Review: Cinema Chupistha Maava
లవ్ ఎంటర్టైనర్ గా హిట్ కొట్టిన -సినిమా చూపిస్త మావా
Review: Cinema Chupistha Maava
Trinadha Rao Nakkina
Raj Tarun, Avika Gor, Rao Ramesh, Posani Krishna Mural
స్టోరీ మెయిన్ ఐడియా : ఒక లోక్లాస్ పోకిరి అబ్బాయి , ఒక క్లాస్ అమ్మాయిని లవ్ చేస్తే ఏమౌతుంది ...? అమ్మాయి ఫాదర్ ఏ కండీషన్స్ పెడతాడు అనేది సినిమా మెయిన్ పాయింట్.
స్టోరీ : కత్తి (హీరో రాజ్ తరుణ్) ఇంటర్ ఫెయిల్ అయిన అవారా కుర్రాడు. ఒక ఫ్రెండ్స్ గ్యాంగ్ తో తిరుగుతూ ఉంటాడు . ప్రణీత ( హీరోయిన్ అవికాగోర్) ఇంటర్ లో 996 మార్క్స్ తెచ్చుకున్న అమ్మాయి . ప్రణీత ( హీరోయిన్ అవికాగోర్) ఫాదర్ సోమనాథ్ చటర్జీ (రావు రమేష్). అతనొక డిఫరెంట్ క్యారక్టర్. ప్రతీ విషయం లో క్వాలిటీ కోసం పరితపిస్తాడు . అలాగే క్వాలిటీ కోసం బ్రతుకుతూ ఉంటాడు. క్వాలిటీ గా బ్రతికే సోమనాథ్ చటర్జీ కి , క్వాలిటీ లేని కత్తి (హీరో రాజ్ తరుణ్) కి మధ్య మధ్య లో గొడవ జరుగుతూ వెళ్తుంది .
కత్తి (హీరో రాజ్ తరుణ్) ప్రణీత ( హీరోయిన్ అవికాగోర్) ని చూసి ,మనసు పారేసుకుంటాడు . ఎలాగైనా ఆ అమ్మాయి మనసు గెలవలనుకుంటాడు . పనిలో పనిగా ప్రణీత వున్న కాలేజి లో దొంగ స్టూడెంట్ గా ఎంటర్ అయ్యి , ఆమె మనసులో చోటు సంపాదిస్తాడు . హీరోయిన్ కి మనసులో వున్న ,అనిచిపెట్టుకున్న చిన్న చిన్న కోరికలన్నీ తీరుస్తూ దగ్గరవుతాడు.
ఒకానొక టైం లో హీరోయిన్ ప్రేమ విషయాన్ని హీరో నే స్వయం గా హీరోయిన్ తండ్రి సోమనాథ్ చటర్జీ (రావు రమేష్) కి తెలిసేలా చేస్తాడు . దానితో తండ్రి అయిన సోమనాథ్ చటర్జీ (రావు రమేష్) ఒక కండీషన్ పెడతాడు. ఒక నెల రోజులు మా ఫ్యామిలీ ని పోషించమని., పోషించలేక పోతే ప్రేమ ను వదులుకోవాలని కండీషన్.ఈ కండీషన్ ని హీరో ఎలా బ్రేక్ చేసి, తన ప్రేమ ను నిలబెట్టుకున్నాడు ...? తన మావా కు అనుక్షణం సినిమా ఎలా చూపించాడు ...? అన్నదే కధ ...
స్క్రీన్ ప్లే :
సినిమా ఓపెన్ అవ్వడమే రావురమేష్ క్యారక్టర్ తో ఓపెన్ అవుతుంది . అతని పాయింట్ ఆఫ్ వ్యూ లోంచి సినిమా స్టార్ట్ చేసారు .
సెటప్ : ( క్యారక్టర్ ల పరిచయం)
- రావు రమేష్ క్యారక్టర్ ని ఎస్టాబ్లిష్ చేసి , తర్వాత హీరోయిన్ క్యారక్టర్ ని ఎస్టాబ్లిష్ చేసారు . ఆ తర్వాత హోలీ పాట తో హీరో క్యారక్టర్ ని ఎస్టాబ్లిష్ చేసారు .
- ఇంటర్ ఫెయిల్ అయిన హీరో పరిస్థితి ద్వారా , హీరో ఫ్యామిలీ పరిచయం చేసారు .
