Top

Review: Srimanthudu Movie

శ్రీమంతుడు - పెద్ద మనసున్న కమర్షియల్ సినిమా

Source: General

By: Durga Ramesh

Critic's Rating: 3/5

Saturday 08 August 2015

Movie Title

Review: Srimanthudu Movie

Director

Koratala Siva

Star Cast

Mahesh Babu , Shruti Haasan , Jagapathi Babu

స్టోరీ మెయిన్ ఐడియా  : తండ్రి పూర్తి చేయలేని పనిని (గ్రామాన్ని బాగు చేయడం), కొడుకు పూర్తి చేయడం కోసం ఎంతగా శ్రమించాడు ,ఎంత మందిని ఎదిరించాడు అన్నదే కధ మెయిన్ ఐడియా ...

స్టోరీ: హర్ష వర్ధన్ ( మహేష్ బాబు ) ఒక కోట్ల  ఆస్తులు వున్న రవి కుమార్ ( జగపతి బాబు ) కి ఒక్కగానొక్క  కొడుకు . హర్ష డబ్బులో పుట్టినా కుడా , సాధారణం గా గడిపే మనస్తత్వం వున్న వాడు . హర్ష ఆలోచనలు అన్నీ తండ్రి రవి కుమార్ కి వింతగా వుంటాయి. తన తర్వాత తన కంపెనీలను చూసుకునే వారసుడు గా హర్ష ని తీసుకు వద్దామని తండ్రి రవి కుమార్ ప్రయత్నిస్తూ ఉంటాడు. కానీ హర్ష తనకు నచ్చింది చేసుకుని వెళ్తూ ఉంటాడు.

ఇలా వున్న హర్ష కి అనుకోకుండా చారు శీల ( శ్రుతి హాసన్) తన జీవితం లోకి ప్రవేశిస్తుంది . దానితో హర్ష ,చారుశీల చదువుతున్న  విలేజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ కోర్స్ లో జాయిన్ అవుతాడు. హర్ష , చారు శీల ప్రేమలో పడతారు . అయితే హర్ష మిలియనీర్ రవి కుమార్ అబ్బాయి అని తెలిసి , హర్ష ని దూరం పెడుతుంది చారు శీల. చారు శీల  ద్వారా తన సోంత వూరి మూలాలు తెలుసుకుని , దేవరకోట కి బయల్దేరుతాడు హర్ష

దేవరకోట కి వెళ్లి హర్ష వూరి లో స్కూల్ కట్టడానికి డబ్బు ఇస్తూ , ఊరిని దత్తత తీసుకున్నానని ప్రకటిస్తాడు . వూరి ని బాగు చేస్తున్న క్రమం లో హర్ష కి ఎవరికీ ఎదురు తిరిగాడు ? హర్ష కి వాళ్ళకి సంబంధం ఏమిటి ? వూరి ని దత్తత తీసుకున్న హర్ష చివరికి చారు శీల మనసు గెలుచుకున్నడా ? అనే విషయాలన్నీ తెరమీద చూడాల్సిందే ...

స్క్రీన్ ప్లే :

శ్రీమంతుడు సినిమా మొత్తం డైరెక్టర్ పాయింట్ అఫ్ వ్యూ లో సాగుతుంది . సినిమా ఓపెన్ అవ్వడమే రవికుమార్ ( జగపతి బాబు) ని మిలయనీర్ గా ఎస్టాబ్లిష్ చేస్తారు . కంపెనీ వాళ్ళు శ్రీరామనవమి కి పిలిస్తే జగపతి బాబు రాను అని అంటాడు .అప్పుడురామా రామఅనే పాటలో  హీరో మహేష్ ని ఇంట్రడ్యూస్ చేసారు . హీరో క్యారక్టర్ ఎలివేషన్ కోసంకంపెనీ లో ఒక మిడిల్ క్లాస్ మ్యారేజికి మహేష్ బాబు సహాయం చేస్తాడు

ప్రాబ్లం ఎస్టాబ్లిష్

డైరెక్టర్ పాయింట్ అఫ్ వ్యూ లో  “దేవరకోటఅనే వూరి లో కొన్ని ఇన్సిడెంట్స్ , ప్రాబ్లం ఎస్టాబ్లిష్ చేస్తూ వస్తారు . వూరి ని వదిలి వెళ్లి పోతున్న గ్రామస్తులను చూపుతారు. ఇక్కడే విలన్ సంపత్ ని, గ్రామస్తులలో రాజేంద్ర ప్రసాద్ ,శివాజీ రాజా ని ఎస్టాబ్లిష్ చేస్తారు .

తర్వాత హీరోయిన్ ని ఇంట్రడ్యుస్ చేసారు . హీరోయిన్హీరో పరిచయం , వీల్లిద్దరి మధ్య లవ్ కెమిస్ట్రీ నడుపుతూ వెళ్తారు

జగపతి బాబు కంపెని కి ,ఫ్యామిలీ కి ఒక ప్రాబ్లం వస్తుంది . దాని కోసం మహేష్ బాబు డిల్లీ వెళ్లి ,మెయిన్ విలన్ అయిన ముఖేష్ రుషి ని  సెంటిమెంట్ తో కొట్టి , బెదిరించి వస్తాడు . దీని రియాక్షన్స్ ఒక ఫైట్ గా వచ్చేలా చేసారు .

