Review : Tuntari Movie
మాస్ ఆడియన్స్ ని అలరించే ''తుంటరి''
Review : Tuntari Movie
Kumar Nagendra
Nara Rohit, Latha Hegde, Kabir Duhan Singh
స్టొరీ లైన్ : ఐదుగురుఫ్రెండ్స్ కి ముని ఇచ్చిన పేపర్ వలన భవిష్యత్తులో 5 కోట్లు వస్తాయని తెలుసుకున్న ఆఐదుగురి ఫ్రెండ్స్ 5 కోట్లు కోసం ఏంచేసారు అనేది ఈ తుంటరి స్టొరీ
స్టొరీ : అనంతగిరిఫారెస్ట్ కి ఎంజాయ్ చెయ్యటానికి వెళ్ళిన ఐదుగురు ఫ్రెండ్స్ కి ముని దగ్గర వరం (దసరా తర్వాత రోజు రాని న్యూస్‌పేపర్ ) పొందుతారు. అనూహ్య రీతిలో ఆ ఐదుగురు ఉద్యోగాలు పోవటంతో ముని ఇచ్చిన పేపర్‌ద్వారా 5 కోట్లు వచ్చే అవకాశం వుంది అని ఆ ఐదు కోట్లు బాక్సింగ్ కి లింక్ వుండటంవలన ఆ రోజు గెలిచే వ్యక్తీ కోసం వెతికే క్రమంలో రాజు (నారారోహిత్ ) నివెతికిపట్టుకుంటారు. ఆ ఐదుగురు కలసి నారారోహిత్ ని ఒప్పించే క్రమంలో నారారోహిత్సిరి (లతా హెగ్డే ) ని చూసి ఇష్టపడతాడు. ఆ ఐదుగురు సిరి ని అడ్డం పెట్టుకుని ఏ విధంగా నారారోహిత్ని బాక్సర్ లాగ సిద్దం చేసారు...? అసలు బాక్సింగ్ రాని నారా రోహిత్ పోటిలో గెలిచాడా...? నారారోహిత్ వలన ఆఐదుగురికి 5 కోట్లు వచ్చాయా...? అనేది తెలియాలంటే తెర మీద చూడాల్సిందే.
స్క్రీన్ ప్లే :
ప్లే 1 :
- సినిమా ఓపెనింగ్ ఐదుగురుసాఫ్ట్ వేర్ ఇంజనీర్స్ కలసి అనంతగిరి ఫారెస్ట్ కి వెళ్ళటం. పూజిత కి అక్కడ అనుకోనిరీతిలో నీటి లోపల సాదువు కనపడటం.
- సాదువు ని ఫాలో అవ్వుతూసాధువు దగ్గరకి ఆ ఐదుగురు ఫ్రెండ్స్ చేరుకోవటం. ఆ ఐదుగురు కి సాధువు ఒక వరంకోరుకోమని చెప్పటం
- సాధువు వాళ్ళకి కావాల్సిన వరం (దసరా పండగ తర్వాత రాని న్యూస్‌పేపర్ ). పూజిత ఆ న్యూస్ పేపర్ లో చిన్న ముక్క చింపి నలిపి సాధువు వెళ్ళిపోయినాప్రదేశం లో పడేస్తుంది.
ప్లాట్ పాయింట్ 1 : టూర్ నుండి తిరిగి వచ్చిన వాళ్ళకి అనూహ్యరీతిలో సాదువు చెప్పినట్టుగానే సాఫ్ట్వేర్ కంపెనీ భారీ నష్టాల వలన మూసేయ్యటంవలన ఆ ఐదుగురు జాబ్స్ పోవటం.
ప్లే 2 :
- సాదువు వరం వలన ఆఐదుగురు కోరుకున్న న్యూస్ పేపర్ ద్వారాడబ్బు సంపాదించాలని అనుకోవటం. ఆ న్యూస్ పేపర్ లో బాక్సింగ్ ప్రైజ్ మని (5 కోట్లు ) గురించి ఎవరు గెలుస్తారో వాళ్ళకితెలిసిపోవటం.
- రాజు (నారా రోహిత్ )బాక్సర్ కోసం వెతికే క్రమంలో రాజు కి అసలు బాక్సింగ్ రాదు అని తెలుసుకోవటం.
- రాజు వెంట ఆ ఐదుగురుబాక్సింగ్ కోసం ఒప్పించే ప్రయత్నం లో సిరి (లతా హెగ్డే ) ని చూసి ఇష్టపడతాడు. సిరి ని తనకి సెట్ చేస్తే బాక్సింగ్చేస్తాను అని రాజు చెప్పటం
- రాజు ఒక బాక్సర్ అని సిరిరాజు ని లవ్ చెయ్యటం. సిరి కోసం రాజు ఆ ఐదుగురు చెప్పినట్టుగా బాక్సర్ గా కోచింగ్‌కి సిద్దం అవ్వుతూ వుండటం.
