Singam 123 movie review
సింగం 123 సంపూర్నేష్ బాబు కామెడీ మూవీ
Singam 123 movie review
Akshat Ajay Sharma
Sampoornesh Babu
స్టోరీ మెయిన్ ఐడియా : ఇప్పటి వరకు వచ్చిన పోలీస్ క్యారెక్టర్ ల మీద వెటకారం చేస్తూ వెళ్ళే కధ గా సింగం 123 ని మలచడమే మెయిన్ కధ ...
స్టోరీ : సింగం ( సంపూర్నేష్ బాబు ) ఒక పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్. సింగం ఎక్కడున్నా అక్కడ ప్రాబ్లమ్స్ వుండవు . ప్రాబ్లమ్స్ వున్న చోటుకే సింగం వెళ్తాడు . అలాంటి సింగం సింగరాయకొండ లో లింగం( భవానీ చౌదరి) అనే వ్యక్తి చేసే దారుణాలను ఆపడానికి స్పెషల్ గా వెళ్తాడు. సింగం కి –లింగం కి ఒక ఫ్లాష్ బ్యాక్ లో రివెంజ్ పాయింట్ కుడా ఉంటుంది. అదేమిటంటే సింగం తండ్రి జంగం (పృద్వీ రాజ్ )ని ఒకప్పుడు లింగం బావి లో వేసి చంపుతాడు . దానికి ప్రతీకారం తీర్చుకోవడానికి సింగం సింగరాయ కొండ వెళ్తాడు. సింగం కి సింగరాయ కొండ లో ఒక ప్రేయసి దొరుకుతుంది.
డ్యూటీ లో భాగంగా సింగం – లింగం కి ప్రతీ విషయం లో ఎదురెల్తాడు. దీనితో లింగం – సింగం ని ఎలా అయినా చంపాలని చూస్తాడు. సింగం ని ,సింగం ప్రేయసి ని ఒకేసారి చంపేసే ప్లాన్ వేస్తాడు. ఇక్కడ సింగం చనిపోగానే , సింగం ని బావి లో పడేస్తారు.
చనిపోయిన సింగం మళ్ళీ ఎలా వచ్చాడు ....? వచ్చి లింగం ను ఎలా అంతం చేసాడు ...? అసలు సింగం పోలీస్ ఎలా అయ్యాడు అన్నదే కధ ....
స్క్రీన్ ప్లే :
విలన్ ఇంట్రడక్షన్ తో సినిమా మొదలు అవుతుంది . సింగరాయ కొండ లో వున్న ప్రాబ్లం ని ఎస్టాబ్లిష్ చేసి ,స్టొరీ పాయింట్ చెప్పారు . ఆ తర్వాత సంపూర్నేష్ బాబు ఇంట్రడక్షన్ ..
టర్నింగ్ పాయింట్ 1 : సంపూర్నేష్ బాబు సింగరాయ కొండ వెళ్ళడం మొదటి టర్నింగ్ పాయింట్. కధ ఇక్కడినుండే మలుపులు తిరగడం ప్రారంభం అవుతుంది.
యాక్షన్ – రియాక్షన్ : హీరో సంపూర్నేష్ బాబు –విలన్ లింగం కి మధ్య వార్ జరుగుతుంది. ఇది ఇంటర్వెల్ వద్ద బ్రేక్ అవుతుంది.
మిడ్ పాయింట్ : సంపూర్నేష్ బాబు చనిపోవడం. అతన్ని బావి లో వేయడం.
సెకండ్ హాఫ్ ఓపెన్ చేయగానే సంపూర్నేష్ బాబు కోసం ప్రజలు ఎదురు చూస్తుంటారు. తీరాచూస్తే సంపూర్నేష్ బాబు ఆఫ్రికా లో ఒక స్విమ్మింగ్ పూల్ లో తేలతాడు. అక్కడ వున్నసింగం తండ్రి జంగం (పృద్వీ రాజ్ ) సింగం ని కాపాడతాడు. సింగం నువ్వు పోలీస్ ఎలా అయ్యావు రా...? అని అడిగితే ,సింగం తన ఫ్లాష్ బ్యాక్ చెబుతాడు.
ఫ్లాష్ బ్యాక్ : ఒక జోక్ చెప్పడం ద్వారా సింగం ప్రిన్సిపాల్ నవ్వి నవ్వి చనిపోతే , సింగం ని జైలు లో వేస్తారు. అక్కడ ఒక తప్పించుకున్న తీవ్రవాద ఖైదీ కి కుడా ఆ జోక్ చెబుతాడు.
తీవ్రవాద ఖైదీ కుడా నవ్వి నవ్వి చనిపోతే , సింగం కి ప్రభుత్వం పోలీస్ ఆఫీసర్ ని చేస్తుంది .
ఈ ఫ్లాష్ బ్యాక్ విన్న జంగం (పృద్వీ రాజ్ ), సింగం కి ట్రైనింగ్ ఇచ్చి మళ్ళీ సింగరాయ కొండ కి స్విమ్మింగ్ ఫూల్ ద్వారా పంపుతాడు .
ప్రీ క్లైమాక్స్ : లింగం తన తల్లి ని కిడ్నాప్ చేస్తాడు . ఈ కిడ్నాప్ నుండి తల్లి ని కాపాడి ,లింగాన్ని చంపేస్తాడు సింగం . దానితో సినిమా కధ అయిపోతుంది .
కలిసోచ్చే అంశాలు :
- విక్రమార్కుడు , గబ్బర్ సింగ్ , లెజెండ్ ,తమిళ్ కత్తి , టెంపర్ ...ఇలా అన్నీ సినిమా లలో సీన్ లు , డైలాగ్ లు చాలా బాగా రాసుకున్నారు.
- సంపూర్నేష్ బాబు ఎనర్జిటిక్ నటన ...
- ఫాస్ట్ గా వెళ్ళి పోయే కధనం .....
సినిమా ఈక్వేషన్ : “విక్రమార్కుడు” చంబల్ లోయ బ్యాక్ డ్రాప్ ని సింగరాయ కొండ గా మర్చి , వెటకారం కామెడి చేస్తే =సింగం 1 2 3
సినిమా ఎవరికి నచ్చుతుంది :
- వెటకారం బాగా ఇష్టపడే వాళ్ళకు బాగా నచ్చుతుంది . “సుడిగాడు”, ” హృదయ కాలేయం ” సినిమా లు ఇష్టపడే వారికి సినిమా నచ్చుతుంది .
- కామెడీ సినిమా చూసే వాళ్ళకు నచ్చుతుంది.
పంచ్ లైన్ : మైండ్ పెట్టకుండా , నవ్వుకోవడానికి , సంపూర్నేష్ డైలాగ్ లు , ఆక్షన్ చూడటానికి వెళ్ళవచ్చు.