Review: Basti Movie
బస్తీ మూవీ రివ్యూ
Review: Basti Movie
Vasu Manthena
Sreyan, Pragathi, Mukesh Rushi, Abhimanyu Singh, Kota Srinivasarao
స్టోరీ ప్రీమైస్ (స్టోరీ మెయిన్ ఐడియా ) :- ఇద్దరు విరోధుల వలన ఇబ్బంది పడుతున్న బస్తీలో – ఆ విరోధుల కొడుకు, కూతురు ప్రేమలో పడితే ఎలా ఉంటుంది? ఏ పరిణామాలు సంభవిస్తాయి అన్నదే కధ.
స్టోరీ :- భిక్షపతి (కోట శ్రీనివాసరావు), అమ్మిరాజు (ముఖేష్ రుషి) ఇద్దరూ బద్ద శత్రువులు. భిక్షపతి కొడుకు (అభిమన్యు సింగ్) కు అమ్మి రాజు కు శతృత్వం వుంటుంది . అభిమన్యు సింగ్ ఒక అమ్మాయిని చంపుతాడు . అమ్మి రాజు (ముఖేష్ రుషి) తన బద్ద శత్రువుని కంట్రోల్ లో పెట్టడం కోసం అతని కూతురు స్రవంతి (హీరోయిన్ ప్రగతి) ని కిడ్నాప్ చేసి – తన ఇంట్లో దాస్తాడు.
అమ్మిరాజు తమ్ముడు విజయ్ (హీరో శ్రేయాన్) ఫారిన్ లో చదువుకొని ఇండియా వస్తాడు. ఈ కిడ్నాప్ విషయం విజయ్ గమనించి, కిడ్నాప్ అయిన స్రవంతి కి అన్నీ దగ్గరుండి చూసుకుంటాడు. వీళ్ళిద్దరి సాన్నిహిత్యం పెరుగుతుంది. ఇద్దరూ ప్రేమలో పడతారు.
అయితే ఈ ప్రేమ విషయాన్ని విజయ్ – తన అన్న అమ్మిరాజు (ముఖేష్ రుషి)కి చెబుతాడు. అమ్మిరాజు (ముఖేష్ రుషి) – మీ పెళ్ళి చేస్తానని విజయ్ కి మాటిస్తాడు. శత్రువులతో మీటింగ్ ఏర్పాటు చేసి ఒప్పిస్తాడు. అప్పుడు భిక్షపతి కొడుకు కాల్పులు జరపడంతో అక్కడ – అమ్మిరాజు (ముఖేష్ రుషి), భిక్షపతి (కోట శ్రీనివాసరావు)తో సహా అందరూ ప్రాణాలు కోల్పోతారు. ఇక్కడ నుండి విజయ్ – స్రవంతి తప్పించుకుంటారు. వీళ్ళిద్దరూ ఎలా బ్రతికి బైట పడ్డారు? వీళ్ళ ప్రేమను ఎలా కాపాడుకున్నారు? భిక్షపతి కొడుకు అభిమన్యు సింగ్ ఏం చేశాడన్నదే మిగిలిన కధ.
స్క్రీన్ ప్లే :-
- సినిమా అంతా స్ట్రైట్ నరేషన్ లో – డైరెక్టర్ పాయింటాఫ్ వ్యూ తో సినిమా సాగుతుంది.
- స్టార్టింగ్ వాయిస్ ఓవర్ తో సినిమా ఓపెన్ చేసి – బస్తీలో రెండు వర్గాల గురించి చెబుతారు.
- స్టార్టింగ్ – ఒక లేడీ హత్య……..దానికి రియాక్షన్ గా కిడ్నాప్ జరుగుతాయి.
- కిడ్నాప్ డ్రామాలో హీరో – హీరోయిన్స్ ప్రేమ సాగుతుంది.
- మిడ్ పాయింట్లో – అందరినీ చంపడం. హీరో – హీరోయిన్స్ పారిపోవడం
బ్రేక్
- సెకండాఫ్ లో హీరో – హీరోయిన్ సర్వైవల్ జర్నీ
- ఈ సర్వైవల్ జర్నీలో పెళ్ళి చేసుకోవడం.
- ఫారిన్ వెళ్ళి పోదామని పాస్ పోర్ట్ వ్యవహారంలో హీరో – హీరోయిన్లు ఇబ్బందులు పడటం.
ప్రీ క్లైమాక్స్ :- హీరో – హీరోయిన్ కార్ ని విలన్ యాక్సిడెంట్ చేయడం. హీరో – విలన్ని చంపడం.
కలిసోచ్చే అంశాలు :
- బ్యాక్ గ్రౌండ్ స్కోర్
- అలీ వచ్చిన కామిడీ బ్లాక్
స్టోరీ ఈక్వెషన్ :
- “మిర్చి” లో గ్రూప్ గొడవలు + స్లో లవ్ స్టోరీ = బస్తీ
సినిమా ఎవరికి నచ్చుతుంది :
- స్లో నరేషన్ సినిమా ని చూడగలిగే వారికి ఈ సినిమా నచ్చవచ్చు.
బస్తీ సినిమా రేటింగ్ : 1.0/5