- అసలైన కిల్లర్ రాజు (కబీర్‌సింగ్ ) బాక్సర్ గా ఎంట్రీ ఇవ్వటం. ఇద్దరిపేరులు ఒకటే అవ్వటం వలన ఎవరు బాక్సింగ్ చాంపియన్ అవ్వుతారో అని ఆ ఐదుగురు ఆలోచన లోపడటంతో సినిమా మిడ్ పాయింట్ కి చేరుకుంటుంది.
ఇంటర్వెల్
ప్లే 3 :
- బాక్సింగ్ ప్రాక్టీస్ చెయ్యకుండా రాజు సిరి ని ఇంప్రెస్స్ చెయ్యటానికి ప్రయత్నాలు చెయ్యటం
- బాక్సింగ్ కాంపిటేషన్ దగ్గరపడటంతో రాజు బాక్సర్ గా ఒక్కో లెవెల్గెలుచుకుంటూ ముందుకి వెళ్ళటం
- బాక్సింగ్ కాంపిటేషన్ అన్నిలెవల్స్ లో రాజు గెలిచి ఫైనల్ కి వెళ్ళటం
- ఫైనల్ మ్యాచ్ లో రాజు(నారారోహిత్ ) కిల్లర్ రాజు (కబీర్ సింగ్ ) తో తలపడే దమ్ములేక కిల్లర్ రాజు నిచూసి భయపడటం
- ఆ ఐదుగురు సాఫ్ట్ వేర్ ఇంజనీర్స్ ఫైనల్స్ ఎవరు గెలుస్తారో తెలుసు అని మ్యాచ్ ఫిక్సింగ్ చేద్దామని కిల్లర్ రాజు (కబీర్ సింగ్) స్పాన్సర్ తో డీల్ సెట్ చేసుకోవటం.
ప్రీ-క్లైమాక్స్: నారా రోహిత్ కబీర్ సింగ్ ఇంటికి వెళ్ళటం... తను అసలు బాక్స్రే కాదు అని కిల్లర్ రాజు కి చెప్పటం...ఇదంతా కేవలం తన ప్రియాసి (సిరి ) కోసంచేశాను అని చెప్పటం...బాక్సింగ్ లో ఎలాగైనా డ్రాప్ అవ్వమని అనటం...కిల్లర్రాజు రాజు (నారా రోహిత్ ) విషయాన్నిసీరియస్ గా తీసుకుని నేను (కిల్లర్ రాజు ) బాక్సింగ్ లో ఓడిపోవాలంటే ఒక రాత్రి కి నీ(రాజు) ప్రియాసి (సిరి) ని పంపాలని డిమాండ్ చెయ్యటం.
క్లైమాక్స్ : రాజు – కిల్లర్ రాజు మధ్య హోరహోరి పోరులో రాజా బాక్సింగ్ టైటిల్ గెలవటంతో అతనికి వచ్చిన ప్రైజ్ మని నితనకి బాక్సింగ్ నేర్పిన వాళ్ళకి ఇచ్చేస్తాడు. సినిమా ఓపెనింగ్ లో అనంతగిరి ఫారెస్ట్‌లో పూజిత వదిలేసినా పేపర్ ముక్క ఓపెన్ అయి దానిలో రాజు (నారా రోహిత్ ) బాక్సింగ్ చాంపియన్విజేత అని స్క్రీన్ మీద కనబడటంతో సినిమా ముగుస్తుంది.
కలిసొచ్చే అంశాలు :
- నారారోహిత్ మాస్పెర్ఫార్మన్స్
- ఇంటరెస్టింగ్ స్క్రీన్ ప్లే(ఏ.ఆర్.మురుగుదాస్ స్టొరీ )
- అలీ - నారారోహిత్ - వెన్నెలకిషోర్ ఎపిసోడ్
- నారారోహిత్ - శంకర్ మధ్యవచ్చే కామెడి సన్నివేశాలు
- సినిమా ఓపెనింగ్ & ఎండింగ్ & ఇంటర్వెల్ బాంగ్
- సాయి కార్తీక్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్
సినిమా ఫార్ములా :
- ''తుంటరి'' సినిమా తమిళం లో వచ్చిన ''మాన్ కరాటే'' నుండిరీమేక్ చేసారు
సినిమా ఎవరికీ నచ్చుతుంది :
- నారారోహిత్ ''అసుర , రౌడిఫెలో'' సినిమాలని ఇష్టపడే వారికీ ఈ సినిమా నచ్చుతుంది.
- రీమేక్ సినిమాల్ని ఇష్టపడేవారికీ ఈ సినిమా నచ్చుతుంది
ఫినిషింగ్ టచ్ :మాస్ఆడియన్స్ ని అలరించే ''తుంటరి''
తుంటరి మూవీ రివ్యూ : 3.00 / 5.00