ప్లాట్ పాయింట్ -1 : ( ముఖ్యమైన మలుపు )
ఆతర్వాత హీరో , హీరోయిన్ అవికాగోర్ ఫోటోని రావురమేష్ నే చూపడం , తద్వారా ప్రేమ కధకు లీడ్ ఇచ్చారు . అక్కడ నుండి హీరో – హీరోయిన్ ప్రేమ కధ లో భాగం గా పరిచయం , కాలేజి లవ్ స్టోరీ , హీరోయిన్ కి వున్నా కోరికలు –వాటిని తీరుస్తూ వెళ్లి ఇద్దరూ క్లోజ్ ఆవ్వడం.
మిడ్ పాయింట్ :
- హీరోయిన్ ఇంట్లోకి హీరో వెళ్లి, రావురమేష్ చూస్తుండగా డోర్ తెసుకుని బయటకు రావడం తో ( ----ఇంటర్వెల్ ---- )
ప్రేమికులుగా మారిన ఇద్దరూ హ్యాపీ గా ఉంటుండగా , హీరోయిన్ కి పెళ్ళిసంబంధం రావడం , అక్కడే హీరో –హీరోయిన్ ప్రేమ ను ఫోన్ ద్వారా బయటకు చెప్పించి , తండ్రి రావురమేష్ వినేలా చేయడం ...స్క్రీన్ ప్లే ప్రకారం ఇక్కడికి రావు రమేష్ వాయిస్ ఓవర్ నరేషన్ ఈ పెళ్లి చూపుల సీన్ దగ్గర స్టాప్ అవుతుంది.
ప్లాట్ పాయింట్ -2 :
ఇక్కడ రావురమేష్ హీరో కి ఒక కండీషన్ పెట్టడం , ఆ కండీషన్ ద్వరా హీరో పనులు చేసుకుంటూ వాటిని అధిగమిస్తూ వెళ్ళడం . యాక్షన్ –రియాక్షన్ ఫార్మాట్ వాడారు. పందెం లో గెలిచాను అనుకునే సమయానికి హీరో కి ఒక క్రైసిస్ ...
ప్రీ క్లైమాక్ష్ :
హీరో – హీరోయిన్ లు బైక్ మీద వస్తుంటే ఆక్సిడెంట్. ఇప్పుడు హీరోయిన్ ని బ్రతికిన్చుకోవాలి. హీరో తన కండీషన్ లో ఫెయిల్.ఓటమి.
క్లైమాక్ష్ :
కానీ చిన్న ట్విస్ట్ పెట్టి , హీరో హీరోయిన్ ని బ్రతికిన్చుకోవడం వేసే చిన్న ప్లాన్. రావు రమేష్ వాయిస్ ఓవర్ మళ్ళీ (క్లైమాక్ష్) హీరోయిన్ హాస్పిటల్ లో వాడారు ... కధ సుఖాంతం.
సినిమా కి కలసి వచ్చే అంశాలు :
- ప్రేమ జంట గా హద్దులు దాటని జంట హీరో రాజ్ తరుణ్ , హీరోయిన్ అవికాగోర్ లు బాగున్నారు...
- కామెడీ సీన్ లతో సినిమా నిండి పోయి వుంది ...
- క్రియేటివిటీ వున్న కొన్ని సీన్ లు కుడా వున్నాయి....
- రావురమేష్ , పోసాని కృష్ణ మురళి ,ముఖ్యం గా రైటర్ తోటపల్లి మధు బాగా నవ్వించారు ....
సినిమా ఈక్వేషన్ :
“బొమ్మరిల్లు” సినిమా లో సిద్ధార్ధ ని , జెనీలియా క్యారక్టర్ లను రివర్స్ చేసి , ప్రకాష్ రాజ్ ఒక కండీషన్ పెడితే = “ సినిమా చూపిస్తా మావా ”
సినిమా ఎవరికి నచ్చుతుంది :
- ఫస్ట్ యూత్ కి ఈ సినిమా నచ్చుతుంది. ముఖ్యం గా ఇంటర్ నుండి ఇంజనీరింగ్ చేసే వాళ్ళకు బాగానే వుంటుంది.
- కామెడి ని ఇష్ట పడే వారికి ఈ సినిమా నచ్చుతుంది..
- మాస్ పీపుల్స్ కి సినిమా నచ్చుతుంది.
ఫైనల్ టచ్ : లాజిక్ ల జోలు వెళ్ళకుండా ఎంజాయ్ చేసే లవ్ ఎంటర్టైనర్ ..
రేటింగ్ : 3.5 /5