Review :Mayuri Movie
మయూరి : ఆడియన్స్ ని హడలెత్తించే హరర్ర్ మూవీ
Review :Mayuri Movie
Ashwin Saravanan
Nayanatara ,Aari
స్టొరీ లైన్ (ప్లాట్ ) : వాస్తవప్రపంచం లో వున్నా మయూరి కి , మాయవనం వున్నామాయ అనే ఆత్మ కి జరిగే సంఘటనల్లో మయూరి తెలుసుకున్న నిజాలకి మయూరి ఏలా అనుభూతి పొందిందో ఈ సినిమా కథ.
స్టొరీ : మాయవనంభయంకరమైన అడవిలో ఒక ఆత్మ తిరుగుతుంది అని తెలిసి ఆ ఆత్మ మీద పరిశోదనలు స్టార్ట్ చేస్తారు. మరో వైపుఆ ఆత్మ మీద సినిమా తీస్తారు. ఆ సినిమా కథ , పరిశోధన ఒక వైపు జరుగుతుంటే ,మరోవైపు డబ్బు కోసం జూనియర్ ఆర్టిస్ట్ గా చిన్నచిన్న క్యారెక్టర్స్ చేసుకుంటున్న జీవనం గడుపుతున్న మయూరి (నయనతార ) తన భర్త నివదిలేసి తన పాప తో కలసి జీవిస్తూ వుంటుంది. అదే సమయం లో మాయవనం లో ఆత్మ మీద సినిమాని తీసి రిలీజ్ చెయ్యటానికి కష్టాలుపడుతున్న డైరెక్టర్ ప్రమోషన్స్ కోసం తను తీసిన సినిమా ని ఒంటరిగా చూస్తే ఐదు లక్షల రూపాయిలు ఇస్తాను అని ప్రకటిస్తాడు. సినిమాఒంటరిగా చూసిన ఒక వ్యక్తీ చనిపోతాడు. అదే సమయం లో మయూరి కి ఆఫర్స్ లేక డబ్బు కోసం సినిమా ఒంటరిగా చూస్తాను అని కమిట్ అవుతుంది. ఆసినిమా చూస్తునప్పుడు మయూరి ఆ మాయవనం ప్రపంచం లోకి వెళ్ళిపోతుంది. అక్కడ ఆ ఆత్మ కి మయూరి కి వున్నా సంబంధం ఏంటి..? ఆ ఆత్మచెప్పాలనుకొన్న విషయం ఏంటి ...? మయూరి తిరిగిమాయవనం లో నుండి రియల్ ప్రపంచం లోకి ఏలావచ్చింది...? ఐదు లక్షల ప్రైజ్ మని గెలిచిందా...లేదా...అనేది మిగిలిన కథ తెర మీదచూడాల్సిందే...?
స్క్రీన్ ప్లే : సినిమా లోరెండు కథలు జరుగుతుంటాయి. ఒక అపార్ట్ మెంట్ లో వికాస్ (ఆరి ) తన ఫ్రెండ్ కి మాయవనం లో మాయఅనే ఆత్మ గురించి స్టొరీ చెబుతూ వుంటాడు.ప్రొఫెసర్ మాయవనం లో ఆత్మ గురించి రిసెర్చ్ చేస్తుంటారు. మరో వైపు మాయవనం లో వున్నా ఆత్మ మీద ‘’చీకటి ‘’ అని టైటిల్ తో సినిమా తీసి దాన్నిరిలీజ్ చేసే ప్రయత్నం లో వుంటాడు.
మయూరి (నయనతార) తన భర్త నివదిలేసి సంవత్సరం వయస్సు వున్నా పాప తోకలసి ఒక ఇంట్లో పేయింగ్ గెస్ట్ గా వుంటుంది. సినిమా లో చిన్న చిన్నక్యారెక్టర్స్ చేస్తూ జీవనం సాగిస్తున్నమయూరి లైఫ్ లో డబ్బు చాలా అవసరం పడుతుంది.
ప్లాట్ పాయింట్ 1 : మాయవనం లో ఆత్మమీద పరిశోధన చేస్తున్న వాళ్ళు వరుసగా చనిపోతూ వుంటారు. అదే ఆత్మ మీద సినిమా తీసిన డైరెక్టర్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ‘’సినిమా ని ఒంటరిగా చూస్తే ఐదు లక్షల ‘’ఇస్తాను అని ప్రకటిస్తాడు.
