శోభన్ ఫ్రెండ్ షిప్ కి వచ్చిన ఆటంకాలు ఏంటి...? అనేది తేర మీద చూడాల్సిందే.
స్క్రీన్ ప్లే : సినిమా వాయిస్ ఓవర్ లో స్టార్ట్ అవ్వుతూ కర్నూల్ జిల్లా లో రాప్తాడు-రామగిరి రెండు ప్రాంతాల గురించి చెబుతూ ముందుకు వెళ్తుంది.
ప్లే 1 :
- శోభన్ (బెల్లంకొండశ్రీనివాస్) మాస్ లుక్ తో ఎంట్రీ ఇవ్వటం
- శోభన్ కి వున్నా ఫ్రెండ్స్సూరి (శ్రీనివాస్ రెడ్డి ) , గిరి(మధు) ట్రావెల్ అవ్వుతూ గిరి తన ప్రేమించిన అమ్మాయి వాసంతి(సొనారిక బడోరియా)గురించి చెప్పటం. గిరి శోభన్ సహాయం తీసుకోవటం
- శోభన్ తన ఫ్రెండ్గిరి కి హెల్ప్ చేసే పనిలో వాసంతి ని చూడటం.
- గిరి కి పోటిగా చిట్టి (సత్య) కూడా వాసంతి ని లవ్ చెయ్యటం.
ప్లాట్ పాయింట్ 1 : ఆ విషయం తెల్సిన శోభన్ తన ఫ్రెండ్ గిరి కన్నా చిట్టి యే ముందు వాసంతి ని లవ్ చేసాడు అని అతనికే ముందు న్యాయం చెయ్యాలని ఒక నెల రోజులు చిట్టి కి చాన్స్ ఇవ్వటం. నెల రోజుల్లో చిట్టివాసంతి ని పడేయ్యకపొతే వాసంతి జోలికిరాకూడదు అని చెప్పటం.
ప్లే 2 :
- చిట్టి వాసంతిని లవ్ చేసే క్రమంలో వాసంతి చిట్టి నిఅసహ్యించుకోవటం.
- చిట్టి కిఇచ్చిన నెల రోజుల టైం లో వాసంతి అతనిరిజెక్ట్ చెయ్యటం తో మళ్ళి గిరి వాసంతి కిలవ్ చెయ్యటం స్టార్ట్ చెయ్యటం.
- శోభన్ తన ఫ్రెండ్గిరి లవ్ సెట్ చేసే సమయం లో శోభన్ తనఫ్రెండ్స్ కి వాసంతి కి వున్నా కాలేజి లవ్‌స్టొరీ చెప్పటం. ఆ విషయం తెలియగానే గిరి డ్రాప్ అవ్వటం
- చిట్టి కి అసలువిషయం తెలిసి వాసంతి ని ఏడిపించే క్రమంలో బస్ లో చిట్టికి , శోభన్ ఫ్రెండ్స్ మధ్య గొడవరావటం. ఆ గొడవలో చిట్టి చనిపోవటం, శోభన్ ని పొలిసులు అరెస్ట్ చెయ్యటం తో సినిమామిడ్ పాయింట్ (ఇంటర్వెల్ ) కి చేరుకుంటుంది.
ఇంటర్వెల్
ప్లే 3 :
- చిట్టి చనిపోవటం తో అతని కుటుంబం లో విషాదం మొదలుఅవ్వుతుంది.
- చనిపోయిన చిట్టికి బందువైన శోభన్ ఫ్రెండ్ మదన్ (చైతన్య కృష్ణ) కి విషయం తెలిసి శోభన్ మీదపగతో వుంటాడు.
- వాసంతి - శోభన్ ప్రేమ వ్యవహారం వాసంతి ఇంట్లో తెలిసిపోవటంతో వాసంతి తండ్రి వాసంతి కి పెళ్లి చేసే ఆలోచన లో వాసంతి తన బావ అయ్యిన శోభన్ ఫ్రెండ్ జగన్ (కబీర్‌సింగ్ దుహాన్) తో ఫిక్స్ చేస్తారు.
- జైల్ నుండి బయటికి వచ్చిన శోభన్ వాసంతి ని కలవటానికి వాసంతి ఉరు వెళ్తాడు... మదన్ (చైతన్యకృష్ణ) శోభన్ ని చంపటానికి ప్లాన్ వేస్తాడు. కానీ ఆ ప్లాన్ విఫలం అవ్వుతుంది.
