Review :Kumari 21F
కుమారి 21F- సుకుమార్ ట్రేడ్ మార్క్
Review :Kumari 21F
Surya Pratap
Raj Tarun, Heeba Patel
స్టోరీ లైన్ (ప్లాట్ ) : ఒక అమ్మాయి, ఒక అబ్బాయి ని ప్రేమించే క్రమంలో ప్రేమించిన అబ్బాయి ఆ అమ్మాయి తననే ప్రేమిస్తుందా అని ఒక అనుమానంతో వున్నా అబ్బాయి, ఆ అమ్మాయి కోసం తెలుసుకోవటానికి చేసిన ప్రయత్నమే ఈ కుమారి 21F కథ
స్టోరీ: ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కి చెందిన సిద్ధూ (రాజ్ తరుణ్) సింగపూర్ వెళ్లి సైటిల్ అవ్వాలని అనుకునే ప్రయత్నం లో కుమారి (హేబా పటేల్) సిద్దు లైఫ్ లోకి వస్తుంది. అందరి అమ్మాయిలా కాకుండా అబ్బాయిలు కి తీసిపోని విధంగా వుంటుంది. వారి మధ్య ప్రేమ బలపడుతున్న సమయం లో సిద్దు కి వున్నా ముగ్గురు ఫ్రెండ్స్ డబ్బు కోసం సిటీ లో దొంగతనాలు చేసుకుంటూ బ్రతుకుంటూ వుంటారు. కుమారి క్యారెక్టర్ మంచిది కాదని సిద్దు కి లేనిపోని చెబుతూ సిద్దు కి కుమారి మీద వున్నా అనుమానాలకి దోహదపడతాయి. సిద్దు ఫ్రెండ్స్ కి సిద్దు కి వున్నా అనుబందం ఎలాంటిది...? కుమారి గురించి తెలుసుకునే ప్రయత్నం లో సిద్దు కి ఎదురైనా అనుభవాలు ఏంటి...? సిద్దు ఫ్రెండ్స్ చేసే దొంగతనాలకి , కుమారి కి వున్నా సంబంధం ఏంటి...? అనేది తెర మీద చూడాల్సిందే.
స్క్రీన్ ప్లే : ఈ సినిమా కథ హీరో సిద్దు (రాజ్ తరుణ్) పాయింట్ ఆఫ్ వ్యూ లో చెప్పుకుంటూ వస్తాడు. కెజిబి కాలనీలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ లో తన అమ్మతో కలసి వుంటూ లైఫ్ లో వున్నా ఒకే ఒక్క గోల్ సింగపూర్ వెళ్ళాలి అనే ప్రయత్నాలు కొనసాగిస్తుంటాడు. సిద్దు కి వున్నా ముగ్గురు ఫ్రెండ్స్ శ్రీను (సుదర్శన్) , శంకర్ (నోయిల్) , సురేష్ (నవీన్) సిటీ లో దొంగతనాలు చేస్తూ చెడు మార్గం లో వెళ్తూ వుంటారు. అదే సమయం లో కాలని లోకి వచ్చిన కుమారి (హేబా పటేల్) సిద్దు ని తోలి చూపులోనే చూసి ఇష్టపడి I LOVE YOU చెబుతుంది. వాళ్ళ మధ్య ప్రేమ కొనసాగే ప్రయత్నం లో కుమారి అందరి అమ్మాయిలు లాగ కాకుండా సిద్దు తో క్లోజ్ గా మూవ్ అవ్వుతుంది. సిద్దు తో చేసే రోమాన్స్ అన్ని తనే ఫస్ట్ అని కుమారి సిద్దు కి చెబుతుంది. కానీ సిద్దు ఫ్రెండ్స్ మాత్రం కుమారి కూడా అందరి అమ్మాయిలు లాగే వుంటుంద అని కుమారి మీద ఒక నెగిటివ్ ఫీలింగ్స్ ని సిద్దు లోకి కలిగిస్తాడు. సిద్దు కుమారి గురించి తెలుసుకోవాలని ట్రై చేస్తాడు.
ప్లాట్ పాయింట్ 1 : సిద్దు తన ఫ్రెండ్స్ సహాయంతో కుమారి గురించి తెలుసుకునే ప్రయత్నం బెడిసికొడుతుంది. ఆ విషయం సిద్దు కి తెలిసిపోవటంతో కుమారి ఓపెన్ అవ్వుతుంది. సిద్దు కి ఇంకా మెచ్యురిటి కాలేదు అని చెప్పేస్తుంది.
