Review: Size Zero
సైజ్ జీరో : ఆడియన్స్ కనెక్ట్ కానీ సోషల్ మెసేజ్
Review: Size Zero
Prakash Kovelamudi
Anushka Shetty, Arya
స్టోరీ లైన్ (ప్లాట్ ) : ప్రస్తుతం కాలం లో వున్నా భారీ సైజ్ కలిగివున్న అమ్మాయి కి పెళ్లి అవ్వటం లేదు అని, అందరి అమ్మాయిలాగా జీరో సైజు అవ్వాలని చేసే ప్రయత్నం లో ఆ అమ్మాయి కి ఎదురైనా సంఘటనలు సముహరమే ఈ సైజ్ జీరో సినిమా కథ
సినిమా కథ : సౌందర్య (అనుష్క) చిన్నతనం నుండి బొద్దుగా పెరుగుతూ పెద్ద అయ్యేసరికి ఒక భారీ సైజ్ కనిపించేలాగా వుండటం వలన ఆమెని పెళ్లి చేసుకోవటానికి ఎవ్వరు ముందుకు రారు. ఎప్పుడు తిండే ప్రపంచం అని లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్న సౌందర్య ని పెళ్లి చేసుకోవటానికి అభి (ఆర్య) ఒకే చెబుతాడు. కానీ ఎవ్వరు ఉహించిన విధంగా సౌందర్య అభిని రిజెక్ట్ చేస్తుంది. సౌందర్య అభి తో ఫ్రెండ్ షిప్ చేస్తూ ట్రావెల్ అవ్వుతున్న సమయం లో సౌందర్య అభితో ప్రేమలో పడుతుంది. అలాంటి సమయంలో అభి లైఫ్ లోకి సిమ్రాన్ (సోనాలి చౌహాన్) ఎంటర్ అవ్వుతుంది. అది చూసి జీర్ణించుకోలేని సౌందర్య సిమ్రాన్ మైంటైన్ చేసే సైజ్ జీరోలాగ తనకూడా అలా అవ్వాలని సత్యానంద్ (ప్రకాష్ రాజ్) పెట్టిన సైజ్ జీరో ట్రైనింగ్ కి వెళ్ళుతుంది. ఆ ట్రైనింగ్ లో భాగంగా సత్యానంద్ పెట్టిన సైజ్ జీరో సెంటర్ లో జరుగుతున్న మోసాల చూసిన సౌందర్య సత్యానంద్ చేస్తున్న పనులకి అడ్డం పడుతుంది. సత్యానంద్ చేస్తున్న మోసాలు ఏంటి...? సౌందర్య అతను చేసిన మోసలని ఏ విధంగా బయటపెట్టింది...? సౌందర్య చివరికి సైజ్ జీరో అయ్యిందా...? ఇవన్ని తెలుసుకోవాలంటే తెర మీద చూడాల్సిందే ...!
స్క్రీన్ ప్లే : సైజ్ జీరో కథ సౌందర్య (అనుష్క) వాయిస్ ఓవర్ లో స్టార్ట్ అవ్వుతూ సౌందర్య చిన్నతనం నుండి పెరిగి పెద్ద వయస్సు వచ్చేసరికి అనుష్కని ఒక బొద్దుగా వున్నా అమ్మాయి లాగ కనిపిస్తుంది. సౌందర్య తల్లి రాజేశ్వరి (ఊర్వశి) తన కూతురికి పెళ్ళే చేసే బాధ్యత తన మీద వేసుకుని ఏలాంటి లోటు లేకుండా తండ్రి లేని లోటు లేకుండా గారభంగా పెంచుతుంది. ఎప్పుడు తిండి మీదే ధ్యాస వుండే సౌందర్య కి వచ్చే ప్రతి సంబందం సౌందర్య అవతారం చూసి సౌందర్య ని పెళ్లి చేసుకోవటానికి ఎవ్వరు ముందుకు రారు.
ప్లాట్ పాయింట్ 1 : వచ్చిన ప్రతి సంబంధం కాన్సిల్ అవ్వటం తో సౌందర్య మార్కెట్ లోకి వచ్చిన సైజ్ జీరో ట్రైనింగ్ కి వెళ్దామని అనుకుంటుంది. కానీ మూడు నెలలు వరుకు ఆ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ లో సీట్ రాకపోయేసరికి సిట్ కోసం ప్రయత్నాలు లో వున్నా సమయం లో సౌందర్య లైఫ్ లోకి అభి ( ఆర్య) రూపంలో పెళ్లి చేసుకోవటానికి ముందుకు వస్తాడు. కానీ సౌందర్య అభి తో పెళ్ళికి ఒప్పుకోకుండా అతనితో ఫ్రెండ్ షిప్ చేస్తూ అతని తో ట్రావెల్ చేస్తున్న సమయం లో అభి తో లవ్ లో పడుతుంది.
సౌందర్య అభి కి ప్రేమిస్తున్నాను అన్న విషయం చెప్పే సమయం లో సిమ్రాన్ (సోనాలి చౌహాన్) అభి లైఫ్ లోకి వస్తుంది. ఒక వైపు సౌందర్య అభి తో ప్రేమ లో వుంటే , మరో వైపు అభి –సిమ్రాన్ లవ్ లో వుంటారు. ఈ ముగ్గరు మధ్య లవ్ జర్నీ సాగుతున్న సమయం లో సౌందర్య సైజ్ జీరో అవ్వాలని సత్యానంద్ (ప్రకాష్ రాజ్) పెట్టిన సైజ్ జీరో ట్రైనింగ్ సెంటర్ లో జాయిన్ అవ్వటానికి సిద్దం అవ్వుతుంది.
