Top

Review : Tripura Movie

త్రిపుర ఆడియన్స్ ని త్రిల్ చెయ్యలేకపోయింది

Source: General

By: SIFY

Critic's Rating: 3/5

Saturday 07 November 2015

Movie Title

Review : Tripura Movie

Director

Raj Kiran

Star Cast

Swathi, Naveen Chandra, Rao Ramesh, Saptagiri

స్టోరీ లైన్ : నిజజీవితం లో ఒక వ్యక్తి కి వచ్చే కలలు నిజం అవుతుంటాయి. కలలు వ్యక్తి జీవితం లో  ఏలాంటి మార్పులు తీసుకువచ్చాయి అనేది త్రిపుర కథ.

స్టోరీ : ఈశ ( పూజ రామచంద్రన్ ) ని ఒక గెస్ట్ హౌస్ లో హత్య చేసి అదే గెస్ట్ హౌస్ లో  పూడ్చేస్తారుమరో వైపు త్రిపుర ( స్వాతికి వచ్చే కలలు నిజం అవుతుంటాయి. ప్రయత్నం లో నవీన్ చంద్ర తో ప్రేమ లో పడి పెళ్ళి చేసుకుంటుందిఈశ మిస్సింగ్ కేసు లో  విచారణ లో నవీన్ చంద్ర కి ఈశ కి సంబంధం వుంది తెలుస్తుంది. త్రిపుర కి వచ్చే కలల్లో  తన భర్త ని తనే (త్రిపుర ) చంపేస్తాను అని కల వస్తుంది. ఈశ కి నవీన్ చంద్ర కి వున్నా సంబంధం ఏంటి...?  త్రిపుర కి వచ్చిన కల నిజం అయ్యిందా...? ఈశ ని ఎందుకు చంపాల్సిన అవసరం ఏంటి...? అనేది తెర మీద చూడాల్సిందే

స్క్రీన్ ప్లే  :

త్రిపుర సినిమా  అపార్ట్ మెంట్ లో  వున్నా  ఈశ (పూజ రామచంద్రన్మీద ఓపెన్ అయ్యి  ఈశ కి నవీన్ చంద్ర (నవీన్ చంద్ర ) దగ్గర నుండి ఫోన్ రావటం తో  గెస్ట్ హౌస్ కి వెళ్తుంది. అక్కడ అనుకోకుండా  ఈశ ని హత్య చేస్తారు. శవాన్ని ఇంట్లోనే ఒక గోడలో పూడ్చేస్తారు. అక్కడ నుండి కథ ఒక పల్లె టూర్ కి షిఫ్ట్  అవుతుంది. త్రిపుర (స్వాతి) కి వచ్చే కలలు అన్ని నిజం అవుతుంటాయి. ఉరిలో వుండే అందరి సమస్యలను పరిష్కరిస్తుంది. దాని వలన లాభాలు జరుగుతాయి , నష్టాలు జరుగుతాయి. తన కూతురి కి వున్నా మానసిక వ్యాధి ని తగ్గించటానికి పట్నం తీసుకెళ్తాడు. ప్రయత్నం లో త్రిపుర డాక్టర్ నవీన్ చంద్ర తో ప్రేమ లో పడుతుంది. ప్రేమ పెళ్ళికి దారి తీస్తుంది. నవీన్ చంద్ర  త్రిపుర ఫ్యామిలీ ని ఒప్పించి పెళ్ళి చేసుకుంటాడు.

ప్లాట్ పాయింట్ 1 :త్రిపుర కి వచ్చే కలలు నిజం అవుతుంటాయి. కలలో బాగంగా నవీన్ చంద్ర గెస్ట్ హౌస్ లో వుండే వాచ్ మేన్ చనిపోతాడు. విషయం తన భర్త కి చెబుతుంది, కానీ త్రిపుర కి వచ్చిన కలని కొట్టి పారేస్తాడు. నవీన్ చంద్ర తన బాస్ అయ్యిన రావు రమేష్ చేత త్రిపుర కి వున్నా సమస్య చెబుతాడుస్వాతి కి వచ్చే కలలులో  తన భర్త ని  త్రిపుర చంపినట్టు కల వస్తుంది. విషయం తన భర్త కి చెబుతుంది.

ఇంటర్వెల్ 

నవీన్ చంద్ర కి వున్నా గెస్ట్ హౌస్  ని  కొనటానికి ఎవరుకు ముందు  రాకపోవటంతో గెస్ట్ హౌస్ లో ముప్పై రోజులు వుంటే ఎవరో కొంటారు అని చెప్పటంతో  నవీన్ చంద్ర త్రిపుర ని  తీసుకుని తన గెస్ట్ హౌస్ కి వెళ్తాడు.