- శోభన్ కి వాసంతిగురించి తన తండ్రి ప్రకాష్ రాజ్ ( వీరభద్రప్ప)కి చెబుతాడు. ప్రకాష్ రాజ్ తన కొడుకుఇష్టపడిన వాసంతి తండ్రి తో మాట్లాడటానికి వాసంతి ఇంటికి వెళ్తాడు.
- ప్రకాష్‌రాజ్ వాసంతి తండ్రి రావు రమేష్ తోమాట్లాడి శోభన్ కి వాసంతి కి పెళ్లి ఫిక్స్చేస్తారు.
ప్లాట్ పాయింట్ 2: వాసంతి కి - శోభన్ కి పెళ్లిచెయ్యటానికి పెద్దలు ఒప్పుకోవటం తో ఆవిషయం తెల్సిన వాసంతి బావ అయ్యిన శోభన్ ఫ్రెండ్ జగన్ (కబీర్ సింగ్ దుహాన్) శోభన్ మీదపగ పెంచుకుంటాడు.
ఆ విషయంతెలుసుకున్న మదన్ (చైతన్య కృష్ణ) జగన్ (కబీర్‌సింగ్ దుహాన్) తో ఒక డీల్ కి వచ్చి శోభన్ ని చంపాలని ప్లాన్ చేస్తారు.
ప్రీ-క్లైమాక్స్: మదన్ (చైతన్య కృష్ణ) ద్వారా శోభన్ కి అసలు విషయం తెలుస్తుంది. వాసంతి కి జగన్ కి పెళ్లి ఫిక్స్ అయ్యింది అనిజగన్ నిన్ను కలవాలని మదన్ శోభన్ ని జగన్దగ్గరకి తీసుకు వెళ్ళటానికి సిద్దం చేస్తాడు.
జగన్ చెప్పినప్లేస్ కి శోభన్ తన ఫ్రెండ్ గిరి తో కలసి మదన్ తో కలసి జగన్ దగ్గరకి వెళ్తాడు.
క్లైమాక్స్ : జగన్ -మదన్ వేసిన ప్లాన్ ప్రకారం శోభన్ ని చంపాలని చేసే ప్రయత్నం లో శోభన్ ఫ్రెండ్ గిరి కూడా శోభన్ ని చంపటానికి ట్రై చేస్తాడు. ఆ ప్రమాదం నుండితప్పించుకున్న శోభన్ తన ఫ్రెండ్స్ కి బుద్ది చెప్పటం తో సినిమా ముగుస్తుంది.
కలిసొచ్చే అంశాలు :
- సాయి శ్రీనివాస్ మాస్పెర్ఫార్మెన్స్
- క్లైమాక్స్ ఎపిసోడ్
- సోనరికా స్క్రీన్ మీదప్రజెంటేషన్
- శ్రీనివాస్ రెడ్డి - సాయిశ్రీనివాస్ -మధు కామెడి టైమింగ్
- చైతన్య కృష్ణ నెగిటివ్‌రోల్ లో నటన
- తమన్నా ఐటెం సాంగ్ పెర్ఫార్మెన్స్
సినిమా ఫార్ములా :
- తమిళ్ సినిమా ''సుందరాపాండియన్'' ఆధారంగా ఈ సినిమా నితెలుగు లో రీమేక్ చేసారు.
- స్పీడున్నోడు సినిమాచూస్తుంటే వరుణ్ తేజ్ ''ముకుందా'',డైరెక్టర్ శేఖర్ కమ్ములా ''హ్యాపీ డేస్'' , సందీప్ కిషన్ ''టైగర్'' లాంటి సినిమాలు గుర్తుకువస్తాయి.
సినిమా ఎవరికీ నచ్చుతుంది :
- డైరెక్టర్ భీమినేనిశ్రీనివాస్ సినిమాలని ఇష్టపడే వారికీ ఈ సినిమా నచ్చుతుంది.
- కమెడియన్ శ్రీనివాస్ రెడ్డి ని ఇష్టపడే వారికీ ఈ సినిమా నచ్చుతుంది.
ఫినిషింగ్ టచ్ : ఈ స్పీడున్నోడు కేవలం మాస్ ఆడియన్స్ మాత్రమే పరిమితం
సినిమా రివ్యూ రేటింగ్ : 2.75/5.00