ఇంటర్వెల్
సిద్దు కుమారి ని ప్రేమిస్తున్న , సిద్దు తన మెచ్యురిటి టెస్ట్ చేసుకోవటానికి సిద్దు తన క్లాస్ మెట్ మధు అనే అమ్మాయి తో క్లోజ్ గా వుంటూ కుమారి ముందు నటిస్తాడు. అవి ఏవి పట్టించుకోకుండా కుమారి లైట్ తీసుకుంటుంది. కానీ అదే క్రమం లో సిద్దు ఫ్రెండ్స్ కుమారి మీద కన్నేస్తారు.
ప్లాట్ పాయింట్ 2 : సిద్దు ఫ్రెండ్స్ సిటీ లో వున్నా బ్యాంకు ఎ.టి.యం దోచుకునే ప్రయత్నం లో కొన్ని ఆధారాలు కుమారి కి కంటపడేలా చేస్తారు. కుమారి ఆ ఆధారాలని పోలీసులకి ఇస్తుంది. పరారిలో వున్నా సిద్దు ఫ్రెండ్స్ కోసం పోలీసులు గాలిస్తుంటారు. అదే సమయంలో సిద్దు కి కుమారి గురించి నిజం తెలుస్తుంది. కుమారి అసలు పేరు మీరా అని తను ముంబై నుండి వచ్చింది అని , ముంబై లో వ్యభిచారం చేస్తుంటే పట్టుపడిన విడియో ఒకటి సిద్దు కంట పడుతుంది.
ప్రి –క్లైమాక్స్ : సిద్దు కుమారి గురించి తెలుసుకుని, సిద్దు కుమారి క్యారెక్టర్ తన ఫ్రెండ్స్ చెప్పిందే నిజం అని నమ్ముతాడు. కానీ కుమారి సిద్దు అడిగిన కోరికని తీరుస్తాను అని అంటుంది. కానీ తను కూడా అందరిలాగే ఆలోచిస్తున్నాను అని తప్పు తెలుసుకుని కుమారి ని కలవటానికి కుమారి ఇంటికి వెళ్తాడు. కానీ అప్పటికే సిద్దు ఫ్రెండ్స్ కుమారి కి మత్తు మందు ఇచ్చి రేప్ చేసేస్తారు. సిద్దు కుమారి ని ఆ పరిస్థితిలో చూసేసరికి కుమారి కి రేప్ చేసారు అనే విషయం తెలియకూడదు అని ఆ విషయాని దాచి సిద్దు కుమారి కి I LOVE YOU చెబుతాడు.
క్లైమాక్స్ : బ్యాంకు ఎ.టి.యం కేసులో తప్పించుకున్న సిద్దు ఫ్రెండ్స్ సిటీ నుండి పారిపోయి మూడు సంవత్సరాలు అయ్యింది అని కేసు కొట్టేస్తారు. కానీ సిద్దు తన ఫ్రెండ్స్ ని ఒక రహస్యమైన ప్లేస్ లో సంకెళ్ళతో బంధించి వాళ్ళకి ప్రతి రోజు ఫుడ్ తిసుకువెళ్తు వుంటాడు. సిద్దు ఫ్రెండ్స్ తో కుమారి ని పెళ్లి చేసుకున్నాను అని , నా లైఫ్ లో మెచ్యురీటి వచ్చింది అని కానీ మీ విషయం లో మెచ్యురీటి రాలేదు అని వాళ్ళని ప్రతి రోజు చిత్ర హింసలు చేస్తుంటాడు.
సినిమా కి కలిసోచ్చే అంశాలు :
- హేబా పటేల్ అద్బుతమైన నటన
- దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్
- స్క్రిప్ట్-స్క్రీన్ ప్లే
- క్లైమాక్స్
- ప్రస్తుతం యూత్ కి ఇచ్చే మెసేజ్
ఆడియన్స్ కి నచ్చిన అంశాలు :
- హేబా పటేల్ -రాజ్ తరుణ్ మధ్య వచ్చే సన్నివేశాలు
- దేవి శ్రీ ప్రసాద్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్
- యూత్ ని టార్గెట్ చేసుకుని ప్రస్తుతం వున్నా జనరేషన్ లో ప్రేమికులు మధ్య సమస్యలు ఏలా ఉంటాయో చూపించే సన్నివేశాలు ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యేలా చేస్తాయి.
సినిమా ఎవరికీ నచ్చుతుంది :
- ఆర్య , 100% లవ్ సినిమాల్ని ఇష్టపడే వారికీ ఈ సినిమా నచ్చుతుంది.
- ప్రస్తుతం యూత్ ని ఉద్దేశించి తీసిన సినిమా కనుక యూత్ అందరికి నచ్చుతుంది.
- మెసేజ్ ఒరింటేడ్ సినిమాల్ని ఇష్టపడే వారికీ ఈ సినిమా నచ్చుతుంది.
ఫినిషింగ్ టచ్ : సుకుమార్ ట్రేడ్ మార్క్
రేటింగ్ : 3.25 /5