పించ్ పాయింట్ 1 : సినిమా చూడటానికి ఒకరు సాహసం చేస్తాడు. కానీ సినిమాచూస్తూనప్పుడు ఆ వ్యక్తీ చనిపోతాడు. ఆచనిపోయిన వ్యక్తీ కి , మయూరి కి సంబంధం వుంటుంది.
ఇంటర్వెల్
పించ్ పాయింట్ 2 : డబ్బు కోసం చివరి ప్రయత్నం కూడా ఫెయిల్ అవ్వటం తో , ఇకచేసేదిలేక మయూరి ఆ సినిమా ని ఒంటరిగా చూడటానికి ఒప్పుకుంటుంది.
ప్లాట్ పాయింట్ 2 : మయూరి సినిమాచూడటానికి రెడీ అవ్వుతుంది. సినిమా చూస్తూనప్పుడు మయూరి ఆ మాయవనం ప్రపంచం లోకి వెళ్ళిపోతుంది. ఆమాయవనం లో మాయ (ఆత్మ) కి సంబందించినవస్తువులో ఒక డైమండ్ రింగ్ కోసం కొంత మంది సమాధులు తవ్వుతుంటారు. మాయవనం లో ఆత్మ మీద పరిశోధన చేస్తున్న వాళ్ళు చనిపోయిన పోవటం వెనక వున్నా కారణం కోసం తెలుసుకోవటానికి అదే టైం లో వికాస్ (ఆరి )మాయవనం లోకి వస్తాడు.
డైమండ్ రింగ్ కోసం సమాధులుతవ్వుతున్న గ్యాంగ్ ని వికాస్ చూస్తాడు. అదే టైం లో అక్కడికి మయూరి వస్తుంది. ఆసమయం లో డైమండ్ రింగ్ కోసం సమాధితవ్వుతుంటే మాయ ఆత్మ బయటపడుతుంది.
ప్రి-క్లైమాక్స్ : మాయ ఆత్మ బయట పడటం తో దానికి కారణం అయ్యిన వాళ్ళనిచంపుకుంటూ వస్తుంది. ఆ ప్రయత్నం లో మయూరికి ఒక నిజం తెలుస్తుంది. మాయవనం లో ఆత్మగా తిరుగుతున్న మాయ ఆత్మ ఎవరో కాదు తన తల్లి అని తెలుసుకుని వాస్తవ ప్రపంచానికి తిరిగి వస్తుంది. కానీ మాయవనం లో ఆత్మ దగ్గరడైమండ్ వుండదు. అది ఏమి అయ్యిందో ఎవరికీతెలియదు.
క్లైమాక్స్ : ఒంటరిగా ‘’చీకటి’’సినిమా చూస్తే ఐదు లక్షల ఇస్తాను అని డైరెక్టర్ ఇచ్చిన ప్రకటన లో మయూరి గెలుస్తుంది.కానీ ఆ సినిమా లో తెలుసుకోవాల్సిన నిజాలుచాలా వున్నాయి అని డైరెక్టర్ మయూరి నిపెట్టి ‘’ చీకటి –పార్ట్ 2’’ సినిమా ప్లాన్ చేస్తాడు. షూటింగ్ స్టార్ట్ అయిన మొదటి రోజే ఒక సంఘటన ద్వారా ఆ సినిమా తీసినడైరెక్టర్ చనిపోతాడు. ఆ డైమండ్ రింగ్ బయటపడుతుంది.
కలిసొచ్చే అంశాలు :
- కాన్సెప్ట్ కొత్తగా వుండటం
- ఇంటర్వెల్ ఎపిసోడ్ & క్లైమాక్స్ ఎపిసోడ్
- ఆర్ట్ డిపార్టమెంట్ & సినిమాటోగ్రఫి పనితీరు
సినిమా ఎవరికీ నచ్చుతుంది :
- హర్రర్ ని ఎంజాయ్చేసేవారికి ఈ సినిమా బాగా నచ్చుతుంది.
- రొటీన్ సినిమాలు చూసి చూసి బోరింగ్ గా ఉన్నవారికి ఈ సినిమా నచ్చుతుంది
సినిమా ఫార్ములా : ‘’యే ఫిల్మ్ బైఅరవింద్’’ సినిమా లో రైటర్ రాసుకున్న స్టొరీ యే , ఆ సినిమా లో జరుగుతూ వుండటం ఏలా వుంటుందో , ఆ సినిమా లో సైకోప్లేస్ లో డైమండ్ ని కనిపెట్టటం కోసం చేసేప్రయత్నమే = ''మయూరి''
ఫినిషింగ్ టచ్ : థియేటర్ లో ప్రేక్షకులను 100% భయపెట్టిస్తుంది.
రేటింగ్ : 3.25 /5