Review: James Bond
జేమ్స్ బాండ్ ( నేను కాదు ..నా పెళ్ళాం ..)
Review: James Bond
Sai Kishore Macha
Allari Naresh, Sakshi Chaudhary
స్టోరీ ప్రిమైస్ : (స్టోరీ మెయిన్ ఐడియా ) ఒక బయపడే కుర్రాడిని (అల్లరి నరేష్) ఒక లేడీ డాన్ పెళ్లి చేసుకుంటే ఎలా వుంటుంది ? అనే ఐడియా మీద బేస్ అయిన సినిమా ఇది.
స్టోరీ : నాని (అల్లరి నరేష్ ) ఒక సాఫ్ట్ వేర్ ఇంజినీర్. ప్రతీ విషయం లో నాని కి భయం ఎక్కువ. అటువంటి నాని ఒక సాంప్రదాయ బద్దమైన అమ్మాయి కోసం వెతుకుతూ , పెళ్లి చూపులు కి వెళ్తూ ఉంటాడు. ఇంకో పక్క దుబాయ్ లో ఒక లేడీ డాన్ బుల్లెట్ (సాక్షి చౌదరి) వుంటుంది. లేడీ డాన్ గా తనదే అక్కడ పై చేయిగా వుంటుంది. అయితే బుల్లెట్ కి హైదరాబాద్ లో వున్న కన్నతల్లి హాస్పిటల్ లో చేరుతుంది. కన్నతల్లి కోలుకోవాలంటే ఆమె ను సంతోషపెట్టే పనులు చేయాలని డాక్టర్ చెబుతాడు. దానితో కన్నతల్లి కోరికలు తీర్చడం మొదలు పెడుతుంది. అందులో భాగం గా అమ్మ కోరిక అయిన పెళ్లి కి ఒకే చెబుతుంది . ఒక పెళ్ళిళ్ళ మీడియేటర్ ద్వారా నాని (అల్లరి నరేష్) ని బుల్లెట్ (లేడీ డాన్ ) పెళ్లి చేసుకుంటుంది. నాని కి బుల్లెట్ డాన్ అన్నవిషయం బయటపడుతుంది . అక్కడి నుండి నాని ఎంతగా బయపడతాడు ... ? ఏమి చేస్తాడు ...? అన్నదే మిగిలిన కధ.
స్క్రీన్ ప్లే :
సినిమా డైరెక్టర్ పాయింట్ అఫ్ వ్యూ లో ఓపెన్ అవుతుంది. ముందుగా అల్లరి నరేష్ కుటుంబం చూపెట్టారు. ఆ తర్వాత అల్లరి నరేష్ క్యారక్టర్ ఎస్టాబ్లిష్ చేసారు . అతని భయానికి ఒక అమ్మాయి రిజెక్ట్ చేసి వెళ్లి పోతుంది. నెక్స్ట్ హీరోయిన్ (లేడీ డాన్) ని దుబాయ్ లో ఎస్టాబ్లిష్ చేసారు. హీరోయిన్ (లేడీ డాన్) హైదరాబాద్ రావడానికి ఒక ఫ్లాష్ కట్ కధ , ప్రాబ్లం ఎస్టాబ్లిష్ చేసారు.
హీరోయిన్ (లేడీ డాన్) పెళ్లి సంబంధాల కోసం వెతకడం , ఆ తర్వాత అల్లరి నరేష్ ని పెళ్లి చేసుకోవడం. అల్లరి నరేష్ కి తన భార్య అని తెలియకుండా కధ జరుగుతూ వెళ్ళడం , మిడ్ పాయింట్ దగ్గర అల్లరి నరేష్ కి ట్విస్ట్ రావడం జరుగుతుంది.
సెకండ్ హాఫ్ లో అల్లరి నరేష్ , తన భార్యనుండి తనను , తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి రక రకాల ప్లాన్స్ వేస్తూ ఉంటాడు ..ఆ ప్లాన్స్ అన్నీ బెడిసి కొడుతుంటాయి . ఫస్ట్ నుండి హీరోయిన్ (లేడీ డాన్) ని చంపాలని తిరుగుతున్న విలన్ మాఫియా బ్యాచ్ చివరికి అల్లరి నరేష్ ని పట్టుకుని చంపాలనుకోవడం ,అప్పుడు హీరోయిన్ (లేడీ డాన్) రావడం .చివరికి అల్లరి నరేష్ తన భార్య తో కలసి విలన్ మాఫియ బ్యాచ్ ని చంపడం తో సినిమా కంప్లీట్ అవుతుంది .
సినిమా కి కలసి వచ్చే అంశాలు :
- ఫస్ట్ హాఫ్ లో వచ్చే కామెడీ బాగుంది. అల్లరి నరేష్ సీన్ లు బాగున్నాయి.
- పృధ్వీరాజ్ సీన్ లు , కృష్ణ భగవాన్ సీన్ లు బాగున్నాయి. నవ్వు తెప్పిస్తాయి.
సినిమా ఈక్వేషన్ :
- “మర్యాద రామన్న” లాంటి హీరో + మాఫియా బ్యాక్ డ్రాప్ + “మిస్టర్ పర్ఫెక్ట్” లో తాప్సి రోల్ లాంటి లేడీ డాన్ + కామెడీ రన్ = జేమ్స్ బాండ్ (నేను కాదు నా పెళ్ళాం )
సినిమా ఎవరికి నచ్చుతుంది :
- సరదాగా నవ్వుకునే వారికి ఈ సినిమా నచ్చుతుంది.
- ఇంటర్ స్టూడెంట్స్ నుండి డిగ్రీ ఫస్ట్ ఇయర్ వరకు వున్న స్టూడెంట్స్ కి నచ్చుతుంది.
ఫైనల్ టచ్ : కాలక్షేపం చేస్తూ , సరదాగా నవ్వుకునే సినిమా ..
రేటింగ్ : 3.0/5