మహేష్ – శ్రుతి హాసన్ ప్రేమ విషయం చెప్పే ముందు ,మహేష్  మిలియనీర్ కొడుకు అని తెలిసి పోతుంది .దానితో  మహేష్ కిమీ సొంత ఊరు దేవర కోటఅని చెబుతుంది. అక్కడ నుండి మహేష్ దేవరకోట కి బయల్దేరుతాడు

ప్లాట్ పాయింట్ -1 :

దేవరకోట మనుషులను చంపబోతున్న మనుషులను  మహేష్ ఫైట్ చేసి కాపాడటం తో సినిమా ఇంటర్వెల్ కి వస్తుంది . ఇక్కడ హీరో ప్రాబ్లం దగ్గరకి వచ్చాడు...అందులోకి దిగ బోతున్నాడు అని హింట్ ఇచ్చారు.

సెకండ్ హాఫ్ :

వూరి లో దిగిన మహేష్ బాబుశ్రుతి హాసన్ తండ్రి రాజేంద్ర ప్రసాద్ కి ఎదురు ఇంట్లో ఉంటూ ,వూరిలో స్కూల్ కట్టడానికి , రోడ్స్ వేయడానికి పూనుకుని , వూరి ని దత్తత తీసుకున్నట్టు ప్రకటిస్తాడు

వూరి లోకి అడుగు పెట్టిన శ్రుతి హాసన్ కి ఇదంతా నా ప్రేమ కోసం ఇదంతా చేస్తున్నాడని అనుకుని , మహేష్ ని దూరం పెడుతుంది

వూరి లో బాగా కలసిపోయిన మహేష్ ,విలన్ చేస్తున్న వాటికి ఎదురుతిరుగుతాడు . దానితో రాజేంద్ర ప్రసాద్ ఒక ఫ్లాష్ బ్యాక్ వివరిస్తాడు . రాజేంద్ర ప్రసాద్ వాయిస్ ఓవర్ తో  మహేష్ తండ్రి జగపతి బాబు గురించి ,తను వూరి ని బాగు చేద్దామని అనుకున్న దాని గురించివిలన్ లు జైలు కి పంపడం గురించి వివరిస్తారు .

ప్లాట్ పాయింట్ -2 :

ఫ్లాష్ బ్యాక్ అయిన తర్వాత మహేష్ విలన్ కి ఎదురు వెళ్తాడు . వాళ్ళు మహేష్ ని చంపాలని చూస్తారు . అయితే మహేష్ కి కత్తి పోటు  వలన , తను కట్టిన హాస్పిటల్ లోనే ట్రీట్మెంట్ చేస్తారు

ప్రీ క్లైమాక్ష్

మహేష్ ని తీసుకెల్లిపోవడానికి జగపతి బాబు వస్తాడు . వూరి నుండి తీసుకెళ్ళి పోతాడు . వూరి నుండి మహేష్ వెళ్లి పోగానే గ్రామస్తుల నుండి పొలాలు బలవంతం గా గుంజుకుంటారు విలన్లు . మహేష్ కంపెనీ పనుల్లో ఉంటాడు . చివరికి మహేష్ వూరి కి వెళ్తాను అని చెప్పి వూరి కి వస్తాడు .

క్లైమాక్ష్ :

అప్పటికే విలన్ చేత ఇబ్బంది పడిన గ్రామస్తులను చూసి , విలన్స్ ని చంపేస్తాడు మహేష్.

సినిమా కి కలసి  వచ్చే అంశాలు

  • మహేష్ బాబు క్యారక్టర్ , యాక్టింగ్ 
  • సోంత వూరి దత్తత అనే  కనేక్టివ్ పాయింట్ 
  • మహేష్శ్రుతి హాసన్ మధ్య వచ్చే సీన్ లు 
  • గ్రామం లో వచ్చే సెంటిమెంట్ సీన్ లు 
  • హుషారుగా వున్న దేవి శ్రీ ప్రసాద్ పాటలు 

సినిమా ఈక్వేషన్ :

హిందీస్వదేశ్సినిమా ని బాగా ఎక్స్టెండ్ చేస్తే .....లేదామిర్చిసినిమా లోవీలైతే ప్రేమిద్దాం డ్యూడ్”  ప్లేస్ లోగ్రామం మీద ప్రేమఅనే పాయింట్ పెడితే   = శ్రీ మంతుడు ..

సినిమా ఎవరికి  నచ్చుతుంది

  • సినిమా లో మహేష్ బాబు స్టూడెంట్ గా కనిపిస్తాడు , సాధారణ లవర్ లా యాక్టింగ్ చేయడం వలన యూత్ బాగా కనెక్ట్ అవుతారు
  • సినిమా లో  ఫ్యామిలీ కి సంబంధించిన సీన్ లు వున్నాయి . అవి ఫ్యామిలీ కి పడతాయి .
  • సినిమా లో యూనివర్సల్ పాయింట్సొంత వూరి మీద వుండే ప్రేమ ,దాన్ని బాగుచేయాలనే పాయింట్ , గ్రామం దత్తత ..ఇవన్నీ సిటీ లో వున్న వూరి వాళ్ళకు కనెక్ట్ అవుతుంది ...

ఓవరాల్ గా సినిమా అందరికీ నచ్చుతుంది ....

ఫైనల్ టచ్ : ఒక కనెక్టివిటీ తో నిండి వున్న కమర్షియల్ సినిమాశ్రీమంతుడు

రేటింగ్ : 3.8/5

recent reviews

Keshu Ee Veedinte Naadhan

Time pass comedy entertainer

Plan Panni Pannanum

Average comedy entertainer

Velan

Decent rural family entertainer

Meow

Soubin Shahir and Mamta Mohandas shine in this conventional film

Read more

galleries