Review: Mantra - 2
మంత్ర -2 మూవీ రివ్యూ
Review: Mantra - 2
S.V. Suresh
Charmy Kaur, Tanikella Bharani
స్టోరీ మెయిన్ ఐడియా :
ఒక అమ్మాయి (చార్మి) నిజజీవితం లో ఎక్కువ సేపు గడిపిన ఇంటిలో వ్యక్తులు ఆత్మ లు అయితే ఎలా వుంటుంది...? అనీ పాయింట్ మెయిన్ ఐడియా గా అల్లుకున్న కధ.
స్టోరీ : మంత్ర ఒక అనాధ. హాస్టల్ లో చదువుకుంటూ వుండే అమ్మాయి. హైదరాబాద్ లో జాబు రావడం తో వైజాగ్ నుండి హైదరాబాద్ వచ్చి , హాస్టల్ జీవితం వద్దు అనుకుని పేయింగ్ గెస్ట్ గా చేరాలని నిర్ణయించుకుంటుంది. ఆవిధంగా తనికెళ్ళ భరణి ఇంట్లో పేయింగ్ గెస్ట్ గా చేరుతుంది. తనికెళ్ళ భరణి ఫ్యామిలీ కి బాగా క్లోజ్ అవుతుంది మంత్ర.
అయితే హైదరబాద్ లో అడుగు పెట్టినప్పటి నుండి మంత్ర మీద హత్యా ప్రయత్నాలు జరుగుతూ వుంటాయి. వాటినుండి ప్రతీ సారి ఏదోలా మంత్ర తప్పించుకుంటూ వుంటుంది. మంత్ర కి కాలేజ్ లో క్లోజ్ వున్న అబ్బాయి చేతన్ ఒక పోలీస్ ఆఫీసర్. మంత్ర మీద దాడులు జరుగుతూ వున్న విషయం మీద ఆలోచిస్తుండగా చేతన్ ని ఒక రోజు మంత్ర తను పేయింగ్ గెస్ట్ వున్న ఇంటికి తీసుకుని వెళ్తే , చేతన్ ఆ ఇంట్లో ఎవరూ వుండటం లేదు అని రివీల్ చేస్తూ , తనికెళ్ళ భరణి ఫ్యామిలీ అంతా చనిపోయారని చెబుతాడు. క్రైమ్ రిపోర్ట్ లు రాసే ఒక బ్యాచ్ తో , పోలీస్ ఆఫీసర్ చేతన్ , మంత్ర ఆ ఇంటికి వెళ్లి ఇరుక్కు పోతారు. ఇక్కడ నుండి అందరూ బయట పడ్డారా ...? లేదా ...? అసలు తనికెళ్ళ భరణి ఫ్యామిలీ చనిపోవడానికి కారణాలు ఏమిటి...? అన్నీ సినిమా చూసి తెలుసుకోవాల్సిందే ...!
స్క్రీన్ ప్లే :
సినిమా డైరెక్టర్ పాయింట్ అఫ్ వ్యూ తో ఓపెన్ అయ్యింది . సినిమా పాయింట్ చెప్పి ట్విస్ట్ తో సినిమా ఓపెన్ చేసారు . తర్వాత ఛార్మి ని ఇంట్రడ్యూస్ చేస్తూ ,సాంగ్ తో మొదలు పెట్టారు . హీరోయిన్ పాయింట్ లో సినిమా వెళ్తూ వుంటుంది .
ఛార్మి హైదరాబాద్ వచ్చి పేయింగ్ గెస్ట్ గా చేరడం తో కధ మలుపు తిరుగుతుంది .అక్కడనుండి ఛార్మి పై ఎటాక్స్ మరియు చార్మీ లైఫ్ ని పేయింగ్ గెస్ట్ చూపిస్తూ వెళ్తారు ...మిడ్ పాయింట్ దగ్గర కి వచ్చే సరికి ట్విస్ట్ చార్మీ , ఆడియన్ పాయింట్ అఫ్ వ్యూ లో ఇచ్చారు .
ఇంటర్వెల్ తర్వాత సస్పెన్స్ , కాస్త హారర్ ఫీలింగ్ వచ్చేలా వెళ్తూ టెన్షన్ ని రైజ్ చేస్తూ వెళ్లారు .ప్రీ క్లైమాక్ష్ కి వెళ్లేసరికి చార్మీ అంతా చేసినట్టుగా , చార్మీ దెయ్యం గా చూపెట్టారు. అప్పుడు ఇది నిజం కాదు అనుకునేలా , ప్రధాన మైన ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఓపెన్ చేయడం చేసారు.
చివరికి కధ లో వున్న రివెంజ్ తీరడం తో సినిమా కంప్లీట్ అవుతుంది.
సినిమా కి కలసి వచ్చే అంశాలు :
- సినిమా కధ లో చార్మీ , తనికెళ్ళ భరణి , డిల్లీ రాజేశ్వరి నటన
- సస్పెన్స్ , హారర్ వున్న సీన్ లు
- తనికెళ్ళ భరణి ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్
- చార్మీ సాంగ్
సినిమా ఈక్వేషన్ :
“బూచమ్మా బూచాడు” ఫస్ట్ హాఫ్ లో దెయ్యాలు మంచి గా కనిపిస్తూ వుంటే +”మంత్ర” సినిమా మొత్తం హౌస్ లో జరిగినట్టు వుండే “సెకండ్ హాఫ్” = మంత్ర 2
సినిమా ఎవరికీ నచ్చుతుంది ...?
- సస్పెన్స్ , హారర్ సినిమా చూసే వాళ్ళు ఇష్టపడతారు.
- యూత్ లో కొంత మంది కి నచ్చుతుంది.
ఫైనల్ టచ్ : మంత్ర 1 తో పోలిస్తే దానికి సగానికి రీచ్ అయ్యింది.
ఫైనల్ రేటింగ్ : 2.75/5