ప్రయత్నం లో భాగంగా త్రిపుర మీద ఒకరు అత్యాచార ప్రయత్నం చేస్తారు. చివరి క్షణం ల్లో వచ్చి కాపాడిన రావు రమేష్ , నవీన్ చంద్ర ఇద్దరూ వాస్తవ ప్రపంచానికి , కలల ప్రపంచానికి తేడా ఏంటో చెబుతాడుమరో వైపు  ఈశ మిస్సింగ్ కేసు మీద ఎంక్వయిరీ జరుగుతూ వుంటుంది. నవీన్ చంద్ర ఫ్రెండ్  ఈశ కేసు ని సీరియస్ గా దర్యాప్తు చేస్తుంటాడు.

ఫ్లాట్ పాయింట్ 2 : ఈశ గురించి నవీన్ చంద్ర మీద  అనుమానం రావటంతో అతని విచారిస్తాడు. విచారణ లో నవీన్ చంద్ర కి ఈశ కి మధ్య వున్నా లవ్ స్టోరీ అంత బయటికి వస్తుంది. త్రిపుర కి తన భర్త మీద అనుమానం వస్తుంది

ఈశ గురించి తెలుసుకునే ప్రయత్నం లో  త్రిపుర ఈశ వుండే అపార్ట్ మెంట్ కి వెళ్తుంది. ఫ్లాట్ లో ఒక డైరి ద్వారా ఈశ కి , తన భర్త కి వున్నా ప్రేమ గురించి గురించి తెలుసుకుని తన భర్త యే  ఈశ ని చంపేసాడు అని అనుమానం లో వుంటుంది.

ప్రీ-క్లైమాక్స్  : త్రిపుర కి తన భర్త యే  ఈశ ని చంపేసాడు అని అనుమానం లో వున్నా సమయం లో  ఈశ కేసు ని డిల్ చేస్తున్న నవీన్ చంద్ర ఫ్రెండ్ పోలీసాఫీసర్  త్రిపుర కి  చెబుతాడు. ఈశ ని చంపింది నీ భర్త యే అని , నిన్ను కూడా చంపేస్తాడు అని చెప్పటంతో త్రిపుర భయపడి తన ఊరు వెళ్లిపోవాలని అనుకుంటుంది.

క్లైమాక్స్  : త్రిపుర  గెస్ట్ హౌస్ నుండి వెళ్ళిపోదామని అనుకునే సమయం లో నవీన్ చంద్ర అక్కడికి వస్తాడు. ప్రయత్నం లో త్రిపుర చేతిలో నవీన్ చంద్ర గాయాలు పాలు అవుతాడు. అదే సమయం లో అక్కడికి వచ్చిన నవీన్ చంద్ర ఫ్రెండ్ పోలీసాఫీసర్  నవీన్ చంద్ర ని అరెస్ట్ చెయ్యాలని అనుకునే ప్రయత్నం లో నవీన్ చంద్ర ఒక వీడియో ని త్రిపుర కి చూపిస్తాడు. ఈశ ని చంపింది పోలీసాఫీసర్ అని తెలుస్తుంది. ఈశ  ఆత్మ త్రిపుర లోకి వచ్చి పోలీసాఫీసర్ మీద పగ తీర్చుకోవటం తో సినిమా ముగుస్తుంది.

కలిసోచ్చేఅంశాలు : 

  • సినిమా స్టార్టింగ్ లో  రెండు నిముషాలు 
  • త్రిపుర గా స్వాతి చేసిన నటన 
  • చివరి పది నిముషాలు

ఆడియన్స్ ని  ఆకట్టుకోలేని  అంశాలు :

  • సప్తగిరి చేసే బలవంతపు కామెడీ 
  • కథ లో వున్నా మెయిన్ పాయింట్  మీదు వెళ్తూ ఇదీ కాదు అని చెప్పటం
  • సెకండ్ ఆఫ్ లో  జయ ప్రకాష్ రెడ్డి సప్తగిరి శకలక శంకర్  వర్క్ అవుట్ అవ్వని కామెడీ ఎపిసోడ్  
  • నవీన్ చంద్ర & రావు రమేష్  యాక్టింగ్ 

సినిమా ఫార్ములా : ప్రేమ కథ చిత్రమ్సినిమా లో పాయింట్  ని తీసుకుని దానికి  హాలివుడ్ సినిమాఫైనల్ డెస్టినేషన్సినిమాని కలిపితే = త్రిపుర   

సినిమా ఎవరికీ నచ్చుతుంది :

  • అంజలి నటించినగీతాంజలి’  సినిమా ని ఇష్టపడే వారు సినిమా ని ఇష్టపడతారు 
  • హార్రర్ కామెడీ చిత్రాలపై ఆసక్తి వుండే వారికీ సినిమా నచ్చుతుంది.

సినిమా ఫినిషింగ్ టచ్ :  త్రిపుర ఆడియన్స్ ని త్రిల్ చెయ్యలేకపోయింది...

సినిమా రేటింగ్ : 2.0/5


recent reviews

Keshu Ee Veedinte Naadhan

Time pass comedy entertainer

Plan Panni Pannanum

Average comedy entertainer

Velan

Decent rural family entertainer

Meow

Soubin Shahir and Mamta Mohandas shine in this conventional film

Read more

galleries