ఇంటర్వెల్
సౌందర్య సైజ్ జీరో ట్రైనింగ్ లో జాయిన్ అయ్యిన తర్వాత సత్యానంద్ ఇచ్చే ట్రీట్ మెంట్ ని ఫాలో అవ్వుతూ వుంటుంది. సత్యానంద్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అయ్యి మోడల్ గా ప్రయత్నాలు చేస్తున్న సౌందర్య ఫ్రెండ్ జ్యోతి కి సత్యానంద్ ఇచ్చే ట్రీట్ మెంట్ ఫెయిల్ అవ్వటం తో జ్యోతి మెడికల్ చెక్ అప్ లో కొన్ని నిజాలు బయటపడతాయి. సత్యనంద్ సైజ్ జీరో పేరిట ఇస్తున్న ట్రీట్ మెంట్ వలన జ్యోతి కిడ్ని ఫెయిల్ అయ్యింది రిపోర్ట్ లో వస్తుంది.
ప్లాట్ పాయింట్ 2 : జ్యోతి కి జరిగిన దారుణాన్ని చూసిన సౌందర్య సత్యానంద్ ఇచ్చే సైజ్ జీరో ట్రీట్మెంట్ మీద ఎదురు దాడి దిగుతుంది. కానీ సత్యానంద్ వున్నా పలుకుపడి వలన సౌందర్య చెప్పిన వాటిని ఎవ్వరు నమ్మారు. దాంతో సౌందర్య అభి-సిమ్రాన్ సహాయం తీసుకుని సత్యానంద్ చేస్తున్న మోసాలకి బయట పెట్టే మార్గాలకి నాంది పలుకుతుంది.
ప్రి-క్లైమాక్స్ : మార్కెట్ లోకి వచ్చిన ఒక ప్రోడక్ట్ ద్వారా అందరికి అర్థం అయ్యే రీతిలో సౌందర్య అభి తో పాటు సిమ్రాన్ కలసి అందరిలో చైతన్యం తీసుకురావటానికి ట్రై చేస్తుంటారు. అనుష్క చేసిన ఈ పనికి కొత్త మంది సినిమా స్టార్స్ తనవంతు ప్రమోషన్స్ చేస్తారు. మరో వైపు సౌందర్య ఫ్రెండ్ జ్యోతి తో సత్యానంద్ కోటి రూపాయిలు డీల్ సెట్ చేసే నిజాన్ని బయటకి రాకుండా ఆపాలని ప్రయత్నాలు చేస్తుంటాడు.
క్లైమాక్స్ : సౌందర్య ఫ్రెండ్ జ్యోతి నిజాన్ని దాద్దామని ప్రయత్నం చేసిన సత్యానంద్ కి సంబంధించిన ఒక విడియో ద్వారా సౌందర్య సత్యానంద్ కి ఫుల్ స్టాప్ పెట్టేస్తుంది. మరో వైపు అభి స్వయంగా వచ్చి సౌందర్య ని పెళ్ళిచేసుకుంటాను అని చెప్పటం తో కథ ముగుస్తుంది.
కలిసోచ్చే అంశాలు :
- అనుష్క ఆల్ రౌండర్ పెర్ఫార్మన్స్
- నిరవ్ షా సినిమాటోగ్రఫీ విజువల్స్
- కీరవాణి అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్
- ఫస్ట్ హాఫ్ లో అక్కడక్కడ వచ్చే కామెడి సన్నివేశాలు
- సోషల్ మెసేజ్ ఇచ్చే ఎలిమెంట్స్
సినిమా ఫార్ములా :
- అల్లరి నరేష్ ‘లడ్డు బాబు’ సినిమా కి సోషల్ మెసేజ్ మిక్స్ చేస్తే = సైజ్ జీరో
- సైజ్ జీరో సినిమా చూసిన తర్వాత అప్పట్లో రాజేంద్ర ప్రసాద్ నటించిన ‘కొబ్బరి బొండం’ , అల్లరి నరేష్ ‘కితకితలు’, కృష్ణుడు నటించిన ‘వినాయకుడు’ లాంటి సినిమాలు ఆడియన్స్ కి గుర్తుకు వస్తాయి.
సినిమా ఎవరికీ నచ్చుతుంది :
- అనుష్క సినిమాలని ఇష్టపడే వారికీ ఈ సినిమా నచ్చుతుంది.
- రియల్ లైఫ్ లో సైజ్ జీరో అవ్వాలని ట్రై చేసే అమ్మాయిలకు ఈ సినిమా ని చూడాలని ఇంటరెస్ట్ చూపుతారు.
- మెసేజ్ ఒరింటేడ్ సినిమాలని ఇష్టపడే వారికీ ఈ సినిమా నచ్చుతుంది
ఫినిషింగ్ టచ్ : సైజ్ జీరో - ఆడియన్స్ కనెక్ట్ కానీ సోషల్ మెసేజ్
రేటింగ్ : 2.75 /5